E-Paper
Advertisement

సామాన్యుల స్పెషల్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. 72 రోజులు రచ్చ రంబోలా!

సామాన్యుల స్పెషల్.. BSNL నుంచి మరో చౌకైన ప్లాన్.. 72 రోజులు రచ్చ రంబోలా!
Advertisement

BSNL Prepaid Plans: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) తన వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్లను అందిస్తూనే ఉంటుంది. ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోలిస్తే తక్కువ ధరలో ఎక్కువ వ్యాలిడిటీతో కస్టమర్లను సర్ ప్రైజ్ చేస్తుంటుంది. ఈ క్రమంలోనే సామాన్యుల కోసం బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన మరో ప్లాన్ రూ.485. ఈ ప్లాన్ వివరాలు, బెనిఫిట్స్ గురించి ఈ కథనంలో చూద్దాం.

రూ.485 ప్లాన్ బెనిఫిట్స్..

బీఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్ ను 72 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లకు ప్రతి రోజూ 2GB డేటా లభించనుంది. అలాగే రోజుకు 100 ఫ్రీ ఎస్ఎంఎస్ లను సైతం యూజర్లు చేసుకోవచ్చు. దీంతోపాటు దేశంలో ఏ నెట్ వర్క్ కు అయినా అపరిమితంగా ఫోన్ చేసుకునే వెసులుబాటును సైతం ఈ ప్లాన్ ద్వారా బీఎస్ఎన్ఎల్ కల్పిస్తోంది. అటు అదనపు బెనిఫిట్స్ కింద ఫ్రీ కాలర్ ట్యూన్ సైతం బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది.

ఈ ప్లాన్ ఎవరికి సరైనది?

Advertisement

రోజూ అధిక డేటా యూసేజ్ తో పాటు ఎక్కువ సమయం కాల్స్ మాట్లాడే వారికి.. ఈ ప్లాన్ చాలా బాగా ఉపయోగపడనుంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ రోజులు కాల్స్, డేటా రెండూ కోరుకునేవారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రతీ నెలా రీఛార్జ్ చేసుకోవడానికి ఇబ్బంది పడేవారికి సైతం ఈ ప్లాన్ మంచి ఛాయిస్ గా నిలుస్తుంది.

Also Read: జియో మరో క్రేజీ ప్లాన్.. రూ. 1,748 కే 11 నెలల వ్యాలిడిటీ.. ఫ్రీ కాల్స్, డేటా, లైవ్ ఛానల్స్!

ఎలా రీఛార్జ్ చేసుకోవాలి?

Advertisement

రూ. 485 ప్లాన్‌ను వివిధ మార్గాల్లో రీఛార్జ్ చేసుకునేందుకు బీఎస్ఎన్ఎల్ వీలు కల్పిస్తోంది. దీనికోసం స్మార్ట్‌ఫోన్‌లో ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం వంటి యూపీఐ యాప్‌లను ఓపెన్ చేసి రీఛార్జ్ సెక్షన్ లోకి వెళ్లాలి. అక్కడ నెంబర్ ఎంటర్ చేసి.. అక్కడ లభించి బీఎస్ఎన్ఎల్ ప్లాన్ లిస్ట్ నుంచి రూ. 485 ప్లాన్‌ను రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆన్ లైన్ లో సాధ్యం కాకపోతే.. బీఎస్ఎన్ఎల్ కస్టమర్ కేర్ సెంటర్ లేదా రిటైల్ రీఛార్జ్ షాప్‌కి వెళ్లి కూడా రీఛార్జ్ చేసుకునే అవకాశముంది.

Also Read: గుజరాత్‌ను ముంచెత్తిన వానలు.. అహ్మదాబాద్ అతలాకుతలం.. 15 జిల్లాలకు హై అలర్ట్!

Related News

ఖరీదైన గ్యాడ్జెట్లు అక్కర్లేదు.. 3D ప్రింటర్‌తో మీ హోమ్ థియేటర్‌ను ఇలా అప్‌గ్రేడ్ చేసుకోండి!

సుప్రీంకోర్టులో Vi కి భారీ ఊరట.. రూ.363 కోట్ల జీఎస్టీ వివాదంలో కేంద్రానికి షాక్!

ఐఫోన్ నీళ్లలో పడిందా? సర్వీస్ సెంటర్‌కు వెళ్లకుండా.. ఈ ఒక్క షార్ట్‌కట్‌తో నీటిని బయటకు పంపండి!

బడ్జెట్‌లో బిగ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్స్ చూస్తే వెంటనే కొనుక్కోవాలనిపిస్తుంది!

Sony vs Bose.. ఈ రెండింటిలో ఏ నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్స్ కొంటే మీ డబ్బులు వృధా కావు?

రూ.27,000కే ఇంత స్ట్రాంగ్ ఫోనా? 7200mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో అద్భుతమైన ఫీచర్లు!

మడతపెడితే క్రీజు కూడా కనిపించదు.. టెక్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న హువావే కొత్త ఫోన్!

ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి ఈ 5 గ్యాడ్జెట్స్ పక్కా ఉండాలి.. బ్యాగ్‌లో ఇట్టే పట్టేస్తాయి!

Big Stories

Advertisement
×