E-Paper
Advertisement

వన్‌ప్లస్ నార్డ్ CE 6 సిరీస్ వచ్చేస్తోంది.. 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో మే 7న దబిడి దిబిడే!

వన్‌ప్లస్ నార్డ్ CE 6 సిరీస్ వచ్చేస్తోంది.. 144Hz డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో మే 7న దబిడి దిబిడే!
Advertisement

OnePlus New Phones 2026: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ ఫోన్లకు యువతలో ఎప్పుడూ మంచి ఫాలోయింగ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా మిడిల్‌క్లాస్ కుర్రాళ్లకు Nord సిరీస్ అంటే ఒక రకమైన పిచ్చి. తక్కువ ధరలో మంచి లుక్, ప్రీమియం ఫీచర్లు వస్తుందని నమ్ముతారు కూడా. ఇప్పుడు అదే నమ్మకంతో వన్‌ప్లస్ తమ కొత్త మోడల్స్ Nord CE 6, Nord CE 6 Lite లను భారత్‌లో మే 7న విడుదల చేయనుంది.

ఈ ఫోన్లు అయితే మే 7న విడుదలవుతాయి కానీ, విక్రయానికి అందుబాటులోకి వచ్చే డేట్లు మాత్రం వేరుగా ఉన్నాయి. Nord CE 6ను కొనుగోలు చేయాలనుకుంటే.. మే 8న మధ్యాహ్నం 12 గంటల నుంచి అమ్మకాలు మొదలవుతాయి. ఇక కొంచెం తక్కువ ధరలో ఉండే Nord CE 6 Lite కోసం మే 12 వరకు వెయిట్ చేయాల్సిందే. అమెజాన్ వెబ్‌సైట్‌తో పాటు వన్‌ప్లస్ స్టోర్లలో ఈ ఫోన్లు అందుబాటులోకి వస్తాయి.

Advertisement

Also Read: ఈ అవకాశం మళ్లీ రాకపోవచ్చు.. iPhone 17 Proపై క్రేజీ డిస్కౌంట్, ఇవిగో పూర్తి వివరాలు!

Nord CE 6 పవర్‌ఫుల్ ఫోన్ అనే చెప్పాలి. దీనిలో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ వాడుతున్నారు. దీంతో ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదు. ముఖ్యంగా గేమ్స్ ఆడేవారికి పండుగే. ఎందుకంటే.. ఈ ఫోన్‌లో 144FPS సపోర్ట్ చేసే డిస్‌ప్లేను ఇస్తున్నారు. తద్వారా ఎండలో బయటకు వెళ్లినా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా మంచి బ్రైట్‌నెస్ కూడా ఉంటుంది.

Advertisement

ఈ రెండు ఫోన్ల లోనూ హైలైట్ ఏమిటంటే.. వీటి భారీ బ్యాటరీనే. Nord CE 6లో ఏకంగా 8,000mAh బ్యాటరీ వస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులు అసలు ఛార్జర్ అవసరమే ఉండదు. ఇక ఫొటోల కోసం 50MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 32MP కెమెరా కూడా దీనిలో ఉన్నాయి.

తక్కువ బడ్జెట్‌లో Lite లైట్ వెర్షన్ కావాలనుకుంటే.. Nord CE 6 Liteను కొనుగోలు చేయొచ్చు. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 చిప్‌సెట్ వాడుతున్నారు. తక్కువ ధరలో ఉన్నా సరే.. ఇందులో కూడా 7,000mAh పెద్ద బ్యాటరీని ఇచ్చారు. ఇక లుక్ పరంగా కూడా ఫ్లాట్ డిస్‌ప్లేతో ఫోన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది.

టెక్ నిపుణులు అంచనా ప్రకారం.. Nord CE 6 Lite రూ.25 వేల లోపు ఉండొచ్చు. ఇక Nord CE 6 మాత్రం రూ.30 వేల వరకు ఉండే ఛాన్స్ ఉంది. మంచి స్క్రీన్, పవర్‌ఫుల్ బ్యాటరీ కావాలనుకునే వారు ఇంకొన్ని రోజులు ఓపిక పడితే ఈ లేటెస్ట్ వన్‌ప్లస్ ఫోన్లను సొంతం చేసుకోవచ్చు.

Also Read: వావ్.. లాంచ్ అయిన కొద్దిరోజులకే Samsung Galaxy A37పై ఊహించని డిస్కౌంట్!

Related News

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×