E-Paper
Advertisement

Electricity Bill Tips: ప్రతినెలా కరెంట్ బిల్లు షాకిస్తోందా? ఈ 6 పొరపాట్లే మీ కొంప ముంచుతున్నాయి!

Electricity Bill Tips: ప్రతినెలా కరెంట్ బిల్లు షాకిస్తోందా? ఈ 6 పొరపాట్లే మీ కొంప ముంచుతున్నాయి!
Advertisement

Electricity Bill Tips: విద్యుత్ వినియోగాన్ని ఎంత పొదుపుగా వాడినా.. నెలాఖరులో వచ్చే కరెంట్ బిల్లును చూసి కొన్నిసార్లు షాక్ అవుతుంటాం. ఆ సమయంలో అదేంటి కరెంట్ ఎక్కువగా వాడకపోయినా బిల్లు ఎక్కువగా వచ్చినట్టుందే అని కన్ఫ్యూజ్ అవుతుంటాం. అయితే మనం తెలియకుండా చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు నెల చివర్లో జేబుకు చిల్లు పెడుతున్నాయి. కేవలం ఫ్యాన్లు, లైట్లు వాడటమే కాకుండా ఇంట్లోని పరికరాల సామర్థ్యం, ఇంటి నిర్మాణం, మన అలవాట్లు కూడా బిల్లు పెరగడానికి ప్రధాన కారణమవుతాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లును అడ్డూఅదుపు లేకుండా పెంచే 6 మిస్టేక్స్ ఏంటో చూసేద్దాం.

రిమోట్‌తో ఆఫ్ చేస్తే సరిపోతుందా?

చాలామంది టీవీ చూసిన తర్వాత రిమోట్‌తో మాత్రమే ఆఫ్ చేస్తారు. కానీ మెయిన్ స్విచ్ ఆపడం మర్చిపోతుంటారు. ఇలా చేయడం వల్ల ఆ పరికరాలు స్టాండ్‌బై మోడ్‌లో ఉండి ఎంతో కొంత విద్యుత్‌ను వాడుకుంటూ ఉంటాయి. దీనినే ఫాంటమ్ పవర్ అని కూడా పిలుస్తారు. ఛార్జర్లు, మైక్రోవేవ్ ఓవెన్లు, గేమింగ్ కన్సోల్‌లు ఇలా ప్లగ్‌లో ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కరెంట్‌ను ఖర్చు చేస్తూ ఉంటాయి.

ఇంకా పాతవే వాడటం:

Advertisement

ఎప్పుడో పదేళ్ల క్రితమో లేదా 20 ఏళ్ల క్రితమో కొన్న రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు ఇంకా వాడటం వల్ల విద్యుత్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. పాత మోడల్ యంత్రాలు పనిచేయడానికి ఎక్కువ కరెంటును తీసుకుంటాయి. ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న స్టార్ రేటింగ్ ఉన్న అత్యాధునిక పరికరాలు తక్కువ విద్యుత్‌తో ఎక్కువ పనితీరును అందిస్తాయి. పాతబడిన వాటిని మార్చుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఆర్థికంగా లాభం ఉంటుంది.

Also Read: బడ్జెట్ ధరే కానీ ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవల్.. త్వరలో లాంచ్ కానున్న టాప్-5 ల్యాప్‌టాప్స్!

కిటికీలు, తలుపులు తెరిచి ఉంచటం:

Advertisement

ఇంటి కిటికీలు, తలుపుల సందుల నుండి బయటి గాలి లోపలికి రావడం వల్ల ఏసీ, హీటర్ల మీద ఒత్తిడి పెరుగుతుంది. గది ఉష్ణోగ్రతను కాపాడటానికి ఈ మిషన్లు ఎక్కువ సమయం రన్ అవ్వాల్సి ఉంటుంది. దీంతో కరెంట్ బిల్లు ఊహించని విధంగా పెరుగుతుంది. అలాగే ఇంటి పైకప్పు, గోడలకు మంచి ఇన్సులేషన్ ఉంటే, గదిలోని కూలింగ్ బయటకు పోకుండా ఉంటుంది. దీంతో విద్యుత్ కూడా ఆదా అవుతుంది.

ఏయే బల్బులు వాడాలి?

సాధారణ ఇన్‌కాన్డెసెంట్ బల్బులు వెలుతురు కంటే వేడిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఎక్కువ విద్యుత్‌ను తీసుకుంటాయి. వాటి స్థానంలో ఎల్ఈడీ బల్బులను వాడటం వల్ల వెలుతురు పెరగడమే కాకుండా బిల్లు గణనీయంగా తగ్గుతుంది. అలాగే గదిలో ఎవరూ లేనప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆపకపోవడం వంటి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా నెలవారీ ఖర్చును పెంచుతుంది.

ఏసీ ఫిల్టర్లను శుభ్రం చేస్తున్నారా?

ఏసీలు, కూలర్లలో ఉండే ఎయిర్ ఫిల్టర్లు దుమ్ముతో నిండిపోయినప్పుడు గాలి ప్రసరణ సరిగ్గా జరగదు. దీనివల్ల ఆ యంత్రాలు గదిని చల్లబరచడానికి ఎక్కువ శక్తిని ఉపయోగిస్తాయి. ఇది విద్యుత్ వినియోగాన్ని పెంచడమే కాకుండా యంత్రాలు త్వరగా పాడయ్యేలా చేస్తుంది. అందుకే ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం ద్వారా ఏసీ పనితీరును మెరుగుపరచుకోవచ్చు.

వైరింగ్‌లో లోపాలు:

కొన్నిసార్లు వైరింగ్‌లో లీకేజీ ఉండటం వల్ల కూడా విద్యుత్ వృథా అవుతుంది. అలాగే నాసిరకం ఎలక్ట్రికల్ పరికరాలు వాడటం వల్ల షార్ట్ సర్క్యూట్లు జరిగే అవకాశం ఉంది. తరచూ అకస్మాత్తుగా బిల్లు పెరుగుతున్నట్లయితే ఒకసారి ఎలక్ట్రీషియన్‌తో వైరింగ్‌ను తనిఖీ చేయించుకోవడం మంచిది.

Also Read: ఈ సింపుల్ ట్రిక్స్‌తో.. మూలనపడ్డ పాత మొబైల్‌ను 5 రకాలుగా వాడుకోవచ్చు!

Related News

కన్నుల పండుగే.. ఏకంగా రూ.18,000 తగ్గింది, ఫ్లిప్‌కార్ట్‌లో రియల్‌మీ బంపర్ డిస్కౌంట్!

ఐకూ నుంచి క్రేజీ కాంపాక్ట్ టాబ్లెట్.. నెక్ట్స్ జనరేషన్ చిప్‌సెట్‌తో ఎంట్రీ!

ఐఫోన్ యూజర్లకు మెటా బిగ్ ఆఫర్.. ఐక్లౌడ్ లేకున్నా వాట్సప్ చాట్ బ్యాకప్ ఇక ఈజీ!

ఆకాశం నీలం, సూర్యాస్తమయం ఎరుపు.. అంతరిక్షం నలుపు.. అసలేంటీ రంగుల మిస్టరీ?

జస్ట్.. రూ.3,000 లోపే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ఐఫోన్ కంటే పవర్‌ఫుల్ టార్చ్‌తో Nokia 4G ఫోన్!

8,100mAh బ్యాటరీ, AI బటన్‌తో హానర్ నుంచి క్రేజీ ఫోన్.. ధరెంతో తెలిస్తే Buy Now నొక్కేస్తారు!

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

Big Stories

Advertisement
×