BigTV English

Indian Origin Student Arrest in US: యూఎస్‌లో భారత సంతతి విద్యార్థి అరెస్ట్, ఆ పై నిషేధం.. అందుకేనా..?

Indian Origin Student Arrest in US: యూఎస్‌లో భారత సంతతి విద్యార్థి అరెస్ట్, ఆ పై నిషేధం.. అందుకేనా..?

Indian Origin student arrested, banned from US university: పాలస్తీనా అనుకూల నిరసనలతో అమెరికా యూనివర్సీటీలు అట్టుడుకుతున్నాయి. అమెరికాలోని ప్రతిష్టాత్మక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ క్యాంపస్ ప్రాంగణంలో అనధికారికంగా విద్యార్థి నేతృత్వంలోని పాలస్తీనా అనుకూల శిబిరం నిరసనలో పాల్గొన్నందుకు భారతీయ సంతతికి చెందిన విద్యార్థి అచింత్య శివలింగన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతే కాకుండా యూనివర్సిటీ నుంచి ఆమెని నిషేధించారు.


పాలస్తీనా అనుకూల నిరసనలో పాల్గొన్న ఆమెపై క్రమశిక్షణా ప్రక్రియ మొదలు పెట్టారు. గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి వ్యతిరేకంగా US అంతటా ప్రధాన విశ్వవిద్యాలయాలలో కొనసాగుతున్న నిరసనల మధ్య ఈ పరిణామం జరిగింది.

తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పుట్టి, ఒహియోలోని కొలంబస్‌లో పెరిగిన శివలింగన్, మరో తోటి విద్యార్థి హసన్ సయ్యద్‌ ఇద్దరినీ గురువారం అరెస్టు చేసినట్లు ప్రిన్స్‌టన్ అలుమ్ని వీక్లీ నివేదించింది. నిరసన నిర్వాహకులు ఇద్దరిని గుర్తించిన పత్రాన్ని ఉటంకిస్తూ నివేదించారు.


గురువారం ఉదయం, నిరసనలో పాల్గొన్న విద్యార్థులు అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా యూనివర్శిటీ మెక్‌కోష్ ప్రాంగణంలో టెంట్‌లను ఏర్పాటు చేశారని ప్రిన్స్‌టన్ అలుమ్ని వీక్లీ పేర్కొంది. నిమిషాల వ్యవధిలో, ఇద్దరు విద్యార్థులను అరెస్టు చేశారు. దీంతో నిరసనకారులు తమ టెంట్లను తీసేసి ధర్నాకు దిగారు. 110 మంది నిరసనకారులతో ప్రారంభమైన ఈ ధర్నా గురువారం మధ్యాహ్నం వరకు ఆ సంఖ్య 300కు చేరింది.

Also Read: వినిపిస్తున్న ఆకలి కేకలు.. ఇంకా పెరగొచ్చంట..!

నిరసనను నిలిపివేసి, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పదే పదే హెచ్చరికలు జారీ చేసినా నిరసనకారులు వినకపోవడంతో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం ప్రతినిధి జెన్నిఫర్ మోరిల్ తెలిపారు. వారిని క్యాంపస్ నుంచి నిషేధించామని.. వారిపై క్రమశిక్షణ ప్రక్రియ పెండింగ్‌లో ఉందని మోరిల్ స్పష్టం చేశారు. అటు వీరి అరెస్ట్ తర్వాత క్యంపస్‌లోని వివిధ ప్రాంతాల్లోని టెంట్‌లను నిరసనకారులు స్వచ్ఛందంగా తొలగించారని పేర్కొన్నారు.

గత వారం న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో 100 మందికి పైగా అరెస్టయిన తర్వాత ఐవీ లీగ్ పాఠశాలలు హార్వర్డ్, యేల్‌తో సహా US అంతటా ప్రధాన విశ్వవిద్యాలయాలలో నిరసనలు తీవ్రమయ్యాయి.

Tags

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×