DMart Offers: డీమార్ట్ అంటే భారతదేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు నమ్మకం పెట్టుకున్న రిటైల్ చైన్. నిత్యావసర సరుకుల నుంచి ఇంటి అవసరాల వరకూ తక్కువ ధరల్లో అందించడమే డీమార్ట్‌ను ప్రత్యేకంగా నిలబెడుతుంది. ప్రతి సీజన్‌కు అనుగుణంగా అవసరమయ్యే ఉత్పత్తులను ముందుగానే స్టోర్లలోకి తీసుకువచ్చి, ఖర్చు తగ్గించే సేవింగ్స్ ఇవ్వడం ద్వారా మిడిల్ క్లాస్ కుటుంబాలకు డీమార్ట్ ఎప్పుడూ బలమైన ఆధారంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చలికాలాన్ని లక్ష్యంగా చేసుకుని డీమార్ట్ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన వింటర్ ఆఫర్లను ప్రకటించింది. ఆ బంపర్ సేవింగ్స్‌లో ఏయే ఉత్పత్తులు ఉన్నాయో ఇప్పుడు వివరంగా చూద్దాం.
వింటర్ సేవింగ్స్ ప్రత్యేకత
డీమార్ట్ తీసుకువచ్చిన ఈ వింటర్ సేవింగ్స్‌లో చలి ప్రభావం ఎక్కువగా ఉండే కాలంలో ఇంట్లో అవసరమయ్యే అనేక వస్తువులు తగ్గింపు ధరల్లో ఉన్నాయి. వింటర్ మొదలవగానే హాట్ వాటర్, వేడి వేడి టీ, కాఫీ, వెచ్చని దుప్పట్లు మాత్రమే కాదు, ఇంట్లో కంఫర్ట్ పెంచే చిన్న ఎలక్ట్రానిక్స్ కూడా ఈ ఆఫర్లలో ఉన్నాయి. వినియోగదారులకు రోజువారీ ఉపయోగించే అనేక గాడ్జెట్లు బడ్జెట్ ధరల్లో అందిస్తున్నట్టు డీమార్ట్ స్పష్టంగా తెలుస్తోంది.
రాకోల్డ్ గీజర్ ఆఫర్
ముఖ్యంగా రాకోల్డ్ గీజర్‌కి ఎం ఆర్ పి 9,549 కాగా, డీమార్ట్‌లో ధర 4,599గా చూపించారు. ఇది ఈ ఆఫర్‌లో ప్రధాన ఆకర్షణ. వింటర్ సీజన్‌లో ప్రతి రోజు వేడి నీరు అవసరమయ్యే కుటుంబాలకు ఇది చాలా ఉపయోగపడే డీల్. అదేవిధంగా వింటర్‌కు పనికొచ్చే మరికొన్ని చిన్న ఎలక్ట్రిక్ ఐటమ్స్ కూడా డీమార్ట్ ప్రకటించింది. బాత్రూమ్‌లో ఉపయోగించే చిన్న రాడ్ హీటర్లు, హోమ్ యూజ్ మిని హీటర్లు కూడా ఈ ఆఫర్ లిస్టులో ఉన్నట్టు తెలుస్తోంది. వీటి ధరలు సాధారణంగా 500 నుంచి 1500 రేంజ్‌లో ఉండే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ కెట్టిల్ డీల్
దాని పక్కనే ఉన్న బోరోసిల్ ఎలక్ట్రిక్ కెట్టిల్‌కి ఎం ఆర్ పి 1,440 కాగా, డీమార్ట్‌లో ధర 699గా అందిస్తుంది. వింటర్‌లో టీ, కాఫీ, సూప్స్ లాంటి వేడి పానీయాలు వెంటనే రెడీ చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కెట్టిల్‌తో పాటు వంటింటిలో వాడకానికి చిన్న మిని స్టోవ్ లాంటి ఐటమ్స్ కూడా డీమార్ట్ ఆఫర్ ప్రకటించింది. ఇవి ఇంట్లో వేడి వేడిగా వంటలు చేసుకోవడానికి బడ్జెట్‌లో మంచి ఎంపికగా నిలుస్తాయి. వీటి ధరలు సాధారణంగా 300 నుంచి 700 మధ్యలో ఉంటాయని డీమార్ట్ ప్రకటించింది.
హాట్ వాటర్ స్టిరర్ ఆప్షన్
క్రాంప్టన్ హాట్ వాటర్ స్టిరర్‌కు రూ. 910 కాగా, డీమార్ట్‌లో సగానికి అంటే సుమారు ధర 569గా తగ్గింది. తక్కువ ఖర్చుతో నీటిని వేడి చేసుకునే ఈ ఐటమ్ హాస్టల్స్, సింగిల్ రూమ్‌లలో ఉండే వాళ్లకు చాలా ఉపయోగపడుతుంది. దీనితో పాటు బకెట్ హీట్ చేసే ఇతర చిన్న ఐటెమ్స్ కూడా ఈ ఆఫర్లలో భాగంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇవి సాధారణంగా 200 నుంచి 500 బడ్జెట్ రేంజ్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి హాస్టళ్లలో వున్న వారికి మంచి బెనిఫిట్స్ అనే చెప్పాలి.
వింటర్ టెక్‌స్టైల్ ఆఫర్లు
చివరిగా ఉన్న రెడ్ దుప్పటి రూ.279 కాగా, డీమార్ట్ ధర 229కే అందిస్తుంది. చలి ఎక్కువగా ఉండే రాత్రుల్లో మనకు వేడిని నిలబెట్టేందుకు ఇది మంచి బడ్జెట్ ఎంపిక. దుప్పటితో పాటు వింటర్ బెడ్‌షీట్‌లు, తక్కువ మందంతో ఉన్న బ్లాంకెట్‌లు, వూల్ మిక్స్ రగ్గులు కూడా ఈ వింటర్ ఆఫర్లలో ఉన్నట్టు పోస్టర్ సూచిస్తోంది. వీటి ధరలు సాధారణంగా 150 నుంచి 400 వరకు ఉంటాయి. మొత్తం చూస్తే డీమార్ట్ ఈ వింటర్‌కు కావలసిన అన్ని అవసరాలను ఒకేచోట తగ్గింపు ధరల్లో అందించాలనే ఉద్దేశంతో ఈ సేవింగ్స్‌ను తీసుకువచ్చినట్టు స్పష్టంగా తెలుస్తోంది.