E-Paper
Advertisement

రూ.3 వేల నుంచే బ్రాండెడ్ టవర్ కూలర్లు.. ఏసీ అంత చల్లదనం, తక్కువ విద్యుత్ వినియోగం!

రూ.3 వేల నుంచే బ్రాండెడ్ టవర్ కూలర్లు.. ఏసీ అంత చల్లదనం, తక్కువ విద్యుత్ వినియోగం!
Advertisement

Best Tower Air Coolers: ఎండలు మండిపోతున్న తరుణంలో సామాన్యులకు ఎయిర్ కండిషనర్లు కొనడం, వాటి కరెంట్ బిల్లులు భరించడం భారంగా మారుతోంది. ఇలాంటి సమయంలో తక్కువ ఖర్చుతో ఇంటిని కూల్‌గా మార్చుకోవాలనుకునే వారికి టవర్ ఎయిర్ కూలర్లు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆన్‌లైన్ మార్కెట్లో ప్రముఖ బ్రాండ్ల కూలర్లపై భారీ డిస్కౌంట్లు లభిస్తుండటంతో వీటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఆ వివరాల్లోకి వెళ్లిపోదాం రండి..

విద్యుత్ వాడకం తక్కువ:

పాతకాలపు పెద్ద కూలర్లలా కాకుండా.. టవర్ కూలర్లు చాలా స్లిమ్‌గా, స్టైలిష్‌గా ఉంటాయి. ఇవి ఇంట్లో తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి కాబట్టి.. అపార్ట్‌మెంట్‌లు, చిన్న గదులకు చక్కగా సరిపోతాయి. అంతేకాదు ఈ టవర్ కూలర్లను ఇన్వర్టర్లపై కూడా వాడుకోవచ్చు. దీనివల్ల కరెంట్ కోతలు ఉన్నప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. విద్యుత్ వినియోగం కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల సామాన్యులకు ఇవి వరంగా మారాయి.

రూ.3వేల లోపే పర్సనల్ కూలర్లు:

Advertisement

బడ్జెట్ తక్కువగా ఉన్నవారికి మార్కెట్లో రూ.3,000 ధర నుండే టవర్ కూలర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Elista COZY COOL 30, HAVAI Bullet వంటి కాంపాక్ట్ మోడల్స్ ఆన్‌లైన్ ఆఫర్లలో ఈ ధరకే లభిస్తాయి. ఇవి తక్కువ విద్యుత్ వినియోగిస్తూ చిన్న గదులు, స్టడీ టేబుల్స్ దగ్గర అద్భుతమైన చల్లదనాన్ని అందిస్తాయి.

బ్రాండెడ్ కూలర్ల ఫీచర్లు అదుర్స్:

ప్రస్తుతం మార్కెట్లో బజాజ్ TMH50 మోడల్ తమ టైఫూన్ బ్లోయర్ టెక్నాలజీతో అందరినీ ఆకట్టుకుంటోంది. అలాగే హ్యావెల్స్ జూరీ-ఎమ్ వంటి మోడల్స్ బాక్టీరియా ప్రొటెక్షన్, పూర్తిగా మూసివేయగలిగే లూవర్లతో వస్తున్నాయి. దీనివల్ల వాడనప్పుడు కూలర్ లోపలికి దుమ్ము, పురుగులు వెళ్లకుండా ఉంటాయి. ఇవి గదిని చల్లబరచడమే కాకుండా గాలిని కూడా శుద్ధి చేస్తాయి.

Advertisement

Also Read: ఏసీ బిల్లు తగ్గించే అద్భుత చిట్కా.. మేడ పైకి ఎక్కి ఇదొక్కటి చేయండి చాలు!

పెద్ద గదులకైతే ఇవే బెస్ట్:

పెద్ద హాల్స్ లేదా గదుల కోసం సమ్మర్ కూల్ సొలిటైర్ 75 లీటర్ల వంటి మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ఎయిర్ త్రో సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు బాబర్లీ అమేజ్ 50 లీటర్ల కూలర్ మోడ్రన్ ఆఫీసులకు, మధ్యస్థ గదులకు బాగా సెట్ అవుతుంది. ఈ కూలర్లలో హనీకోంబ్ ప్యాడ్స్ వాడటం వల్ల చల్లదనం ఎక్కువ సేపు ఉంటుంది.

బడ్జెట్‌లో దొరికే చిన్న కూలర్లు:

స్టడీ రూమ్స్ లేదా చిన్న క్యాబిన్ల కోసం ఎలిస్టా కోజీ కూల్ 30, హవాయి బుల్లెట్ వంటి పర్సనల్ కూలర్లు బాగా ప్రాచుర్యం పొందాయి. ఇవి తక్కువ ధరకే లభించడమే కాకుండా అద్భుతమైన పోర్టబిలిటీని అందిస్తాయి. సీజీ టీఎక్స్ 35 వంటి బడ్జెట్ ఫ్రెండ్లీ కూలర్లు కూడా ప్రస్తుతం ఆన్‌లైన్ లో మంచి డిస్కౌంట్ తో లభిస్తున్నాయి.

కూలర్ వాడేటప్పుడు పాటించాల్సినవి:

టవర్ కూలర్లు వాడేటప్పుడు గదిలో గాలి బయటకు వెళ్లేలా కిటికీలు కొద్దిగా తెరిచి ఉంచడం వల్ల ఉక్కపోత ఉండదు. ఏసీలు కొనలేని వారు, తక్కువ బడ్జెట్‌లో మంచి కూలింగ్ కోరుకునే వారు ఈ టవర్ కూలర్లను ఎంచుకోవచ్చు. స్మార్ట్ ఫీచర్లు, తక్కువ కరెంట్ బిల్లు, ఆధునిక లుక్ ఈ కూలర్లను ఈ వేసవికి బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా మారుస్తున్నాయి.

Also Read: Wi-Fi AC ఏసీ అంటే లగ్జరీ కాదు.. టైం, కరెంట్ బిల్లును సేవ్ చేసే స్మార్ట్ టెక్నాలజీ!

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×