E-Paper
Advertisement

మీ మెయిల్‌కి..ఎవరు లాగిన్ అవుతున్నారో చెక్ చేయండిలా!

మీ మెయిల్‌కి..ఎవరు లాగిన్ అవుతున్నారో చెక్ చేయండిలా!
Advertisement

Check gmail devices: ప్రస్తుత డిజిటల్ కాలంలో మన స్మార్ట్‌ ఫోన్‌లు, బ్యాంకింగ్ వివరాలు, సోషల్ మీడియా అకౌంట్లు అన్నీ ఒకే ఒక్క ‘గూగుల్ అకౌంట్’చుట్టూ తిరుగుతుంటాయి. జిమెయిల్, గూగుల్ డ్రైవ్, ఫోటోలు ఇలా అన్నీ జిమెయిల్ ఐడీతోనే.. కనెక్ట్ అయి ఉంటాయి. అందుకే.. సైబర్ నేరగాళ్లు గూగుల్ అకౌంట్‌లను టార్గెట్ చేస్తుంటారు. మనకు తెలియకుండానే.. ఎవరైనా హ్యాకర్లు లేదా ఇతర పరికరాల నుంచి మన జిమెయిల్‌లోకి లాగిన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తాజా గూగుల్ సెక్యూరిటీ అప్‌డేట్ల ప్రకారం.. మీ అకౌంట్ సేఫ్‌గా ఉందో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేయడం అత్యంత ముఖ్యం.

మీ జిమెయిల్‌కి ఎవరు లాగిన్ అవుతున్నారు?

మీ గూగుల్ అకౌంట్ ఏయే పరికరాలు కనెక్ట్ అయి ఉన్నాయో చెక్ చేయడం చాలా ఈజీ. దీని కోసం మీరు కింద పేర్కొన్న సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వొచ్చు.

Advertisement

1. ముందుగా మీ ఫోన్ లేదా కంప్యూటర్‌లో Google Account సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. లేదా నేరుగా మీ జిమెయిల్ ఓపెన్ చేసి ప్రొఫైల్ పిక్చర్ పై క్లిక్ చేసి ‘Manage your Google Account’ సెలెక్ట్ చేయండి.

2.అక్కడ పైన కనిపించే Security ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

Advertisement

3.కొంచెం కిందకు స్క్రోల్ చేస్తే Your Devices అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ Manage all devices పై క్లిక్ చేయండి.

4.ఇప్పుడు మీ గూగుల్ అకౌంట్‌కు గతంలో లేదా ప్రస్తుతం లాగిన్ అయి ఉన్న అన్ని ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌ల లిస్ట్ కనిపిస్తుంది.

5.ఆ లిస్ట్‌లో మీకు తెలియని లేదా మీరు ప్రస్తుతం వాడని ఏదైనా గాడ్జెట్ కనిపిస్తే.. అది మీ అకౌంట్ ప్రమాదంలో ఉందని అర్థం.

తెలియని పరికరం కనిపిస్తే ఏం చేయాలి?

ఒక వేళ మీకు పరిచయం లేని ఫోన్ లేదా పీసీ లాగిన్ లిస్ట్‌లో కనిపిస్తే వెంటనే అప్రమత్తం కావాలి. ఆ తెలియని డివైజ్ పై క్లిక్ చేసి వెంటనే Sign Out (సైన్ అవుట్) ఆప్షన్ పై  క్లిక్ చేయండి. దాని వల్ల ఆ వ్యక్తి ఫోన్ నుంచి మీ గూగుల్ అకౌంట్ వెంటనే లాగ్‌ అవుట్ అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే మీ గూగుల్ పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం చాలా ముఖ్యం.

Also Read: అమెజాన్ సేల్..65 ఇంచుల స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు

సేఫ్టీ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

టూ-స్టెప్ వెరిఫికేషన్: మీ గూగుల్ అకౌంట్‌కు టూ-స్టెప్ వెరిఫికేషన్ ఎప్పుడూ ఆన్‌లో ఉంచుకోండి.దీని వల్ల ఎవరైనా పాస్‌వర్డ్ కనిపెట్టినా, మీ ఫోన్‌కు వచ్చే ఓటీపీ వస్తేనే లాగిన్ అవ్వగలరు.

సెక్యూరిటీ కీస్ , యాప్ పాస్‌వర్డ్‌లు: సైబర్ సురక్షిత సేవలు అందించే కొన్ని అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీ కీస్ ధరలు మార్కెట్లో రూ.1,500 నుంచి రూ.5,000 వరకు అందుబాటులో ఉన్నాయి. అయితే.. సాధారణ యూజర్లకు గూగుల్ అందించే టూ-ఫ్యాక్టర్ ఆథెంటికేషనే సరి పోతుంది.

థర్డ్-పార్టీ యాప్ పర్మిషన్స్: ఎప్పటికో వాడిన కొన్ని యాప్స్‌కు మీ గూగుల్ అకౌంట్ యాక్సెస్ ఇచ్చి ఉంటాం. అలాంటి అనవసరమైన యాప్స్ పర్మిషన్లను సెక్యూరిటీ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఎప్పటికప్పుడు తొలగించాలి.

మీ డిజిటల్ జీవితానికి గూగుల్ అకౌంట్ ప్రధాన ఆధారం. చిన్న అజాగ్రత్త కూడా పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టొచ్చు. కాబట్టి ఇప్పుడే మీ జిమెయిల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఏయే పరికరాలు లాగిన్.. అయి ఉన్నాయో చెక్ చేయండి.

Related News

గూగుల్ క్రోమ్ యూజర్లకు అలర్ట్.. 6 కీలక లోపాలకు పరిష్కారం, వెంటనే ఇలా అప్డేట్ చేసుకోండి!

రూ.720కే అదిరిపోయే సౌండ్ బార్‌..ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ!

యాపిల్ ఐప్యాడ్‌కు గట్టి పోటీ ఇచ్చేలా ఒప్పో కొత్త మినీ టాబ్లెట్.. ధర రూ.95,000!

సైజులో చిన్నదే.. హెల్త్ ఫీచర్లు మాత్రం బోలెడు, Oura Ring 5 భారత్‌లోకి వచ్చేసింది!

ChatGPTలో పర్సనల్ చాట్స్ లాకింగ్ ఫీచర్ వచ్చేసింది.. కానీ ఆ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు!

ఫోన్ ఛార్జింగ్ సరిగ్గా అవట్లేదా? కొత్త ఫోన్ కొనేముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!

రూ.10 వేలకే కొత్త ఫ్లిప్ ఫోన్.. ఇందులో ఉన్న ప్రత్యేకత తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Big Stories

Advertisement
×