E-Paper
Advertisement

Fast Charger – Small battery: తక్కువ బ్యాటరీ కెపాసిటీ గల ఫోన్లకు ఫాస్ట్ ఛార్జర్‌ వాడొచ్చా? ఏమవుతుంది?

Fast Charger – Small battery: తక్కువ బ్యాటరీ కెపాసిటీ గల ఫోన్లకు ఫాస్ట్ ఛార్జర్‌ వాడొచ్చా? ఏమవుతుంది?
Advertisement

బ్యాటరీ ఎంత సేఫ్ గా ఉంటే సెల్ ఫోన్ అంత ఎక్కువ కాలం పని చేస్తుంది. అందుకే, బ్యాటరీ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటారు టెక్ నిపుణులు. ఛార్జింగ్ పెట్టే విధానంలో అస్సలు అలసత్వం వహించకూడదంటారు. కంప్లీట్ గా స్విచ్ ఆఫ్  అయ్యే వరకు.. లేదంటే 100% ఛార్జ్ అయ్యేవరకు ఉంచకూడదంటారు. బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అందరికీ కలిగే అనుమానం ఒకటి ఉంది. తక్కువ కెపాసిటీ బ్యాటరీ ఉన్న ఫోన్లకు ఫాస్ట్ ఛార్జర్లు వాడవచ్చా? ఒకవేళ వాడితే ఏమైనా సమస్యలు వస్తాయా? అని ఆలోచిస్తారు.

టెక్ నిపుణులు ఏం చెప్తున్నారంటే?

తక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఫోన్లకు కూడా ఫాస్ట్ ఛార్జర్లు వాడవచ్చు అంటున్నారు నిపుణులు. 4000, 5000 mAh ఫోన్లకు కూడా ఫాస్ట్ ఛార్జర్ అంటే 33W, 45W, 65W, 120W కూడా వాడొచ్చు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఫాస్ట్ ఛార్జర్ వాడినప్పటికీ, ఎంత వాటేజ్ తీసుకోవాలనే విషయాన్ని ఫోన్ నిర్ణయిస్తుంది.  ఫోన్‌లో ఉండే చార్జింగ్ చిప్, సాఫ్ట్‌ వేర్ ఆటోమాటిక్‌ గా పవర్ ను కంట్రోల్ చేస్తాయి. ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే, 65W ఛార్జర్ పెట్టినా ఫోన్ కేవలం 18W మాత్రమే తీసుకుంటుంది. మిగిలిన పవర్ వేస్ట్ అవుతుంది. ఫోన్‌కి ఎలాంటి ప్రమాదం జరగదు.  అయితే, ఫాస్ట్ ఛార్జలు కంపెనీవి అయితే, బ్యాటరీ సేఫ్ గా ఉంటుంది. Realme, Xiaomi, OnePlus, Samsung, Apple లాంటి బ్రాండ్ ఛార్జర్లు లేదంటే Anker, Belkin, UGREEN, Spigen లాంటి రిప్యూటెడ్ థర్డ్ పార్టీ 65W GaN ఛార్జర్లు వాడితే ఎలాంటి సమస్యలు రావు.

ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలంటే?   

Advertisement

⦿ చీప్ లోకల్ డూప్లికేట్ ఛార్జర్ వాడితే రిస్క్ ఉంటుంది. వోల్టేజ్, కరెంట్ కంట్రోల్ సరిగా ఉండదు.  బ్యాటరీ డ్యామేజ్ లేదంటే షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది.

⦿ 100W ఛార్జర్ + చీప్ కేబుల్ వాడిని రిస్క్ ఉంటుంది. కేబుల్ హీట్ అయి కరిగిపోవచ్చు.

Advertisement

⦿ ఫోన్ కవర్ పెట్టి గేమ్ ఆడుతూ ఛార్జ్ చేసినా రిస్క్ ఉంఉంటుంది. హీట్ ఎక్కువై బ్యాటరీ లైఫ్ తగ్గుతుంది. అయితే, ఫాస్ట్ ఛార్జర్ వల్ల కాదు, హీట్ వల్ల ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది.

Read Also:  ఏం తెలివి గురూ.. పాత ల్యాప్‌టాప్ బ్యాటరీలతో ఇంటికి కరెంట్.. ఐడియా అదుర్స్!

 బ్యాటరీ సేఫ్ గా ఉండాలంటే వాడాల్సిన ఛార్జర్లు

⦿ మంచి కంపెనీ ఫాస్ట్ ఛార్జర్ (33W–120W కూడా) వాడొచ్చు.

⦿ చీప్/లోకల్ ఛార్జర్ అస్సలు వాడకండి.

⦿ ఒరిజినల్, మంచి PD/QC కేబుల్ ఉపయోగించండి.

⦿ గేమ్ ఆడుతూ, వీడియో షూట్ చేస్తూ ఛార్జ్ చేస్తే హీట్ ఎక్కువ అవుతుంది. బ్యాటరీ లైఫ్ కొంచెం తగ్గుతుంది. అందుకే ఛార్జింగ్ పెట్టినప్పుడు మరేరకంగా ఉపయోగించకూడదు.

⦿ మీ ఫోన్‌కి 18W సపోర్ట్ ఉన్నా 65W GaN ఛార్జర్ కొనుక్కోవచ్చు. భవిష్యత్తులో ఫాస్ట్ ఛార్జింగ్ ఫోన్ కొన్నప్పుడు వర్క్ అవుతుంది, ఇప్పటికి కూడా సేఫ్‌ గానే పని చేస్తుంది.

Read Also: ఇంటర్నెట్ లేకపోయినా.. నెట్ ఫ్లిక్స్ సినిమాలు, సీరిస్‌లు చూసేయొచ్చు, జస్ట్ ఇలా చేస్తే చాలు!

Related News

ఈ MSI గేమింగ్ ల్యాప్‌టాప్‌లో అన్నీ అదుర్స్.. ఒక్క ధర విషయంలోనే పెద్ద ట్విస్ట్!

అమెజాన్‌లో హాట్ కేకులా.. అమ్ముడవుతున్న ఫ్రెంచ్ డోర్ ఫ్రిడ్జ్‌లు!

శాంసంగ్ గెలాక్సీ ఫోన్ కొనే ఆలోచన ఉందా? 2026లో టాప్ 5G ఫోన్ల లిస్ట్ ఇదే!

ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్..ఎలాంటి మరకలైనా మాయం!

9000mAh బ్యాటరీతో పోకో కొత్త ఫోన్.. ఇండియా వేరియంట్‌లో ఇదే హైలైట్?!

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

Big Stories

Advertisement
×