BoAt Rockerz 480: మ్యూజిక్ లవర్స్ , గేమింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! తక్కువ బడ్జెట్‌లో.. స్టైలిష్ లుక్, పవర్ ఫుల్ సౌండ్ కోరుకునే.. వారి కోసం ప్రముఖ ఆడియో బ్రాండ్ బోట్ మార్కెట్లోకి.. తెచ్చిన అద్భుతమైన గాడ్జెట్. కేవలం రూ. 1,399 ధరలో లభిస్తున్న ఈ ఆన్-ది-ఇయర్ హెడ్ ఫోన్‌లో ఏకంగా 60 గంటల లాంగ్ బ్యాటరీ లైఫ్, గేమింగ్ కోసం బీస్ట్ మోడ్, 6 ఆర్జీబీ లైట్ మోడ్స్ , ENx టెక్నాలజీ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్నాయి. బ్లాక్ సేబర్ కలర్‌లో అదర గొడుతున్న ఈ ట్రెండీ హెడ్‌ఫోన్ పూర్తి రివ్యూ ఇప్పుడు చూద్దాం!
బోట్ ప్రొడక్ట్స్ డిజైన్ ఎప్పుడూ ట్రెండీగా ఉంటాయి. ఈ మోడల్ హెడ్‌ఫోన్ ‘బ్లాక్ సేబర్’ కలర్ వేరియంట్‌లో చూడటానికి చాలా క్లాసీగా, ప్రీమియమ్‌గా కనిపిస్తుంది. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇయర్ కప్స్‌పై ఇచ్చిన ఆర్జీబీ ఎల్‌ఈడీ లైట్లు! ఇందులో మొత్తం 6 డిఫరెంట్ లైట్ మోడ్స్ ఉన్నాయి. మీరు పాటలు వినేటప్పుడు.. లేదా గేమింగ్ ఆడేటప్పుడు ఈ లైటింగ్ ఎఫెక్ట్స్ హెడ్ ఫోన్‌కు ఒక సరి కొత్త లుక్‌ను తెచ్చిపెడతాయి. ఎర్గొనమిక్ ఆన్-ది-ఇయర్ డిజైన్ ఉండటం వల్ల గంటల తరబడి చెవులపై.. పెట్టుకున్నా ఎలాంటి నొప్పి లేదా ఇబ్బంది కలగదు.
ఈ హెడ్‌ఫోన్ మెయిన్ హైలైట్ దీని బ్యాటరీ బ్యాకప్. ఇందులో.. ఉన్న పవర్ ఫుల్ బ్యాటరీ సహాయంతో ఒక సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఏకంగా 60 గంటల వరకు నాన్ స్టాప్ ప్లేబ్యాక్ లభిస్తుంది. మీరు రెగ్యులర్ యూజర్ అయితే.. ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. దాదాపు వారం రోజుల పాటు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే రాదు. లాంగ్ జర్నీలు చేసే వారికి, రోజంతా.. ఆఫీస్ కాల్స్ లేదా మ్యూజిక్ వినే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఒకవేళ బ్యాటరీ అయిపోయినా.. క్విక్ ఛార్జింగ్ సపోర్ట్ వల్ల కొద్ది నిమిషాల్లోనే బ్యాటరీని పొందొచ్చు.
మీరు మొబైల్ గేమింగ్ ఇష్ట పడే వారైతే.. ఈ హెడ్‌ఫోన్ మీకు బాగా నచ్చుతుంది. ఇందులో.. ప్రత్యేకంగా ‘బీస్ట్ మోడ్’ ఇచ్చారు. ఇది అల్ట్రా-లో లేటెన్సీని అందిస్తుంది. గేమ్ ఆడేటప్పుడు.. శబ్దానికి, విజువల్స్‌కు ఎలాంటి గ్యాప్ లేకుండా రియల్ టైమ్ సింక్రోనైజేషన్ లభిస్తుంది. శత్రువుల అడుగుల చప్పుడును స్పష్టంగా గుర్తించి గేమ్‌లో గెలవడానికి ఈ ఫీచర్ ఎంతగానో సహాయ పడుతుంది.
ఆఫీస్ మీటింగ్స్, ఆన్‌లైన్ క్లాసులు లేదా సాధారణ ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి మన గొంతు స్పష్టంగా వినిపించడం చాలా ముఖ్యం. ఈ మోడల్ లో డ్యూయల్ మైక్ సెటప్‌తో పాటు బోట్ సిగ్నేచర్ ఈ టెక్నాలజీని పొందుపరిచారు. ఇది.. మీ చుట్టూ ఉండే అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని తగ్గించి, మీ వాయిస్‌ని ఎంతో క్లియర్‌గా అవతలి వారికి చేరవేస్తుంది.
బోట్ బ్రాండ్ అంటేనే.. పవర్‌ఫుల్ బేస్ , రిచ్ ఆడియో. ఇందులో ఉన్న లార్జ్ డ్రైవర్లు డీప్ బేస్ ,క్రిస్టల్ క్లియర్ వోకల్స్‌ను అందిస్తాయి. మ్యూజిక్ బీట్స్ ఎంతో హుషారుగా అనిపిస్తాయి. అలాగే ..ఇందులో లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీతో పాటు ఆక్స్ కేబుల్ సపోర్ట్ కూడా ఉంది. బ్యాటరీ పూర్తిగా అయిపోయిన సందర్భాల్లో.. వైర్ ద్వారా కూడా దీన్ని వాడొచ్చు.
Also Read: రూ. 35,990కే నెక్స్ట్ లెవెల్ స్మార్ట్ టీవీ..ఫుల్ స్పెసిఫికేషన్లు ఇవిగో
ఈ మోడల్ బ్లూటూత్ హెడ్‌సెట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లలో కేవలం రూ. 1,399 ఆఫర్ ధరకు అందుబాటులో ఉంది. ఈ ప్రైస్ రేంజ్‌లో ఆర్జీబీ లైట్లు, 60H బ్యాటరీ లభించడం నిజంగా గ్రేట్ డీల్!
మీ బడ్జెట్ రూ. 1500 లోపు ఉండి, ట్రెండీ ఆర్జీబీ లైట్లు, 60 గంటల లాంగ్ బ్యాటరీ లైఫ్, గేమింగ్ కోసం బీస్ట్ మోడ్ , పవర్ ఫుల్ బేస్ కోరుకుంటే ఈ మోడల్ హెడ్ ఫోన్ కచ్చితంగా బెస్ట్ ఛాయిస్. స్టైల్, పెర్ఫార్మెన్స్ రెండింటినీ కోరుకునే యూత్‌కు ఇది అద్భుతమైన ప్రొడక్ట్!