E-Paper
Advertisement

తక్కువ కరెంట్ బిల్లుతో.. సూపర్ కూలింగ్ ఇచ్చే బెస్ట్ ఏసీ ఏది?

తక్కువ కరెంట్ బిల్లుతో.. సూపర్ కూలింగ్ ఇచ్చే బెస్ట్ ఏసీ ఏది?
Advertisement

LG Vs Samsung Vs Haier: ఎండలు మండిపోతున్నప్పుడు ఇంట్లో ఏసీ ఉండటం లగ్జరీ కాదు, అత్యవసరం. అయితే ఏసీ కొనేటప్పుడు మన మైండ్‌లోకి వచ్చే మొదటి ప్రశ్న “ఏ బ్రాండ్ తక్కువ కరెంట్ బిల్లుతో బెస్ట్ కూలింగ్ ఇస్తుంది?” అనేది. ప్రస్తుతం మార్కెట్లో ఎల్‌జీ (LG), శామ్‌సంగ్ (Samsung), హైయర్ (Haier) బ్రాండ్లు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఇవన్నీ ఇన్వర్టర్ టెక్నాలజీ, స్మార్ట్ ఫీచర్లతో వస్తున్నప్పటికీ.. కరెంట్ ఆదా., లాంగ్ రన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. దేని ప్రత్యేకతలు దానికున్నాయి. ఈ మూడింటిలో మీ ఇంటికి ఏది బెస్ట్ ఛాయిస్ అవుతుందో క్లియర్ గా తెలుసుకుందాం.

LG Vs Samsung Vs Haier: బెస్ట్ ఎనర్జీ ఎఫిషియన్సీ , పర్ఫార్మెన్స్ దేనిది?

1. ఎల్‌జీ స్ప్లిట్ ఏసీ (LG Split AC) – కరెంట్ ఆదాలో కింగ్:
ఎల్‌జీ సంస్థ తన డ్యూయల్ ఇన్వర్టర్ కంప్రెషర్ టెక్నాలజీకి ఎంతో పేరుగాంచింది. ఇది గదిలోని వేడిని బట్టి ఏసీని చాలా చక్కగా నియంత్రిస్తుంది.
ఎల్‌జీ ఏసీలు బెస్ట్ రేటింగ్‌తో వస్తాయి. వీటిలో ఉండే ‘6-in-1 కన్వర్టిబుల్’ సౌకర్యం ద్వారా గదిలో ఉన్న మనుషుల సంఖ్యను బట్టి ఏసీ సామర్థ్యాన్ని 40 శాతానికి తగ్గించుకోవచ్చు. దీని వల్ల కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది. 100 శాతం రాగి కాయిల్స్‌తో పాటు ‘ఓషియన్ బ్లాక్ ప్రొటెక్షన్’ పూత ఉండటం వల్ల ఏసీకి అస్సలు తుప్పు పట్టదు. తీరప్రాంతాల్లో లేదా ఎక్కువ కాలుష్యం ఉండే నగరాల్లో కూడా ఇది ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది.

Advertisement

2.శామ్‌సంగ్ స్ప్లిట్ ఏసీ (Samsung Split AC)-లేటెస్ట్ ఫీచర్లు:
శామ్‌సంగ్ ఎప్పుడూ సరికొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇస్తుంది. దీనిలోని డిజిటల్ ఇన్వర్టర్ బూస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ గదిని 43 శాతం వేగంగా చల్లబరుస్తుంది. శామ్‌సంగ్ ఏసీలు కూడా 5-స్టార్ రేటింగ్‌తో మంచి కరెంట్ పొదుపును అందిస్తాయి. ముఖ్యంగా దీనిలోని ‘విండ్‌ఫ్రీ’మోడల్స్, చల్లటి గాలి నేరుగా మన మొహం మీద కొట్టకుండా.. వేల కొద్దీ చిన్న రంధ్రాల ద్వారా గది అంతటా సమానంగా చల్లదనాన్ని పంచుతూ.. కరెంట్‌ను ఆదా చేస్తాయి. మొబైల్ యాప్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి.. ఫోన్ నుంచే ఎంత కరెంట్ ఖర్చవుతుందో చూసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ మీ అలవాట్లను బట్టి చల్లదనాన్ని దానంతట అదే సర్దుబాటు చేస్తుంది.

Also Read: కరెంట్, నీటిని ఆదా చేసే.. బెస్ట్ స్మార్ట్ వాషింగ్ మెషీన్స్

Advertisement

3. హైయర్ స్ప్లిట్ ఏసీ (Haier Split AC)-తక్కువ ధర, సూపర్ కూలింగ్:
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రోజులు పని చేయాలనుకునే వారికి హైయర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దీని లోని సూపర్ సోనిక్ కూలింగ్ ఫీచర్ కేవలం 10 సెకన్లలోనే చల్లటి గాలిని ఇవ్వడం మొదలుపెడుతుంది. హైయర్ కూడా ‘7-in-1 కన్వర్టిబుల్’మోడ్‌లతో వస్తుంది. ఇది ఎల్‌జీ,శామ్‌సంగ్‌లతో సమానంగా కరెంట్‌ను ఆదా చేయకపోయినా.. దీని 5-స్టార్ మోడల్స్ తక్కువ ధరలో చాలా కరెంట్ ఎక్కువ ఆదా చేస్తాయి. బయట ఎండలు 60 డిగ్రీలకు చేరినా కూడా ఇది గదిని మంచులా చల్లగా ఉంచగలదు. అంతేకాదు.. దీనిలోని ‘ఫ్రాస్ట్ సెల్ఫ్-క్లీన్’ ఫీచర్ ద్వారా బటన్ నొక్కగానే ఏసీ లోపల ఉన్న మురికిని దానంతట అదే శుభ్రం చేసుకుంటుంది.

ఏది కొనాలి?
1.మీకు కరెంట్ బిల్లు చాలా తక్కువ రావాలి. ఏసీ ఎక్కువ కాలం ఏసీ పాడవకూడదంటే .. LG బెస్ట్.

2.మీకు నేరుగా గాలి తగలకూడదు, ఫోన్ ద్వారా నియంత్రించే లేటెస్ట్ ఫీచర్లు కావాలనుకుంటే.. Samsung వైపు వెళ్ళొచ్చు.

3. తక్కువ ధరలో.. ఎండలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సూపర్ ఫాస్ట్ చల్లదనం కావాలనుకుంటే.. Haier పర్ఫెక్ట్ ఆప్షన్.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×