E-Paper
Advertisement

ఎండలు ఎంత దంచికొట్టినా.. ఈ Tower ACల ముందు బలాదూరే, టాప్ లిస్ట్‌లో ఉన్న బ్రాండ్స్ ఇవే!

ఎండలు ఎంత దంచికొట్టినా.. ఈ Tower ACల ముందు బలాదూరే, టాప్ లిస్ట్‌లో ఉన్న బ్రాండ్స్ ఇవే!
Advertisement

Best Tower ACs 2026: పెద్ద రూమ్‌లు, ఆఫీసులు, షోరూమ్‌లు లేదా కమర్షియల్ స్పేస్‌లలో వేసవి వేడిని తట్టుకోవడానికి సాధారణ ఏసీలు సరిపోవు. అలాంటి చోట్ల సూపర్ కూలింగ్ కోసం టవర్ ఏసీలు పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం మార్కెట్లో బ్లూ స్టార్, వోల్టాస్, క్యారియర్, డ్రైకిన్ వంటి బ్రాండ్లు నమ్మకమైన పర్ఫార్మెన్స్‌తో మంచి మోడళ్లను అందిస్తున్నాయి. గోడకు పెట్టే వీలు లేని చోట్ల, ఎక్కువ విస్తీర్ణంలో గాలి ప్రసరించాలన్నా ఈ టవర్ ఏసీలే బెస్ట్ చాయిస్.

టవర్ ఏసీల ప్రత్యేకతలివే:

పెద్ద హాల్స్, రెస్టారెంట్లు, దుకాణాల్లో తక్కువ సమయంలోనే ఎక్కువ కూలింగ్ అందించడం టవర్ ఏసీల ప్రత్యేకత. ఇవి గది మూలమూలకూ చల్లటి గాలిని సమానంగా పంపుతాయి. ప్రస్తుత మోడళ్లలో టర్బో కూలింగ్, ఆటో రీస్టార్ట్, సులువైన కంట్రోల్స్ వంటి ఆధునిక ఫీచర్లు వస్తున్నాయి. సాధారణ ఏసీలతో పోలిస్తే వీటి ధర కాస్త ఎక్కువే అయినా, అవి ఇచ్చే కూలింగ్ కెపాసిటీ ముందు ఆ ధర పెద్ద విషయమేమీ కాదు.

బ్లూ స్టార్ వెర్టికూల్:

Advertisement

పెద్ద కమర్షియల్ స్పేస్ ఉండి.. రోజంతా ఏసీ నడవాల్సిన అవసరం ఉంటే ఈ ‘బ్లూ స్టార్ 4.0 టన్ వెర్టికూల్ టవర్ ఏసీ’ చాలా బాగా సెట్ అవుతుంది. బ్యాంక్ హాల్స్, ట్రైనింగ్ సెంటర్లు, పెద్ద రీటెయిల్ స్టోర్ల కోసం దీనిని తయారు చేశారు. 4 టన్ల కెపాసిటీ ఉండటం వల్ల ఎంత పెద్ద ఏరియానైనా ఇది ఈజీగా చల్లబరుస్తుంది. దీని బిల్డ్ క్వాలిటీ చాలా బలంగా ఉంటుంది. దీంతో ఎక్కువ కాలం మన్నిక వస్తుంది.

Also Read: రూ.500 లోపు బెస్ట్ వైర్డ్ ఇయర్‌ఫోన్స్.. వైర్‌లెస్ కంటే క్లియర్ సౌండ్ అంటున్నారు మ్యూజిక్ లవర్స్!

వోల్టాస్ పోర్టబుల్ ఏసీ:

Advertisement

ఒకే చోట ఫిక్స్ కాకుండా.. అవసరాన్ని బట్టి ఏసీని ఇటూ అటూ జరుపుకోవాలి అనుకునేవారికి ఈ ‘వోల్టాస్ 4 టన్ పోర్టబుల్ టవర్ ఏసీ’ అద్భుతంగా పనిచేస్తుంది. ఎగ్జిబిషన్ హాల్స్, ఈవెంట్ వెన్యూలు, టెంపరరీ ఆఫీసులకు ఇది పర్ఫెక్ట్. 4 టన్ల పవర్‌ఫుల్ కూలింగ్‌తో పాటు దీనికి చక్రాలు ఉండటం వల్ల మనకు నచ్చిన చోటికి మార్చుకోవచ్చు. ఫ్లెక్సిబిలిటీ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

పెద్ద స్పేస్‌లకే ఎందుకు ప్రాధాన్యత?

ఈ టవర్ ఏసీలు చల్లటి గాలిని చాలా దూరం వరకు నెట్టగలవు. దీనివల్ల ఏసీ దగ్గరే కాకుండా గది చివరన కూర్చున్న వారికి కూడా సమానంగా చల్లదనం అందుతుంది. పైగా వీటి ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ కూడా మిగతా సెంట్రల్ ఏసీలతో పోలిస్తే చాలా సులువుగా ఉంటుంది. అందుకే బిజినెస్ నడిపేవారు ఎక్కువ శాతం ఈ మోడళ్లపైనే మొగ్గు చూపుతారు.

కొనే ముందు ఏం చూసుకోవాలి?

టవర్ ఏసీ కొనేటప్పుడు మీ రూమ్ సైజును బట్టి కెపాసిటీని ఎంచుకోవాలి. సుమారు 300 చదరపు అడుగుల లోపు స్థలానికి 2 టన్ల ఏసీ సరిపోతుంది. అంతకంటే.. పెద్ద స్పేస్ ఉంటే మాత్రం కచ్చితంగా 4 టన్ల మోడల్‌ను కొనుగోలు చేయడం ఉత్తమం. అలాగే పవర్ వినియోగం, మెయింటెనెన్స్ ఖర్చులను కూడా ఒకసారి చూసుకోవాలి.

Also Read: ఫ్లిప్‌కార్ట్‌లో Samsung Galaxy A35 5Gపై రూ.14,000 తగ్గింపు.. ఇప్పుడు ఎంతకు దొరుకుతోందంటే?

Related News

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, లైవ్ టీవీ ఫ్రీ.. ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్‌తో ఇన్ని లాభాలా ?

రూ.55 వేలలో అత్యుత్తమ టీవీలు.. ఫీచర్లు చూస్తే.. అంత పెట్టినా పర్లేదంటారు!

లావా నుంచి కొత్త బడ్జెట్ ఫోన్లు.. రూ.8,999 ప్రారంభ ధరకే Lava Virat V1, V1 5G లాంచ్!

యాపిల్ లేటెస్ట్ ఫీచర్.. ఐఫోన్‌లో కొత్త Siri AI డిజైన్‌ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?

5000 నిట్స్ బ్రైట్‌నెస్, ఐదేళ్లు అప్‌డేట్స్.. శాంసంగ్ నుంచి కేక పుట్టించే స్మార్ట్‌వాచ్‌లు!

SD కార్డ్, క్లౌడ్ పేమెంట్స్ అక్కర్లేదు.. ఈ 5 స్టెప్స్‌ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ను పెంచుకోండి!

రూ.15 వేలలోపు బెస్ట్ వాషింగ్ మెషీన్ కావాలా? మీ కోసం పర్ఫెక్ట్ ఛాయిస్

రూ. 2వేలలోపు బెస్ట్ BLDC ఫ్యాన్ కావాలా? దీనిపై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×