Big screen TV discounts: ప్రస్తుత డిజిటల్ ట్రెండ్‌లో ..హోమ్ ఎంటర్ టైన్‌మెంట్ ఫీల్ పూర్తిగా మారిపోయింది. సాధారణ ఎల్‌ఈడీ టీవీల స్థానంలో ఇప్పుడు 65 ఇంచుల పెద్ద స్క్రీన్ 4కే.. స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. సినిమాలను, స్పోర్ట్స్‌ను అసలైన థియేటర్ ఫీల్‌తో ఎంజాయ్ చేయడానికి పెద్ద స్క్రీన్ టీవీలు ఎంతగానో.. ఉపయోగపడతాయి. అయితే.. వీటి ధరలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది వెనకంజ వేస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సంచలన సేల్‌తో ముందుకు వచ్చింది. తాజా గూగుల్ అప్‌డేట్లు, ట్రెండింగ్ ఫీచర్ల ఆధారంగా.. ఈ సేల్‌లో లభిస్తున్న టాప్ 5 65-ఇంచ్ టీవీ డీల్స్, వాటి ధరల వివరాలు ఇప్పుడు చూద్దాం.
పిక్చర్ క్వాలిటీ , సౌండ్‌లో సోనీ బ్రాండ్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ సేల్‌లో సోనీ బ్రావియా 3 సిరీస్ 65-ఇంచ్ టీవీపై అదిరి పోయే ఆఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర సుమారు రూ. 89,990 వరకు ఉండగా, సేల్ డిస్కౌంట్లు , ఎస్‌బీఐ కార్డ్ బ్యాంక్ ఆఫర్లతో కలిపి మరింత తక్కువ ధరకు లభిస్తోంది. ఇందులో.. ఉన్న 4K HDR ప్రాసెసర్ X1 విజువల్స్‌ను అత్యంత స్పష్టంగా మలుస్తుంది. గూగుల్ టీవీ ఫీచర్ ఉండటం వల్ల మీకు కావలసిన అన్ని ఓటీటీ యాప్స్‌ను ఈజీగా యాక్సెస్ చేయెచ్చు.
సన్నని బెజెల్స్‌తో ప్రీమియం లుక్ కోరుకునే వారికి శాంసంగ్ బ్రాండ్ బెస్ట్ ఛాయిస్. శాంసంగ్ క్రిస్టల్ యూహెచ్‌డీ 65-ఇంచ్ మోడల్ మార్కెట్లో రూ. 81,900 ఎంఆర్‌పీ కలిగి ఉండగా..అమెజాన్ సేల్‌లో ఇది కేవలం రూ.58,990 ప్రారంభ ధరతో లభిస్తోంది. అంతేకాకుండా.. కంపెనీ దీనికి సుదీర్ఘమైన సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ సపోర్ట్‌ను అందిస్తోంది. క్యూ-సింఫనీ సౌండ్ టెక్నాలజీ దీని ప్రత్యేకత.
టెక్నాలజీ పరంగా అప్‌గ్రేడ్ అయిన ఫీచర్లు కోరుకునే.. వారికి టీసీఎల్ బ్రాండ్ మినీ ఎల్‌ఈడీ టీవీ చక్కటి ఆప్షన్. దీని అసలు ధర రూ. 1,32,990 కాగా.. ఫెస్టివల్ డిస్కౌంట్ల సహాయంతో.. ఇది రూ. 71,990 ధరకే కస్టమర్లకు అందుబాటులో ఉంది. డాల్బీ విజన్, హెచ్‌డీఆర్ 10+ సపోర్ట్ దీని సొంతం. గేమింగ్ , లవర్స్ కు ఈ క్యూడీ-మినీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే అద్భుతమైన కాంట్రాస్ట్ రేషియోను అందిస్తుంది.
బడ్జెట్ ధరలో క్యూఎల్‌ఈడీ టెక్నాలజీ కావాలనుకునే.. వారి కోసం ఫిలిప్స్ ఈ అద్భుతమైన మోడల్‌ను తెచ్చింది.దీని మార్కెట్ ధర రూ. 64,990 వరకు ఉండగా, అమెజాన్ సేల్ ఆఫర్ల ద్వారా ఇది కేవలం రూ.52,999 ధరకే లభిస్తోంది. వైబ్రెంట్ కలర్స్ , గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్ వంటి స్మార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్ క్యూఎల్‌ఈడీ టీవీ కొనాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ డీల్.
Also Read: మతిపోయే ఫీచర్లతో బెస్ట్ ఇయర్‌బడ్స్,ఫుల్ డీటెయిల్స్ ఇవిగో!
తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే మిడిల్ క్లాస్ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని హైయర్ బ్రాండ్ ఈ టీవీని అందిస్తోంది.దీని అసలు ధర రూ. 1,00,790 అయినప్పటికీ, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో.. భారీ తగ్గింపు పోను రూ. 62,999 కే మీ సొంతం చేసుకోవచ్చు.ఇందులో 2GB RAM ,32GB స్టోరేజ్ లభిస్తుంది. అలాగే డాల్బీ విజన్ , పవర్ ఫుల్ సౌండ్ అవుట్ పుట్ దీని సొంతం.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఆఫర్లను.. ఉపయోగించడం ద్వారా అదనంగా మరో 10 శాతం వరకు డిస్కౌంట్ పొందొచ్చు. మీరు గనుక మీ పాత టీవీని మార్చి కొత్త బిగ్ స్క్రీన్ ఇంటికి తెచ్చుకోవాలనుకుంటే..ఈ డీల్స్ నిజంగా అద్భుతమైన అవకాశాలుగా చెప్పొచ్చు. స్టాక్ అయిపోయేలోపు మీ బడ్జెట్‌కు తగిన మోడల్‌ను ఆర్డర్ చేసేయండి!