E-Paper
Advertisement

Selvaraghavan: ఫోటోలు డిలీట్.. రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్

Selvaraghavan: ఫోటోలు డిలీట్.. రెండోసారి విడాకులు తీసుకోబోతున్న డైరెక్టర్
Advertisement

Selvaraghavan : సినిమా ఇండస్ట్రీలో ఎంత తొందరగా లవ్ లో పడతారో అంతే వేగంగా విడాకుల బాట కూడా పడుతూ ఉంటారు సెలబ్రిటీలు. కొంతమంది అలా విడాకులు కాగానే ఇలా రెండో పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు. అయితే రెండోసారి కూడా దాంపత్యం బీటలు వారడం అన్నది అరుదుగా చూస్తూ ఉంటాము. కానీ తాజాగా ఓ స్టార్ డైరెక్టర్ రెండోసారి కూడా విడాకుల దిశగా అడుగులు వేస్తున్నట్టు సోషల్ మీడియా కోడై కూస్తోంది.

విడాకుల రూమర్లు ఎలా పుట్టాయంటే?

తమిళ స్టార్ హీరో ధనుష్ బ్రదర్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నటుడు సెల్వరాఘవన్ మరోసారి విడాకుల బాట పడుతున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. దానికి కారణం ఆవిడ భార్య చేసిన పనే. గీతాంజలి సెల్వరాఘవన్ తాజా తన ఇన్స్టా గ్రామ్ లో సెల్వరాఘవన్ తో ఉన్న ఫోటోలు అన్నింటినీ డిలీట్ చేసింది. ఆమె చేసిన ఈ పనే ఇప్పుడు కొత్త అనుమానాలకు తావిచ్చింది. నిజానికి ఇటీవల కాలంలో ఇలా సోషల్ మీడియాలో ఫోటోలను రిమూవ్ చేసే డీవోర్స్ హింట్ ఇస్తున్నారు సెలఎబ్రిటీలు. అందుకే సెల్వరాఘవన్ కూడా తన రెండవ భార్యతో విడాకులు తీసుకోబోతున్నారు అనే గాసిప్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. దీనిపై ఇంకా సెల్వరాఘవన్ లేదా ఆయన భార్య స్పందించలేదు. దీంతో ఈ డైరెక్టర్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

రెండోసారి సెల్వరాఘవన్ విడాకులు ?

Advertisement

కాగా సెల్వరాఘవన్‌ మొదటి భార్య సోనియా అగర్వాల్‌. ‘7/G బృందావన్‌ కాలనీ’ చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైన సోనియా అగర్వాల్‌, ఆ సినిమా షూటింగ్ టైమ్ లోనే దర్శకుడు సెల్వరాఘవన్‌ ప్రేమించుకున్నారు. 2006లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ళు గడిచాక మనస్పర్థల కారణంగా మ్యూచువల్ గా డివోర్స్ తీసుకున్నారు. 2010లో అఫిషియల్ గా సోనియా – సెల్వ విడిపోయారు. 2011లో సెల్వరాఘవన్ గీతాంజలి రామన్‌ను పెళ్లి చేసుకున్నారు.

గీతాంజలి ముందు సెల్వరాఘవన్ “మయక్కం ఎన్న” సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసింది. ఆమె తండ్రి P.S. రామన్  మాజీ అడ్వకేట్ జనరల్ ఆఫ్ తమిళనాడు. లవ్ మ్యారేజ్ చేసుకున్న ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇక తరచుగా ఈ జంట ఫ్యామిలీ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తారు. ఈ ఏడాది మే 8న  ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు బ్రెయిన్ ట్యూబర్క్యులోసిస్ (టీబీ) ఉందనే విషయాన్ని షేర్ చేసింది గీతాంజలి. అలాగే ఆ జబ్బుకు ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్టు వెల్లడించింది. నిజానికి అటు రాఘవన్, ఇటు గీతాంజలి ఇద్దరూ ఫ్యామిలీ లైఫ్‌ను ప్రైవేట్‌గా ఉంచుతారు. కానీ ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రం హాలిడేస్, పిల్లల బర్త్‌డేలు వంటి స్పెషల్ విషయాలను అభిమానులతో పంచుకుంటారు. మరి ఈ డివోర్స్ రూమర్స్ పై ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×