BigTV English

Prabhas: ప్రభాస్ కంటతడి.. ఎందుకో తెలుసా..?

Prabhas: ప్రభాస్ కంటతడి.. ఎందుకో తెలుసా..?

Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని కైవసం చేసుకుంది. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఇప్పటికీ దాదాపు రూ.625 కోట్ల కలెక్షన్స్ కూడా దాటి పలు బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఎంతో కాలంగా ప్రభాస్ నుంచి హిట్ కోసం ఎదురుచూసిన ఫ్యాన్స్‌కు ఈ చిత్రం ఆకలి తీర్చిందనే చెప్పాలి.


ఇప్పుడు ఈ సినిమాకు ఇంత భారీ విజయాన్ని అందించిన అభిమానులకు, ఆడియన్స్‌కి ప్రభాస్ ధన్యవాదాలు చెప్పారు. ఇంస్టాగ్రామ్ వేదికగా తన సంతోషాన్ని షేర్ చేస్తూ.. ‘‘నేను ఖాన్సార్ ఫేట్ డిసైడ్ చేసే లోగా మీరు న్యూ ఇయర్‌ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. సలార్‌ను ఓన్ చేసుకొని ఇంత పెద్ద విజయాన్ని అందించినందుకు డార్లింగ్స్ అందరికీ థాంక్స్’’ అంటూ ఆనందంతో ఎమోషనల్ అయ్యారు. దీంతో ప్రభాస్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై అభిమానులు పెద్ద సంఖ్యలో స్పందిస్తూ రిప్లై ఇస్తున్నారు.

ఈ చిత్రంలో హీరోయిన్ శ్రుతి హాసన్ కథానాయికగా నటించగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించారు. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ ‘సలార్-2’ కూడా రానుంది.


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×