E-Paper
Advertisement

1.5GB Daily Data: బిఎస్ఎన్ఎల్ vs జియో vs ఎయిర్‌టెల్ vs వొడాఫోన్.. 1.5GB డైలీ డేటా ప్లాన్‌లో ఏది బెస్ట్?

1.5GB Daily Data: బిఎస్ఎన్ఎల్ vs జియో vs ఎయిర్‌టెల్ vs వొడాఫోన్.. 1.5GB డైలీ డేటా ప్లాన్‌లో ఏది బెస్ట్?

1.5GB Daily Data Comparison| ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతోపాటు, అందులో ఇంటర్నెట్ కూడా ఒక నిత్యావసరంగా మారిపోతోంది. అందుకే చాలామంది సాధారణ రీఛార్జ్ ప్లాన్స్ కంటే ఇంటర్నెట్ డేటా ప్లాన్స్‌ని ఎంచుకుంటున్నారు. అయితే టెలికాం కంపెనీలు ఇచ్చే డేటా ప్లాన్స్‌లో సగటున ఎక్కువ మంది 1.5GB రోజుకు డేటా ప్లాన్ చాలా మందికి సరిపోతుంది. కాల్స్, మెసేజ్‌లు, బ్రౌజింగ్, సోషల్ మీడియా, వీడియో కాల్స్ సులభంగా చేయవచ్చు. పెద్ద టెలికాం కంపెనీలన్నీ ఈ 1.5GB ప్లాన్స్ ఇస్తున్నాయి. కానీ ధర, నెట్‌వర్క్ స్పీడ్, కవరేజ్, అదనపు బెనిఫిట్స్ ఆధారంగా తేడా ఉంటుంది. అందుకే మీకు బడ్జెట్ కావాలా లేక పెర్ఫామెన్స్ కావాలా అనేది మీ అవసరంపై ఆధారపడి ఉంటుంది.

BSNL 1.5GB డైలీ ప్లాన్

బిఎస్ఎన్ఎల్ రూ.141 రీఛార్జ్ ప్లాన్ ఇస్తోంది. ఇందులో 30 రోజులు వాలిడిటీ ఉండగా.. రోజుకు 1.5GB డేటా వస్తుంది. అన్‌లిమిటెడ్ లోకల్, STD కాల్స్, మొత్తం 200 SMS ఉన్నాయి. ముంబై సర్కిల్‌లో అందుబాటులో లేదు. భారతదేశంలో ఇప్పుడు అతి చౌకైన ప్లాన్ ఇదే. గ్రామాలు, చిన్న పట్టణాల్లో బాగా పనిచేస్తుంది. నగరాల్లో స్పీడ్ కొంచెం నెమ్మదిగా ఉండవచ్చు. వీడియో స్ట్రీమింగ్‌లో బఫరింగ్ రావచ్చు. లైట్ యూజర్లకు, బడ్జెట్ కస్టమర్లకు ఈ ప్లాన్ బెస్ట్ ఆప్షన్.

రిలయన్స్ జియో 1.5GB డైలీ ప్లాన్

జియో రూ.299 ప్రీపెయిడ్ ప్లాన్‌లో 1.5GB డైటీ డేటా బెనిఫిట్ ఉంది. దీని వాలిడిటి కూడా 28 రోజులు. న్‌లిమిటెడ్ కాల్స్, SMS, జియో యాప్స్ యాక్సెస్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా జియో కవరేజ్ బాగుంది. నగరాల్లో స్పీడ్ స్థిరంగా ఉంటుంది. వీడియో కాల్స్, ఆన్‌లైన్ క్లాసులు స్మూత్‌గా జరుగుతాయి. BSNL కంటే ధర రెట్టింపు కంటే ఎక్కువే కానీ మొత్తంగా చూస్తే మంచి ఎక్స్‌పీరియన్స్ బాగుంటుంది. రెగ్యులర్ యూజర్లకు, రిలయబుల్ నెట్‌వర్క్ కావాలనుకునేవారికి ఇదే మంచి ఆప్షన్.

భారతీ ఎయిర్‌టెల్ 1.5GB డైలీ ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.349 ప్రీపెయిడ్ ప్లాన్ ఇస్తోంది. రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ వస్తాయి. కొన్ని ఏరియాల్లో అన్‌లిమిటెడ్ 5G డేటా కూడా ఉంటుంది. OTT బెనిఫిట్స్ కూడా రావచ్చు. నగరాల్లో, ట్రావెల్ చేసేటప్పుడు నెట్‌వర్క్ బాగా స్థిరంగా ఉంటుంది. నాలుగు ప్లాన్లలో ఎయిర్‌టెల్ అత్యధిక ధర ఛార్జ్ చేస్తోంది. కానీ స్పీడ్, స్టెబిలిటీ, ఓటీటీ లాంటి అదనపు సర్వీసెస్ ఎక్కువ. హెవీ యూజర్లకు, ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకునేవారికి ఇదే బెస్ట్.

వొడాఫోన్ ఐడియా (Vi) 1.5GB డేటా అడ్-ఆన్ ప్లాన్

Vi రూ.208 యాడ్-ఆన్ ప్లాన్ ఇస్తోంది. ఇందులో 30 రోజులు వాటిడిటీకి రోజుకు 1.5GB డేటా వస్తుంది. కాలింగ్ బెనిఫిట్స్ లేవు, మెయిన్ ప్లాన్ వాలిడిటీ కూడా లేదు. ఇప్పటికే యాక్టివ్ Vi ప్లాన్ ఉన్నవారు మాత్రమే తీసుకోవచ్చు. ఎక్స్‌ట్రా డైలీ డేటా కావాలనుకునే Vi యూజర్లకు ఉపయోగకరం. సప్లిమెంటరీ రీఛార్జ్‌గా మాత్రమే పనికొస్తుంది. బేసిక్ ప్లాన్ మరొకొటి తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: స్మార్ట్ టీవీలో టైపింగ్ చేయడం ఇబ్బందిగా ఉందా? ఈ సింపుల్ ట్రిక్‌తో ఈజీగా చేసేయండి

ఏది బెస్ట్?

నాలుగు కంపెనీలూ రోజుకు 1.5GB డేటా ఇస్తున్నాయి. ధర, నెట్‌వర్క్ ఎక్స్‌పీరియన్స్‌లో తేడా ఉంది. BSNL అతి చౌకైనది, బడ్జెట్ యూజర్లకు మంచిది. Jio ధర, పెర్ఫామెన్స్ రెండూ బ్యాలెన్స్ చేస్తుంది. Airtel ప్రీమియం స్పీడ్, స్టెబిలిటీ, అదనపు బెనిఫిట్స్ ఇస్తుంది. Vi మాత్రం అన్నింటికి భిన్నంగా యాడ్-ఆన్‌గా ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. మీ లొకేషన్, యూసేజ్ ఆధారంగా సరైన ప్లాన్ ఎంచుకోండి. లైట్ యూజర్లకు BSNL, రెగ్యులర్ యూజర్లకు Jio, హెవీ యూజర్లకు Airtel బెటర్. మీ ప్రాధాన్యతలను బట్టి నిర్ణయించుకోండి.

Related News

కేవలం రూ.1000 లోపు ఖర్చుతో ఇంటిని సూపర్ కూల్‌గా మార్చే సీక్రెట్స్ ఇవే!

రంగంలోకి దిగిన గూగుల్.. ఫేక్ కాల్స్ భరతం పట్టడం ఖాయం, వినియోగదారులు ఫుల్‌ హ్యాపీ

ఇంట్లోనే జిమ్.. తక్కువ బడ్జెట్‌లో ఫిట్‌నెస్ ఎక్విప్‌మెంట్స్

స్మార్ట్ ఫ్రిజ్ కొంటే.. నిజంగా కరెంట్ బిల్లు తగ్గుతుందా? అసలు నిజాలు ఇవే!

రూ.30వేలలోపు బెస్ట్ విండో ఏసీలు.. వీటితో ఎండలకు బైబై చెప్పేయండి!

బడ్జెట్ రేంజ్‌లో.. హల్‌చల్ చేస్తున్న హైసెన్స్ 100 ఇంచుల టీవీ..

ఆకట్టుకునే 6.3 ఇంచ్ స్క్రీన్, బెస్ట్ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్..

ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. ఫ్రిజ్ రిపేర్ ఖర్చులు మిగిలినట్టే!

Big Stories

×