E-Paper
Advertisement

Bosch vs LG vs Samsung: కొత్త వాషింగ్ మెషిన్ కొంటున్నారా? ఈ 3 బ్రాండ్ల మధ్య తేడాలు తెలియకుండా అస్సలు కొనకండి!

Bosch vs LG vs Samsung: కొత్త వాషింగ్ మెషిన్ కొంటున్నారా? ఈ 3 బ్రాండ్ల మధ్య తేడాలు తెలియకుండా అస్సలు కొనకండి!
Advertisement

Bosch vs LG vs Samsung: ఈ ఏడాదిలో మీరు కొత్త వాషింగ్ మెషీన్‌ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్లో ఉన్న వందలాది ఆప్షన్ల మధ్య Bosch, LG, Samsung బ్రాండ్లు తమదైన శైలిలో కస్టమర్లను తెగ ఆకర్షిస్తున్నాయి. ఈ మూడు దిగ్గజ కంపెనీలు 2026లో సరికొత్త ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లను పరిచయం చేశాయి. అయితే కొనే ముందు మాత్రం మీ ఇంటి అవసరాలకు, మీ బడ్జెట్‌కు, బట్టల రకానికి ఏది సరిపోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ మూడు బ్రాండ్ల మధ్య ఉన్న తేడాలు, వాటి ప్లస్ , మైనస్‌లను గురించిన పూర్తి వివరాలను ఇప్పుుడు తెలుసుకుందాం.

బ్రాండ్ల మధ్య తేడాలు:
ప్రస్తుత కాలంలో వాషింగ్ మెషీన్ అంటే కేవలం బట్టలు ఉతికే యంత్రం మాత్రమే కాదు. అది ఇంటి పనిని సులువు చేసే ఒక స్మార్ట్ గ్యాడ్జెట్ గా పనిచేయాలి. 2026లో ఈ 3 బ్రాండ్లు ఏయే అంశాల్లో ముందున్నాయో చూద్దాం.

Advertisement

1. Bosch (బాష్): జర్మన్ ఇంజనీరింగ్ పవర్:
బాష్ ఎప్పుడూ తన బిల్డ్ క్వాలిటీకి పేరుగాంచింది. 2026 మోడల్స్‌లో వీరు మోటార్‌ను మరింత మెరుగుపరిచారు.

ఎందుకు కొనాలి?: మీకు మెషీన్ నుంచి అస్సలు శబ్దం రాకూడదు అనిపిస్తే బాష్ బెస్ట్. వీటిలోని యాంటీ వైబ్రేషన్ సైడ్ ప్యానెల్స్ మెషిన్ వేగంగా తిరుగుతున్నప్పుడు కూడా కదలకుండా స్థిరంగా ఉంచుతాయి.

Advertisement

2026 హైలైట్: వీటి ఏఐ ఆక్టివ్ వాటర్ ప్లస్ ఫీచర్ బట్టల బరువును బట్టి అతి తక్కువ నీటిని మాత్రమే వాడుకుంటుంది.

ఎవరికి బెస్ట్ : మెషిన్ కనీసం 10-15 ఏళ్ల పాటు పాడవకూడదు అనుకునేవారికి ఇది బెస్ట్.

2. LG (ఎల్జీ): టెక్నాలజీ ,సర్వీస్ కింగ్:
ఎల్జీ 2026లో ఏఐ DD 2.0 టెక్నాలజీతో దూసుకుపోతోంది. ఇది బట్టల బరువునే కాకుండాజ ఆ ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందో కూడా సెన్సార్ల ద్వారా గుర్తిస్తుంది.

ఎందుకు కొనాలి?: ఎల్జీలో ఉన్న 6 డైరెక్ట్ ట్రైవ్ వల్ల బట్టలు చేత్తో ఉతికినంత శుభ్రంగా ఉంటాయి. అలాగే వీటి టర్బ్ బ్రష్ 360 ఫీచర్ కేవలం 39 నిమిషాల్లోనే ఉతకడం పూర్తి చేస్తుంది.

2026 హైలైట్: వీటి  స్ట్రీమ్ ఫీచర్ బట్టలలోని ముడతలను తగ్గించడమే కాకుండా 99.9% వైరస్‌లను తొలగిస్తుంది.

ఎవరికి బెస్ట్: చిన్న పిల్లలున్న కుటుంబాలకు, వేగంగా సర్వీస్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

3. Samsung (శాంసంగ్): ఇన్నోవేషన్ , స్టైల్:
శాంసంగ్ మెషిన్లు చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటాయి. ఇవి మీ ఇంటి ఇంటీరియర్‌కు తగ్గట్టుగా ఉంటాయి.

ఎందుకు కొనాలి?: వీటి ఏకోబబూల్ టెక్నాలజీ చల్లని నీటిలో కూడా డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి మొండి మరకలను తొలగిస్తుంది. అలాగే ఏఐ కంట్రోల్ ద్వారా మీ వాషింగ్ అలవాట్లను మెషిన్ గుర్తుంచుకుంటుంది.

2026 హైలైట్: ఏఐ ఎనర్జీ మోడ్ ద్వారా స్మార్ట్ థింగ్స్ యాప్ సాయంతో కరెంటు వాడకాన్ని 70% వరకు తగ్గించుకోవచ్చు.

ఎవరికి బెస్ట్: స్మార్ట్ ఫీచర్లు, వైఫై కనెక్టివిటీ , కొత్త రకం డిజైన్లను ఇష్టపడే వారికి ఇది బెస్ట్.

Also Read: ఫ్రంట్ లోడ్ vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏది కరెక్ట్ ?

ఏది బెస్ట్?
మీ ప్రాధాన్యతను బట్టి ఎంపిక మారుతుంది.

1.క్వాలిటీ ముఖ్యం అనుకుంటే.. Bosch Series 6 లేదా 8 మోడల్స్ తీసుకోండి.

2.మంచి సర్వీస్ , ఫ్యాబ్రిక్ కేర్ కావాలంటే.. మాత్రం LG AI DD సిరీస్ అద్భుతంగా ఉంటుంది.

3. లేటెస్ట్ టెక్నాలజీ, కరెంటు ఆదా కావాలంటే.. Samsung AI EcoBubble బెస్ట్ ఛాయిస్.

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×