E-Paper
Advertisement

Upcoming Laptops March 2026: బడ్జెట్ ధరే కానీ ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవల్.. త్వరలో లాంచ్ కానున్న టాప్-5 ల్యాప్‌టాప్స్!

Upcoming Laptops March 2026: బడ్జెట్ ధరే కానీ ఫీచర్లు మాత్రం నెక్ట్స్ లెవల్.. త్వరలో లాంచ్ కానున్న టాప్-5 ల్యాప్‌టాప్స్!
Advertisement

Upcoming Laptops March 2026: బడ్జెట్ ధరలో అదిరిపోయే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లు ఉన్న ల్యాప్‌టాప్ కోసం వెతుకుతున్నారా? అయితే మీ ఎదురుచూపులకు ఫుల్‌స్టాప్ పడే సమయం వచ్చేసింది. ఈ మార్చి నెల టెక్ లవర్స్‌కి నిజంగా పండగ అనే చెప్పాలి. ఎందుకంటే.. దిగ్గజ కంపెనీలన్నీ పోటీ పడి మరి అల్ట్రా స్లిమ్ డిజైన్లతో, ఫ్యూచరిస్టిక్ ఫీచర్లతో తమ కొత్త మోడళ్లను మార్కెట్లోకి వదులుతున్నాయి.

ఆఫీస్ వర్క్ అయినా, కాలేజ్ ప్రాజెక్ట్స్ అయినా లేదా భారీ గేమింగ్ అయినా.. మన పనిని చిటికెలో పూర్తి చేసేలా ఈ AI ల్యాప్‌టాప్‌లు డిజైన్ అయ్యాయి. మరి ఈ నెలలో ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తున్న ఆ టాప్-5 మోడల్స్ ఏవి? వాటి ధరలు మన బడ్జెట్‌కు అందుతాయా.. వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Apple MacBook Air M5

Advertisement

యాపిల్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాక్‌బుక్ ఎయిర్ M5 ఎట్టకేలకు ఈ నెలలో విడుదలవుతోంది. దీనిలో కొత్తగా వాడిన M5 చిప్‌సెట్ పాత మోడళ్లతో పోలిస్తే AI పనులను 4 రెట్లు వేగంగా పూర్తి చేస్తుంది. దీని 13 అంగుళాల మోడల్ ధర సుమారు రూ.1,19,900 నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. పవర్‌పుల్ బ్యాటరీ లైఫ్, స్లిమ్ లుక్‌తో ఇది ప్రొఫెషనల్స్‌ను ఆకట్టుకోనుంది.

Also Read: ల్యాప్‌టాప్‌లో ఈ షార్ట్‌కట్స్ తెలిస్తే.. ఇకపై మౌస్ వాడాల్సిన అవసరమే ఉండదు!

Lenovo Yoga Slim 7i Aura Edition

Advertisement

ప్రముఖ లెనోవో తన కొత్త ఆరా ఎడిషన్‌తో వినియోగదారులను సర్ప్రైజ్ చేయనుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్.. క్రియేటివ్ పనులు చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. దీని ధర సుమారు రూ.1,01,063 గా ఉండొచ్చని సమాచారం. అద్భుతమైన గ్రాఫిక్స్, క్లాసీ డిస్‌ప్లే ఈ ట్యాప్‌టాప్ ప్రత్యేకతలు.

Samsung Galaxy Book 6 Pro

శాంసంగ్ తమ గెలాక్సీ ఎకోసిస్టమ్‌ను మరింత విస్తరించడానికి ‘బుక్ 6 ప్రో’ను లాంచ్ చేస్తోంది. సుమారు రూ.1,79,990 ధరకు అందుబాటులోకి రానున్న ఈ ల్యాప్‌టాప్‌లో 16 అంగుళాల భారీ స్క్రీన్ ఉంటుంది. ఫోన్ నుంచి ల్యాప్‌టాప్‌కు సులభంగా డేటా షేరింగ్ చేసుకునే సౌలభ్యం ఉండటం వల్ల ఇది బిజినెస్ యూజర్లకు ఫేవరెట్ ఛాయిస్‌గా మారనుంది.

Acer Swift 14 AI

తక్కువ బరువుతో, మెరుగైన పనితీరుని అందించే ల్యాప్‌టాప్ కావాలనుకునే వారికి ఏసర్ స్విఫ్ట్ 14 AI బెస్ట్ ఆప్షన్. ఈ నెల మూడో వారంలో ఈ ల్యాప్‌టాప్ విడుదల కానుంది. దీని ధర సుమారు రూ.80,000 నుండి రూ.95,000 మధ్య ఉండొచ్చు. పేరులోనే ఉన్నట్లుగానే.. దీనిలో ఉన్న AI ఫీచర్లు మన రోజువారీ పనులను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి.

Asus Zenbook S 16 – 2026 Edition

ఆసస్ కంపెనీ జెన్‌బుక్ సిరీస్‌లో సరికొత్త మోడల్‌ను తీసుకొస్తోంది. AMD రైజెన్ AI ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ల్యాప్‌టాప్ ధర సుమారు రూ.1,69,990గా ఉండొచ్చు. ఈ ల్యాప్‌టాప్ చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉంటుంది. ముఖ్యంగా గేమింగ్, వీడియో ఎడిటింగ్ చేసే వారికి ఇది బాగా సూట్ అవుతుంది. మార్చి నెలలో వస్తున్న ఈ ల్యాప్‌టాప్‌లన్నీ టెక్నాలజీ పరంగా సరికొత్త విప్లవం తీసుకురానున్నాయి.

Also Read: వచ్చేస్తున్నాయ్ ఏఐ స్మార్ట్ టీవీలు.. శాంసంగ్ నుంచి సోనీ వరకు, ఏదైనా బడ్జెట్‌లోనే!

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×