E-Paper
Advertisement

Wi-Fi AC ఏసీ అంటే లగ్జరీ కాదు.. టైం, కరెంట్ బిల్లును సేవ్ చేసే స్మార్ట్ టెక్నాలజీ!

Wi-Fi AC ఏసీ అంటే లగ్జరీ కాదు.. టైం, కరెంట్ బిల్లును సేవ్ చేసే స్మార్ట్ టెక్నాలజీ!
Advertisement

Wi-Fi Smart Air Conditioner: నేటి ఆధునిక యుగంలో మన రోజూవారీ దినచర్యలో వాడే ప్రతి చిన్న వస్తువు అయినా చాలా స్మార్ట్‌గా మారిపోతున్నాయి. ఒకప్పుడు ఏసీ అంటే గదిని చల్లబరిచే యంత్రంలా మాత్రమే చూసేవాళ్లం. కానీ ఇప్పుడు టెక్నాలజీ పుణ్యమా అని ఏసీలు కూడా మన మాట వింటున్నాయి. ముఖ్యంగా వైఫై ఉన్న ఏసీలు ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. ఇది కేవలం లగ్జరీ కోసం కాదు.. మన లైఫ్‌స్టైల్‌ని సులభంగా మార్చే అధునాతన టెక్నాలజీ. ఈ నేపథ్యంలో వైఫై ఏసీ వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఫీచర్లు ఎలా పనిచేస్తాయి? కరెంటు బిల్లు నిజంగానే తగ్గుందా.. వంటి విషయాలు తెలుసుకుందాం.

ఎక్కడి నుంచైనా ఏసీ కంట్రోల్:

సాధారణ ఏసీ ఉన్నవాళ్లు ఇంటికి వచ్చాక స్విచ్ వేసి గది చల్లబడే వరకు చెమటలు కక్కుతూ ఎదురుచూడాలి. కానీ వైఫై ఏసీ ఉంటే ఆ కష్టం ఉండదు. ఆఫీసు నుంచి లేదా మార్కెట్ నుంచి బయలుదేరే ముందే స్మార్ట్‌ఫోన్ ద్వారా ఏసీ ఆన్ చేసుకోవచ్చు. మీరు ఇంటి తలుపు తీసి లోపలికి అడుగు పెట్టేసరికి గది కశ్మీర్‌లా చల్లగా మారిపోతుంది. అలాగే, పొరపాటున బయటకు వెళ్లేటప్పుడు ఏసీ ఆపడం మర్చిపోతే మళ్లీ ఇంటికి రావాల్సిన పనిలేదు. ఎక్కడున్నా ఫోన్ నుంచే ఆఫ్ చేసుకోవచ్చు.

నిద్రకు భంగం కలగదు:

Advertisement

రాత్రి పడుకునేటప్పుడు 20 డిగ్రీల్లో ఏసీ పెట్టుకుంటే.. తెల్లవారుజామున బాగా చలి వేసి నిద్రలో కూడా దుప్పటి కోసం వెతుక్కుంటాం. అయితే వైఫై ఏసీలతో అలాంటి ఇబ్బంది ఉండదు. ఏ సమయంలో ఉష్ణోగ్రత ఎంత ఉండాలో మనం ముందే సెట్ చేసుకోవచ్చు. ఉదా: రాత్రి చల్లగా ఉండాలని, తెల్లవారుజామున కొంచెం టెంపరేచర్ పెరగాలని షెడ్యూల్ చేస్తే దానంతట అదే మారుతుంది. దీనివల్ల నిద్రకు ఎలాంటి డిస్టబెన్స్ ఉండదు.

Also Read: టెక్ ప్రియులు ఎంతగానో వెయిట్ చేసిన డీల్ ఇదే.. Galaxy S25 Ultraపై అద్భుతమైన ధర తగ్గింపు!

అలెక్సా.. ఏసీ ఆన్ చెయ్:

Advertisement

ఇంట్లో గూగుల్ హోమ్ లేదా అలెక్సా వాడుతుంటే ఇక రిమోట్‌తో పనే లేదు. టీవీ చూస్తున్నప్పుడో లేక వంట చేస్తున్నప్పుడో ‘అలెక్సా.. ఏసీ టెంపరేచర్ పెంచు’ అంటే చాలు.. టక్కున ఇది పనిచేస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన వాళ్లకు ఇది చాలా పెద్ద రిలీఫ్. అలాగే ప్రతిసారీ రిమోట్ కోసం వెతుక్కునే శ్రమ లేకుండానే చల్లదనాన్ని మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు.

ఫోన్‌లోనే కరెంటు బిల్లు:

సాధారణంగా ఇంట్లో ఏసీ వాడితే నెలాఖరున బిల్లు చూసి షాక్ అవ్వడం మనందరికీ అలవాటే. కానీ ఈ వైఫై ఏసీ ఉంటే ఫోన్ యాప్‌లోనే రోజూ ఎంత కరెంటు ఖర్చవుతుందో చూడొచ్చు. నిన్న ఎంత వాడాం? గత వారంతో పోలిస్తే ఈ వారం బిల్లు ఎంత పెరిగింది? ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎక్కడ పొదుపు చేయాలో మనకు ఒక ఐడియా వస్తుంది. బడ్జెట్ ప్రకారం ఏసీని వాడుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

మరో హైలైట్ ఏమిటంటే?

మనలో చాలామందికి ఏసీలో ఫిల్టర్లను ఎప్పుడు క్లీన్ చేయాలో అస్సలు గుర్తుండదు. దానివల్ల ఏసీ పాడయ్యే అవకాశం ఉంటుంది. అదే స్మార్ట్ ఏసీ అయితే, ‘ఫిల్టర్ క్లీన్ చేసే టైం అయ్యింది’ అని డైరెక్ట్ మన ఫోన్‌కు మెసేజ్ పంపిస్తుంది. అలాగే లోపల ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా అది ఏంటో కూడా యాప్ లోనే చూపిస్తుంది. దీనివల్ల చిన్న సమస్య ఉన్నప్పుడే రిపేర్ చేయించుకోవచ్చు. పెద్ద ఖర్చుల నుండి తప్పించుకోవచ్చు.

Also Read: షాకింగ్ అప్డేట్.. వాట్సప్‌లో ఇక పెయిడ్ సర్వీస్, ఆ 6 ఫీచర్లు కావాలంటే డబ్బులు కట్టాల్సిందే!

Tags

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×