Best Tablets 2026: ప్రస్తుత రోజుల్లో స్టూడెంట్స్ నుంచి ఆఫీస్ వర్క్ చేసేవారి వరకు ప్రతి ఒక్కరికీ టాబ్స్ చాలా అవసరమైపోయింది. క్లాసులు వినడానికైనా, సరదాగా సినిమాలు చూడటానికైనా లేదా ఆఫీస్ పనులు చక్కబెట్టుకోవడానికైనా ఫోన్ కంటే పెద్ద స్క్రీన్ ఉండే ట్యాబ్‌లనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అందుకే టెక్ కంపెనీలు కూడా సామాన్యులు సైతం కొనగలిగేలా రూ.25,000 లోపే అదిరిపోయే ఫీచర్లతో కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెస్తున్నాయి. మరి 2026లో ఆ రేంజ్‌లో అందుబాటులో ఉన్న ది బెస్ట్ ఆప్షన్స్ ఏంటో ఓసారి చూసేద్దాం రండి..
చదువుకోవడానికి లేదంటే ఆఫీసు పనుల కోసం మంచి ట్యాబ్ కోసం వెతుకుతుంటే ఈ Lenovo Idea Tab బెస్ట్ ఛాయిస్ అవుతుంది. దీనిలో 11 అంగుళాల పెద్ద డిస్‌ప్లేతో పాటు 2.5K రిజల్యూషన్ ఇచ్చారు. దీంతో వీడియోలు క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తాయి. అలాగే దీనిలో వాడిన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ వల్ల ట్యాబ్ ఎక్కడా ఆగకుండా చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. దీని ధర సుమారు రూ.24,998 గా ఉంది. నోట్స్ రాసుకోవడానికి ఈ ట్యాబ్‌లో స్పెషల్ AI ఫీచర్లు కూడా ఉండటం విశేషం.
చూడటానికి స్టైలిష్‌గా ఉండి.. పర్ఫార్మెన్స్ అదిరిపోవాలి అనుకునే వారికి OnePlus Pad Go బాగా నచ్చుతుంది. దీని 11.35 అంగుళాల డిస్‌ప్లేలో సినిమాలు చూస్తుంటే థియేటర్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. అలాగే ఈ ట్యాబ్‌లో 8000mAh బ్యాటరీ ఉంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడేయొచ్చు. అలాగే WI-Fiతో పాటు 4G కూడా వాడుకోవచ్చు. రూ. 21,999 ధరలో లభించే ఈ ట్యాబ్‌లో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది.
Also Read: రూ.100 లోపే అదిరిపోయే డేటా ప్లాన్స్.. Jio, Airtel, Vi, BSNL ఏదైనా సరే.. యూజర్లకు పండగే!
తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకునే వారికి Redmi Pad 2ని మించింది లేదు. ఈ ట్యాబ్‌లో ఏకంగా 9000mAh భారీ బ్యాటరీని అమర్చారు. ఇంకో విశేషం ఏంటంటే.. దీని బాక్స్‌లోనే రెడ్‌మీ స్మార్ట్ పెన్ కూడా ఇస్తున్నారు. బొమ్మలు గీసేవారికి, క్లాస్ నోట్స్ రాసుకునే వారికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఈ ట్యాబ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి.. ప్రయాణాల్లో కూడా ఈజీగా తీసుకెళ్లవచ్చు. దీని ధర సుమారు రూ.20,999 గా ఉంది.
పాటలు వినడం లేదా సినిమాలు చూడటం మీ హాబీ అయితే.. ఈ Lenovo Tab Plus బెస్ట్ ఆప్షన్. దీనిలో JBL స్పీకర్లు ఉన్నాయి కాబట్టి.. సౌండ్ అదిరిపోతుంది. ట్యాబ్ వెనుక ఉన్న కిక్‌స్టాండ్ సాయంతో దీన్ని టేబుల్‌పై నిలబెట్టి కాలు మీద కాలేసుకుని సినిమాలు చూడొచ్చు. 11 అంగుళాల 2K డిస్‌ప్లేతో వచ్చే ఈ ట్యాబ్ ధర అమెజాన్‌లో రూ.24,053కే అందుబాటులో ఉంది.
చాలా తక్కువ బడ్జెట్‌లో కావాలి అనుకుంటే.. OnePlus Pad Liteను కొనుగోలు చేయొచ్చు. రూ.15,999కే లభించే ఈ ట్యాబ్‌లో ఏకంగా 9340mAh పవర్‌ఫుల్ బ్యాటరీ ఉంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 80 గంటల పాటు నిరంతరంగా పాటలు వినొచ్చని కంపెనీ చెబుతోంది. తక్కువ ధరలో మంచి స్క్రీన్, నాణ్యమైన స్పీకర్లు కావాలనుకునే వారికి ఈ ట్యాబ్ బాగా సెట్ అవుతుంది.
Also Read: వన్‌ప్లస్ నార్డ్ CE 6 సిరీస్ వచ్చేస్తోంది.. 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో మే 7న దబిడి దిబిడే!