E-Paper
Advertisement

Jadcherla: దారుణం.. మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న కుక్క.. నిద్రపోతున్న జడ్చర్ల ఆసుపత్రి యంత్రాంగం!

Jadcherla: దారుణం.. మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న కుక్క.. నిద్రపోతున్న జడ్చర్ల ఆసుపత్రి యంత్రాంగం!
Advertisement

Jadcherla: దారుణం.. చనిపోయిన తర్వాత కూడా మనుషులని వదలని కుక్కలు.. మార్చురీలో శవాన్ని పీక్కుతిన్న వీధి కుక్క.. పూర్తి వివరాల్లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని నాగసాల గ్రామానికి చెందిన పోలే భీమేశ్వర్ (32) అనే వ్యక్తి సోమవారం ఉదయం స్థానిక చెరువులో శవమై కనిపించాడు. మృతుడు ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులకు, అతను విగతజీవిగా కనిపించాడనే వార్త తీవ్ర దిగ్భ్రాంతిని మిగిల్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మార్చురీలో భద్రతా వైఫల్యం
పోస్టుమార్టం నిమిత్తం భీమేశ్వర్ మృతదేహాన్ని జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. అయితే, అక్కడ కనీస భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, మార్చురీ తలుపులు సరిగా లేకపోవడంతో ఒక వీధి కుక్క లోపలికి చొరబడింది. అత్యంత భయానక స్థితిలో, ఆ కుక్క మృతదేహాన్ని పీక్కుతింటూ కనిపించడం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది. మరణించిన వ్యక్తికి గౌరవప్రదమైన వీడ్కోలు పలకాల్సిన చోట ఇలాంటి ఘటన జరగడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యాన్ని సూచిస్తోంది.

Advertisement

సోషల్ మీడియాలో వైరల్, ప్రజా స్పందన
ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించాయి. కుక్క శవాన్ని పీక్కుతింటున్న వీడియో చూసిన నెటిజన్లు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “మనిషి ప్రాణానికి విలువ లేదు సరే, కనీసం శవానికి కూడా గౌరవం దక్కదా?” అంటూ ఆసుపత్రి సిబ్బందిని, అధికారులను నిలదీస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఆసుపత్రి నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లో 36 మంది

Advertisement

కుటుంబ సభ్యుల ఆవేదన – విచారణకు డిమాండ్
కన్న కొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు, ఈ ఘటన మరింత క్షోభను మిగిల్చింది. ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతదేహానికి ఈ గతి పట్టిందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మార్చురీలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×