Bosch 6.5 kg top load washing machine: ప్రతి రోజూ బట్టలు ఉతకడం అనేది ఇంటి పనిలో అత్యంత శ్రమతో కూడుకున్న విషయం. ముఖ్యంగా బిజీ లైఫ్‌స్టైల్‌లో ఈ పనిని ఈజీ చేసేందుకు ఒక మంచి వాషింగ్ మెషిన్ ప్రతీ ఇంట్లోనూ ఉండాల్సిందే! జర్మన్ టెక్నాలజీతో నాణ్యమైన హోమ్ అప్లయన్సెస్ అందించే బాష్ బ్రాండ్ నుంచి వచ్చిన Bosch 6.5 kg Fully Automatic Top Load Washing Machine (WOE652D0IN) ఇప్పుడు మార్కెట్‌లో చాలా పాపులర్ అవుతోంది. కేవలం రూ. 19,990 బడ్జెట్ ధరలో.. లభిస్తున్న ఈ వాషింగ్ మెషిన్ విశేషాలు ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఈ వాషింగ్ మెషిన్లు వాటి బిల్డ్ క్వాలిటీకి చాలా పేరు గాంచాయి. ఈ మోడల్ క్లాసీ లుక్‌తో, ప్రీమియం ఫినిషింగ్‌తో వస్తుంది. ఇంటి మూలన తక్కువ స్థలంలోనే.. చాలా ఈజీగా అమరిపోతుంది. దీని టాప్ లిడ్ గ్లాస్ డిజైన్‌తో వచ్చి చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
ఈ వాషింగ్ మెషిన్‌లో Bosch వారి ప్రత్యేకమైన సిస్టమ్ అందించారు. ఇది బట్టలు ఉతికేటప్పుడు.. నీటిని డైనమిక్‌గా నలువైపులా తిప్పుతుంది. దీని వల్ల బట్టలపై ఉండే కఠినమైన మురికి, మరకలు చాలా ఈజీగా వదిలిపోతాయి. అంతేకాకుండా.. బట్టలు పాడవకుండా లేదా రంగు వెలిసిపోకుండా జాగ్రత్తగా ఉతుకుతుంది.
ఇందులో యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ డిస్‌ప్లే ఉంటుంది. దీని వల్ల వాషింగ్ టైమ్, ఎంచుకున్న మోడ్ ఈజీగా తెలుసుకోవచ్చు. పట్టు బట్టలు, జీన్స్, కాటన్, డెలికేట్ బట్టలు రోజు వారీ వాడే దుస్తుల కోసం వేర్వేరు స్మార్ట్ వాష్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. మీ బట్టల రకాన్ని బట్టి సరైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.
చాలా ఇళ్లలో వాటర్ ప్రెజర్ (నీటి ఒత్తిడి) తక్కువగా ఉండటం వల్ల వాషింగ్ మెషిన్లు సరిగ్గా పనిచేయవు. కానీ ఈ Bosch మోడల్ చాలా తక్కువ నీటి ఒత్తిడి ఉన్నప్పటికీ చాలా స్మూత్‌గా రన్ అవుతుంది. అపార్ట్‌మెంట్లలో లేదా ఎగువ అంతస్తుల్లో ఉండే వారికి ఇది ఒక గొప్ప అడ్వాంటేజ్.
Also Read: ఆఫీస్ నుంచే ఇల్లు క్లీన్ చేయొచ్చా? ఫోన్‌తో ఆపరేట్ అయ్యే రోబో వాక్యూమ్స్
ఒక వేళ వాషింగ్ జరుగుతున్న సమయంలో .. కరెంట్ పోయినా టెన్షన్ పడాల్సిన పని లేదు. కరెంట్ తిరిగి రాగానే ఇది ఎక్కడ ఆగిపోయిందో సరిగ్గా అక్కడ నుంచే వాషింగ్‌ను రీస్టార్ట్ చేస్తుంది. ఇది కరెంట్, నీటి వాడకాన్ని కూడా చాలా వరకు చేస్తుంది.
రూ. 20వేలలోపు బడ్జెట్‌లో ప్రీమియం జర్మన్ టెక్నాలజీ, మన్నికైన బాడీ , సూపర్ క్లీనింగ్ ఇచ్చే వాషింగ్ మెషిన్ కోరుకునే వారికి ఈ వాషింగ్ మెషీన్ బెస్ట్ ఆప్షన్. మీ ఇంటి పనిని ఈజీగా చేస్తూ, సమయాన్ని ఆదా చేసే బెస్ట్ ‘పైసా వసూల్’ హోమ్ అప్లయన్స్ ఇది.