E-Paper
Advertisement

బడ్జెట్‌లోనే బుల్లి ఫ్యాన్లు.. రూ.1000 లోపు టాప్ 5 మోడల్స్ ఇవే!

బడ్జెట్‌లోనే బుల్లి ఫ్యాన్లు.. రూ.1000 లోపు టాప్ 5 మోడల్స్ ఇవే!
Advertisement

Best small fans under 1000 rupees: ఎండలు పెరిగిపోతుంటే ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా ఉక్కపోతతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెద్ద ఫ్యాన్లు ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం కూర్చునే చోటికి గాలి సరిగ్గా రాకపోవచ్చు. ముఖ్యంగా ఆఫీస్ టేబుల్స్, కిచెన్ లేదా చిన్న రూముల్లో పర్సనల్ గాలి కోసం ‘చిన్న ఫ్యాన్లు’చాలా బాగా ఉపయోగపడతాయి. తక్కువ బడ్జెట్‌లో, అంటే రూ.1,000 లోపే లభించే టాప్ 5 బెస్ట్ చిన్న ఫ్యాన్ల వివరాలు, వాటి ఫీచర్లు , ఖచ్చితమైన ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.1,000 లోపు  టాప్ చిన్న ఫ్యాన్లు :

1. బజాజ్ పైరి ఫ్యాన్ (Bajaj Pyree 178 mm Personal Fan):

నమ్మకమైన బ్రాండ్ నుంచి తక్కువ ధరలో మంచి క్వాలిటీ ఫ్యాన్ కావాలనుకుంటే బజాజ్ పైరి బెస్ట్ ఛాయిస్. ఇది చిన్నగా ఉంటూనే ఎక్కువ గాలిని ఇస్తుంది. దీన్ని టేబుల్‌పై పెట్టుకోవచ్చు లేదా గోడకు కూడా తగిలించుకోవచ్చు ). దీని బాడీ చాలా బలంగా ఉంటుంది. అంతే కాకుండా ఇది నడుస్తున్నప్పుడు పెద్దగా శబ్దం చేయదు. కరెంట్ కూడా చాలా తక్కువ ఖర్చవుతుంది. దీని ధర రూ. 949.

2. ఓరియంట్ ఎలక్ట్రిక్ డెస్క్ ఫ్యాన్ (Orient Electric Desk Fan – 6 Inch):

Advertisement

ఓరియంట్ సంస్థ నుంచి వస్తున్న ఈ చిన్న డెస్క్ ఫ్యాన్ ఆఫీస్ టేబుల్స్, కిచెన్ రూములకు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. దీని రెక్కల డిజైన్ వల్ల గాలి గది అంతటా వేగంగా విస్తరిస్తుంది. దీని యాంగిల్‌ను మనకు నచ్చినట్లు పైకి, కిందికి తిప్పుకోవచ్చు. తక్కువ వోల్టేజ్ ఉన్నప్పుడు కూడా ఇది మంచి వేగంతో గాలిని అందిస్తుంది. దీని ధర రూ. 899.

3. క్రోంప్టన్ వేవ్ ఫ్లో పర్సనల్ ఫ్యాన్ (Crompton Wave Flo 150mm Fan):

క్రోంప్టన్ బ్రాండ్ ఫ్యాన్లు వాటి లాంగ్ లైఫ్ , స్పీడ్‌కు పేరుగాంచాయి. ఈ చిన్న ఫ్యాన్ కూడా చాలా పవర్‌ఫుల్ మోటార్‌తో వస్తుంది. దీనికి చుట్టూ సేఫ్టీ గ్రిల్ ఉంటుంది. కాబట్టి పిల్లలు ఉన్న ఇళ్లలో కూడా సురక్షితంగా వాడుకోవచ్చు. దీని మోటార్ వేడెక్కకుండా థర్మల్ ఓవర్‌లోడ్ ప్రొటెక్షన్ ఫీచర్ ఇందులో ఇచ్చారు. దీని వల్ల ఫ్యాన్ ఎక్కువ కాలం మన్నుతుంది. దీని ధర రూ.999.

4. గేలాడ్ 3-ఇన్-1 రీఛార్జబుల్ టేబుల్ ఫ్యాన్ (Gailad 3-in-1 Rechargeable Fan with LED Light):

Advertisement

కరెంట్ పోయినప్పుడు కూడా గాలి కావాలనుకునే వారికి ఇదొక సూపర్ ఆప్షన్. ఇది బ్యాటరీతో నడిచే రీఛార్జబుల్ ఫ్యాన్. దీన్ని యూఎస్‌బీ (USB) కేబుల్ ద్వారా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో చిన్న ఎల్‌ఈడీ లైట్ కూడా ఉంటుంది. కాబట్టి కరెంట్ పోయినప్పుడు టార్చ్ లాగా కూడా దీనిని వాడుకోవచ్చు. దీన్ని ఈజీగా బ్యాగులో పెట్టుకుని ప్రయాణాల్లో కూడా తీసుకువెళ్లవచ్చు. దీని ధర కేవలం రూ.649 మాత్రమే.

Also Read: తక్కువ కరెంట్ బిల్లుతో.. సూపర్ కూలింగ్ ఇచ్చే బెస్ట్ ఏసీ ఏది?

5. పిజియన్ మల్టీ-పర్పస్ మినీ ఫ్యాన్ (Pigeon Multi-Purpose Mini Table Fan):

పిజియన్  నుంచి వస్తున్న ఈ మినీ ఫ్యాన్ బరువు చాలా తక్కువగా ఉంటుంది. ఇంటి అవసరాలకు ఇది బాగా సరిపోతుంది. ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. దీని స్పీడ్‌ను కంట్రోల్ చేయడానికి వెనక వైపు బటన్ ఉంటుంది. దీని లుక్ చాలా మోడ్రన్‌గా ఉంటుంది. అంతే కాకుండా దీనిని శుభ్రం చేయడం కూడా చాలా ఈజీ. దీని ధర .799 మాత్రమే.

ఆఫీస్ టేబుల్ పైన పెట్టుకోవాలన్నా.. కిచెన్‌లో వంట చేసేటప్పుడు ఉక్కపోత తగ్గాలన్నా ఈ చిన్న ఫ్యాన్లు చాలా బాగా పని చేస్తాయి. పైన తెలిపిన ఫ్యాన్లన్నీ రూ.1,000 లోపే లభిస్తూ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. మీకు కరెంట్ లేనప్పుడు కూడా కావాలనుకుంటే.. రీఛార్జబుల్ మోడల్ ఎంచుకోండి. లేదు పవర్‌ఫుల్ గాలి కావాలనుకుంటే బజాజ్ లేదా క్రోంప్టన్ బ్రాండ్లను ఎంచుకోవచ్చు.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×