E-Paper
Advertisement

Blaupunkt Xtreme: కొత్త ఇయర్‌బడ్స్‌ లాంచ్.. సింగిల్ ఛార్జింగ్‌తో 150 గంటల బ్యాటరీ లైఫ్‌.. ధర, ఫీచర్ల వివరాలివే..!

Blaupunkt Xtreme: కొత్త ఇయర్‌బడ్స్‌ లాంచ్.. సింగిల్ ఛార్జింగ్‌తో 150 గంటల బ్యాటరీ లైఫ్‌.. ధర, ఫీచర్ల వివరాలివే..!
Advertisement

Blaupunkt Xtreme: ప్రముఖ జర్మనీ ఆడియో ఉత్పత్తుల తయారీ సంస్థ Blaupunkt తాజాగా వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌ Xtremeని లాంచ్ చేసింది. ఈ ఇయర్‌బడ్‌లు ఒకే ఛార్జ్‌పై 120 గంటల వరకు పనిచేస్తాయని కంపెనీ పేర్కొంది. దీని కారణంగా ఫోన్ కాల్స్, మ్యాజిక్‌ను ఎక్కువ సమయం అందించడానికి ఇది తోడ్పడుతుంది.

ఇక ఈ ఇయర్‌బడ్స్ బ్యాటరీ విషయానికొస్తే.. Xtreame ఇయర్‌ బడ్స్ 800mAh బ్యాటరీ సామర్థ్యంతో వస్తాయి. ఈ ఇయర్‌బడ్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఇతర ఇయర్‌బడ్‌ల బ్యాటరీల కంటే శక్తివంతమైనది. ఇంత పెద్ద బ్యాటరీతో ఛార్జింగ్ కేస్‌తో కలిపి.. ఈ ఇయర్‌బడ్‌లు చాలా కాలం పాటు ఉంటాయి. వాటి ప్రత్యేకత ఏమిటంటే.. వాటిలో అమర్చిన కొత్త టెక్నాలజీ 20 శాతం తక్కువ బ్యాటరీని వినియోగిస్తుంది.

Advertisement

అంతేకాకుండా ఈ ఇయర్‌ బడ్స్‌‌లో అత్యాధునిక చిప్‌లను అమర్చారు. అలాగే బ్యాటరీతో పాటు మెరుగైన ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. ఈ ఇయర్ బడ్స్ పెద్ద పెద్ద సౌండింగ్ ప్రదేశాలలో కూడా క్రిస్టల్ క్లియర్ సౌండ్ కోసం ప్రత్యేక సాంకేతికతను (క్లియర్ AI మైక్స్, ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్) ఫీచర్‌ను కలిగి ఉంది. దీని ద్వారా కాల్స్ మాట్లాడినప్పుడు కానీ, సాంగ్స్ వింటున్నప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉంటాయి.

Also Read: 48గంటల బ్యాటరీతో నడిచే ఇయర్ బడ్స్.. ధర కూడా చాలా అంటే తక్కువ!

Advertisement

ఇకపోతే ఈ ఇయర్‌బడ్స్ టర్బో వోల్ట్ ఫార్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చాయి. ఈ ఛార్జింగ్ కేస్‌ని ఉపయోగించి ఈ ఇయర్‌బడ్‌లను 8 సార్లు ఛార్జ్ చేయవచ్చు. అంతేకాకుండా 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5 గంటల ప్లేబ్యాక్ సమయాన్ని అందిస్తుంది. ఇది ఎల్లప్పుడూ ప్రయాణంలో ఉండే వ్యక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

ఈ ఇయర్‌బడ్‌లు కాల్స్ కోసం అద్భుతమైన సౌండ్ క్వాలిటీని కూడా అందిస్తాయి. నాలుగు మైక్రోఫోన్‌లు (ప్రతి ఇయర్‌బడ్‌లో రెండు), ప్రత్యేక ఎన్విరాన్‌మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC) సహాయంతో, పెద్ద పెద్ద సౌండింగ్ ప్రాంతాల్లో కూడా సులభంగా మాట్లాడవచ్చు. గేమ్‌లు ఆడేందుకు ఇష్టపడే వారి కోసం ఇందులో గేమింగ్ మోడ్ కూడా అందించారు. దీని వల్ల ఎలాంటి ఆటంకం లేకుండా గేమింగ్‌ను ఆస్వాదించవచ్చు. ఇయర్‌బడ్‌లు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని కలిగి ఉంటాయి. దీని కారణంగా కనెక్షన్ దూరంగా ఉన్నా.. సౌండ్ క్వాలిటీ మెరుగ్గా ఉంటుంది.

ఈ Blaupunktకి చెందిన Xtreme ఇయర్‌బడ్స్ Amazonలో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ.1,699 ధరతో వీటిని కొనుక్కోవచ్చు. మంచి బ్యాటరీ లైఫ్, అనేక ప్రత్యేక ఫీచర్లతో, వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లను కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులకు ఈ ఇయర్‌బడ్‌లు గొప్ప ఎంపిక అని చెప్పొచ్చు.

 

Tags

Related News

అమెజాన్ బంపరాఫర్.. ‘వన్‌ప్లస్ 13’పై రూ.12 వేల తగ్గింపు.. ఫోన్ ప్రత్యేకతలివే!

వైన్ బాటిల్‌కి స్క్రూ క్యాప్ ఉంటే నాసిరకమా? అసలు మూతకి, క్వాలిటీకి ఉన్న సంబంధం ఏమిటి!

రూ.1,399 కే క్లాసీ స్మార్ట్‌వాచ్! మీ ఫిట్‌నెస్ కోసం పర్ఫెక్ట్ పార్ట్‌నర్

యూపీఐలో క్రేజీ ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్.. ఫోన్ ట్యాప్ చేస్తే చాలు!

వయసు పైబడిన వారు ఏ నావిగేషన్ యాప్ వాడితే దారి తప్పకుండా ప్రయాణించవచ్చు?

రూ. 6,299కే మైక్రోటెక్ పవర్‌ఫుల్ ఇన్వర్టర్! కరెంట్ పోయినా నో టెన్షన్

సామాన్యుల స్పెషల్.. రూ.100 లోపే బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. ఇవి చాలా చౌక గురూ!

BSNL మరో సంచలన ప్లాన్.. ప్రతీ నెలా 4000 GB డేటా, ఫ్రీ ఓటీటీ.. అదిరిపోయింది అంతే!

Big Stories

Advertisement
×