Galaxy A35 5G Price Cut: తక్కువ బడ్జెట్‌లో మంచి ప్రీమియం ఫోన్ కొనాలనుకుంటున్న వారికి ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. Samsung Galaxy A35 5Gపై భారీగా ధర తగ్గించింది. భారతదేశంలో రూ.32,999 ప్రారంభ ధరతో లాంచ్ అయిన ఈ ప్రీమియం మిడ్‌రేంజ్ ఫోన్, ఇప్పుడు ఏకంగా రూ.14,000 పైగా తగ్గింపుతో లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ విలువ ఇప్పుడు మరింత పెరిగింది. బడ్జెట్ పరిధిలో మంచి బ్రాండెడ్ ఫోన్ కోసం చూస్తున్న వారికి ఇది నిజంగా సూపర్ ఛాన్స్.
లాంచ్ సమయంలో కాస్త ఖరీదైనదిగా అనిపించిన గెలాక్సీ A35 5G.. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ డిస్కౌంట్ ఆఫర్‌లో కేవలం రూ.18,999కే అందుబాటులో ఉంది. బ్యాంకు ఆఫర్లను ఉపయోగించుకుంటే ఈ ధర ఇంకా తగ్గుతుంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.950 వరకు అదనపు తగ్గింపు పొందవచ్చు. నెలకు రూ.668 నుంచి ప్రారంభమయ్యే నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా ఉన్నాయి. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.13,250 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది.
తక్కువ ధరకే వస్తున్నప్పటికీ ఫీచర్ల విషయంలో శాంసంగ్ ఎక్కడా రాజీ పడలేదు. దీనిలో 6.7 అంగుళాల పెద్ద అమోలెడ్ స్క్రీన్ ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 1,900 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది కాబట్టి.. ఎండలో కూడా డిస్‌ప్లే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. దీనికి తోడు 12GB RAM, 256GB స్టోరేజ్ ఉండటం వల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది.
Also Read: 90W ఛార్జింగ్, 50MP సోనీ కెమెరాతో Vivo V70 Lite లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం ఈ Galaxy A35 5G ఫోన్‌లో 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్, 5MP మాక్రో కెమెరాలను ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం 12MP కెమెరా ఉంది. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా.. శాంంసంగ్ ఈ ఫోన్‌కు 6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్లు, సెక్యూరిటీ అప్‌డేట్లను ఇస్తామని ప్రామిస్ చేసింది. ఇక 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5,000mAh బ్యాటరీ రోజంతా బ్యాకప్ ఇస్తుంది.
రూ.20 వేల లోపు బడ్జెట్‌లో బ్రాండెడ్ లుక్, లాంగ్‌టర్మ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్, మంచి కెమెరా కావాలనుకునే వారికి గెలాక్సీ A35 5G బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఒకవేళ మీ బడ్జెట్ రూ.30 వేల వరకు ఉంటే మాత్రం మార్కెట్లో కొత్తగా ఉన్న వన్‌ప్లస్ నార్డ్ 5, నథింగ్ ఫోన్ (3a) ప్రో, మోటోరోలా ఎడ్జ్ 60 ప్రో లేదా వివో V50 వంటి ఇతర ఆప్షన్లను కూడా పరిశీలించవచ్చు.
Also Read: ఇలాంటి ప్లాన్ ఎప్పుడూ చూసుండరు.. ఒక్క రీఛార్జ్‌తో 365 రోజుల వాలిడిటీ.. రాత్రిపూట ఫ్రీ డేటా!