E-Paper
Advertisement

సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు: భూమన్ కరుణాకర్ రెడ్డి

సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు: భూమన్ కరుణాకర్ రెడ్డి
Advertisement

Bhumana Karunakar: తిరుపతి వేదికగా వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇటీవల ముగిసిన స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ యంత్రాంగాన్ని వాడుకుని ఎన్నికల వ్యవస్థను పూర్తిగా అపహాస్యం చేసిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలపై ఆయన స్పందిస్తూ.. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు.

ప్రజాస్వామ్యంపై దాడికి చెంపపెట్టు

Advertisement

స్థానిక ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులకు నామినేషన్లు వేసే అవకాశం కూడా ఇవ్వకుండా వందలాది చోట్ల కూటమి నాయకులు దాడులు, బెదిరింపులకు దిగారని భూమన ఆరోపించారు. బలవంతపు ఏకగ్రీవాల కోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుని ప్రశాంతమైన వాతావరణాన్ని భగ్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు మార్కు అక్రమాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఒక బలమైన చెంపపెట్టులాంటివని ఆయన వ్యాఖ్యానించారు.

బాధితులకు మరో అవకాశం.. ఈసీదే బాధ్యత

Advertisement

నామినేషన్లు సమర్పించలేకపోయిన బాధితులకు మరో అవకాశం కల్పించే అంశంపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిందని భూమన గుర్తుచేశారు. ఈ నెల 25వ తేదీ వరకు ఎన్నికల తుది జాబితాను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించవద్దని అత్యున్నత నాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. ఈ పరిణామం ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో కీలకమైన అడుగు అని పేర్కొన్నారు.

అధికారులకు హెచ్చరిక

ఎన్నికలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉందని.. ఈ బాధ్యత పూర్తిగా ఎన్నికల కమిషన్, పోలీసు శాఖలదేనని భూమన స్పష్టం చేశారు. అధికార పార్టీకి కొమ్ము కాస్తూ, అక్రమాలకు సహకరించే అధికారులు భవిష్యత్తులో తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించి, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.

Also Read: రెబెల్స్‌కు చంద్రబాబు లాస్ట్ వార్నింగ్… మాట వినకపోతే క్షమించేదే లేదు!

Tags

Related News

చిత్తూరులో ఉద్రిక్తత.. మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై టీడీపీ శ్రేణుల దాడి!

పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. యువకుడు దుర్మరణం!

రెబెల్స్‌కు చంద్రబాబు లాస్ట్ వార్నింగ్… మాట వినకపోతే క్షమించేదే లేదు!

పుంగనూరులో తగ్గేదేలే.. అన్ని వార్డుల్లోనూ నామినేషన్లు వేయిస్తాం: పెద్దిరెడ్డి

రప్పా రప్పా అంటూ వేధించేవాళ్లు.. సోషల్ మీడియా సైకోలను వదలొద్దు-సీఎం చంద్రబాబు

పెద్దిరెడ్డి, రోజాల కోటల్లో వైసీపీకి బిగ్ షాక్.. పీఠాలన్నీ టీడీపీ ఖాతాలోనే!

ఏపీ మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు అంశం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, వాటిపై మాత్రమే

Big Stories

Advertisement
×