E-Paper
Advertisement

BSNLలో అత్యంత చౌకైన.. టాప్ – 7 రీఛార్జ్ ప్లాన్స్.. ధర తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ!

BSNLలో అత్యంత చౌకైన.. టాప్ – 7 రీఛార్జ్ ప్లాన్స్.. ధర తక్కువ, బెనిఫిట్స్ ఎక్కువ!
Advertisement

BSNL Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ ధరకే అద్భుతమైన ప్రయోజనాలతో రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తుంటుంది. ప్రైవేటు సంస్థలైన జియో, ఎయిర్ టెల్ తో పోలిస్తే.. BSNL ప్లాన్స్ బడ్జెట్ లో ఉండటంతో పాటు.. సామాన్యులకు దగ్గరగా ఉంటాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న అత్యంత చౌకైన టాప్ -7 ప్లాన్స్, వాటి ప్రయోజనాలను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. మీకు నచ్చిన ప్లాన్ ను ఎంచుకొని.. వెంటనే రీఛార్జ్ చేసుకోండి.

రూ. 107 ప్లాన్

తక్కువ ధరలో సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇది చీపెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. 20 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన ఈ ప్లాన్ కింద 3GB డేటా, 200 నిమిషాల ఉచిత వాయిస్ కాల్ ను పొందొచ్చు.

రూ. 153 ప్లాన్

Advertisement

ఈ ప్లాన్ ను 24 రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చింది. ఇది తక్కువ బడ్జెట్ లో అపరిమిత కాల్స్ ను ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా రోజుకు 1GB హై స్పీడ్ డేటా, 100 ఎస్ఎంఎస్ లు యూజర్ కు లభిస్తాయి.

రూ. 199 ప్లాన్

డేటా ప్రియులకు ఈ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తుంది. 28 రోజులు వ్యాలిడిటీ కలిగిన ఈ ప్లాన్.. రోజుకు 2GB డేటాతో పాటు అపరిమిత కాల్స్ ను ఆఫర్ చేస్తోంది. వీటితో పాటు రోజుకు 100 SMSలు సైతం లభిస్తాయి.

రూ. 225 ప్లాన్

Advertisement

డేటా అవసరం ఎక్కువగా ఉన్నవారికి కోసం బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ఆఫర్ చేస్తోంది. ఇది కూడా 28 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. ఈ ప్లాన్ లో రోజుకు 3GB డేటా, అపరిమిత వాయిస్ కాల్స్ లభిస్తాయి.

రూ. 251 ప్లాన్

డేడా అవసరం ఎక్కువగా ఉన్న వారికి ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే ఏకంగా 100GB హై-స్పీడ్ డేటా యూజర్ కు లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్ తో పాటు BiTVకి ఉచిత యాక్సెస్ సైతం పొందొచ్చు.

రూ. 599 ప్లాన్

రెండు నెలలకు పైగా వ్యాలిడిటీ కోరుకునేవారు.. ఈ ప్లాన్ ట్రై చేయవచ్చు. ఇది 70 రోజుల కాలపరిమితితో వస్తుంది. రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, BiTV ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ యూజర్ కు లభించనున్నాయి.

Also Read: బాంబులా పేలుతున్న ఏసీలు.. ఈ పరిస్థితి రావొద్దంటే.. వెంటనే ఇలా చేయండి!

రూ. 2399 ప్లాన్

ఒకసారి రీఛార్జ్ చేస్తే.. ఏడాది పొడవునా రీఛార్జ్ టెన్షన్ లేకుండా ఉండాలని భావించేవారు.. దీనిని ట్రై చేయవచ్చు. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంది. రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు దీని కింద పొందొచ్చు.

Also Read: సెకండ్ హ్యాండ్ ఏసీ కొంటున్నారా? కొంపలు అంటుకుంటాయ్.. ఇవి గుర్తుపెట్టుకోండి!

Related News

ఈ సీక్రెట్ ట్రిక్స్ తెలిస్తే.. రోజంతా ఏసీ, ఫ్రిజ్ వాడినా కరెంట్ బిల్లు సగమే!

ట్రెండింగ్ vs యూజ్‌ఫుల్.. గ్యాడ్జెట్స్ కొనేముందు ఈ క్లారిటీ లేకపోతే డబ్బులు వేస్టే!

ఫోన్ ధర రూ.1.68 లక్షలు.. అయినా తగ్గదేలే అంటున్న జనాలు, iPhone Duoలో అంతలా ఏముంది?

చేతిలో ఇమిడిపోయే ప్రింటర్‌ తెచ్చిన షావోమీ.. దీని స్మార్ట్ ఫీచర్లు చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే!

మన మాటల్ని సీక్రెట్‌గా రికార్డ్ చేసే AI డివైజ్‌లు.. అమెజాన్ కొత్త ప్రయోగం ఇదే!

ఒక్క రూపాయి ఖర్చు లేకుండా క్రెడిట్ కార్డ్ పాయింట్లను క్యాష్‌గా మార్చడం ఎలా?

నకిలీ QR కోడ్‌లను స్కాన్ చేసే ముందే ఇలా కనిపెట్టండి.. ఈ చిన్న ట్రిక్ తెలిస్తే మీ డబ్బు సేఫ్!

గూగుల్ ప్లేస్టోర్‌లో ఫేక్ వాట్సప్ యాప్.. అసలైనదో కాదో ఎలా గుర్తించాలి?

Big Stories

Advertisement
×