E-Paper
Advertisement

BYD Electric Cars : టెస్లాను తలదన్నిన చైనా కంపెనీ!

BYD Electric Cars : టెస్లాను తలదన్నిన చైనా కంపెనీ!
Advertisement
BYD Electric Car

BYD Electric Cars : ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) రంగంలోనూ చైనా ఆధిపత్యం చాటుతోంది. ఈవీ కార్ల అమ్మకాల్లో ఆ దేశానికి చెందిన బీవైడీ కంపెనీ టెస్లాను అధిగమించేసింది. 2023 చివరి త్రైమాసికంలో ఆ రంగంలో అగ్రభాగాన నిలిచింది. గత సంవత్సరం చివరి మూడు నెలల్లో రికార్డు స్థాయిలో 5.26 లక్షల బ్యాటరీ వెహికల్స్‌ను విక్రయించినట్టు బీవైడీ ప్రకటించింది. త్రైమాసిక అమ్మకాల్లో టెస్లాను ఆ సంస్థ అధిగమించడం ఇదే తొలిసారి.

2023 మొత్తం విక్రయాలను చూస్తే ఇప్పటికీ టెస్లానే ముందుంది. గత మూడు నెలల్లో టెస్లా విద్యుత్తు కార్లు 4,84,500 అమ్ముడుపోయాయి. నిరుడు మొత్తం 18 లక్షల కార్లను టెస్లా విక్రయించింది. అయితే ఆశించిన మేర అమ్మకాల్లో వృద్ధిని నిరుడు టెస్లా సాధించలేకపోయింది. 20 లక్షల కార్లను డెలివరీ చేయాలన్నది తమ లక్ష్యమని ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ గత సంవత్సరం జనవరిలో ప్రకటించారు. అయితే ఆ టార్గెట్‌ను చేరుకోలేకపోయిందా సంస్థ. వినియోగదారులకు ఆకట్టుకునే వ్యూహాల్లో భాగంగా పలు మార్లు ధరలను తగ్గించినా ఫలితం కనిపించలేదు.

Advertisement

తాజాగా త్రైమాసిక అమ్మకాల్లో బీవైడీ దూసుకుపోవడం.. అమెరికా కంపెనీ టెస్లాకు సవాల్ అనే మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈవీ రంగంలో పెరుగుతున్న పోటీకి ఇదో నిదర్శనంగా చెబుతున్నారు. షెన్‌జెన్‌కు చెందిన బీవైడీ కంపెనీ.. హైబ్రిడ్, బ్యాటరీ-ఓన్లీ వాహనాలు కలిపి మొత్తం 30 లక్షలకు పైగా విక్రయించింది. వీటిలో బ్యాటరీ-ఓన్లీ వెహికల్స్ సంఖ్యే 16 లక్షల వరకు ఉంది. స్మార్ట్ ఫోన్లు, లాప్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అవసరమైన రీచార్జిబుల్ బ్యాటరీల తయారీలో ఆ కంపెనీకి మంచి పేరుంది. వాస్తవానికి ఇదే బీవైడీకి కలిసొచ్చిన అంశమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈవీ వెహికల్స్‌లో అత్యంత ఖరీదైన పరికరాల్లో బ్యాటరీ ఒకటి. వాటిని సొంతంగా తయారు చేసుకోవడం బీవైడీకి సానుకూల అంశమని చెబుతున్నారు. ప్రత్యర్థి కంపెనీలైతే బ్యాటరీల కోసం మరో సంస్థపై ఆధారపడాల్సి ఉంటుంది. బీవైడీకి ఆ సమస్య లేదు. తన సొంత బ్యాటరీ వ్యాపారం కారణంగా ఈవీ కార్ల ధరల విషయంలో కొంత ఉదారత ప్రదర్శించేందుకు వీలు చిక్కుతుంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×