Fire-Boltt Hurricane smartwatch: ప్రస్తుత డిజిటల్ యుగంలో వాచ్ అనేది కేవలం టైం చూసుకోవడానికి మాత్రమే కాదు, మన హెల్త్ అండ్ ఫిట్‌నెస్‌ను ట్రాక్ చేసే ఒక ముఖ్యమైన గ్యాడ్జెట్‌గా మారిపోయింది. మీరు కూడా రూ. 1,500 లోపు బడ్జెట్‌లో బెస్ట్ లుక్ , క్రేజీ ఫీచర్లు ఉన్న స్మార్ట్‌వాచ్ కోసం చూస్తుంటే.. Fire-Boltt Hurricane Smartwatch మీకు బెస్ట్ ఆప్షన్. కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లే, 360 హెల్త్ ట్రాకింగ్, 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్‌తో లభించే ఈ స్మార్ట్‌వాచ్ కేవలం రూ. 1,399 కే అందుబాటులో ఉంది. దీని ఫుల్ డీటైల్స్ ఇప్పుడు చూద్దాం.
ఈ స్మార్ట్‌వాచ్‌ను చూడగానే మనల్ని ఆకట్టుకునేది దీని 1.3 ఇంచుల డిస్‌ప్లే . 2D కర్వ్డ్ డిజైన్ వల్ల స్క్రీన్ చాలా ప్రీమియమ్‌గా, స్మూత్‌గా కనిపిస్తుంది. దీని బ్లాక్ స్ట్రాప్ చేతికి చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. అదనంగా రకరకాలవాచ్ ఫేసెస్ సపోర్ట్ ఉండటం వల్ల మీ మూడ్ లేదా వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్‌కి తగ్గట్టుగా వాచ్ ఫేస్‌లను ప్రతీరోజూ మార్చుకోవచ్చు.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే వారికి ఈ వాచ్ ఒక పర్ఫెక్ట్ గైడ్‌లా పనిచేస్తుంది.
1. రోజంతా మీ గుండె వేగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంది.
2.మీరు ఎంతసేపు ప్రశాంతంగా నిద్రపోయారో కచ్చితంగా ట్రాక్ చేస్తుంది.
3.రక్తంలో ఆక్సిజన్ శాతాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు.
4.మహిళల సైకిల్ ట్రాకింగ్‌తో పాటు ఒత్తిడి తగ్గించుకోవడానికి బ్రీథింగ్ ఎక్సర్‌సైజ్ మోడ్స్ కూడా ఇందులో ఉన్నాయి.
మీరు రన్నింగ్, సైక్లింగ్, యోగా, బ్యాడ్మింటన్, జిమ్ లేదా వాకింగ్.. ఇలా ఏ వర్కౌట్ చేసినా ట్రాక్ చేయడానికి ఇందులో 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్స్ అందించారు. మీరు ఎన్ని కేలరీలు ఖర్చు చేశారు, ఎంత దూరం నడిచారో ఈజీగా ఫోన్ యాప్‌లో చూసుకోవచ్చు.
ఫోన్‌కి వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్‌లు, వాట్సాప్ , సోషల్ మీడియా నోటిఫికేషన్‌లను చేతిపైనే నేరుగా చూసుకోవచ్చు.
IP67 వాటర్ రెసిస్టెంట్: చెమట పట్టినా, లేదా వర్షంలో తడిసినా వాచ్ పాడవుతుందనే భయం ఉండదు.
మంచి బ్యాటరీ బ్యాకప్: ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సాధారణ వాడకంలో కొన్ని రోజుల పాటు ఈజీగా రన్ అవుతుంది.
రూ. 1,500 లోపు బడ్జెట్‌లో ప్రీమియం కర్వ్డ్ డిస్‌ప్లే, 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్స్, 360 హెల్త్ ట్రాకింగ్ ఇచ్చే స్మార్ట్‌వాచ్ కోసం చూస్తుంటే ఈ వాచ్ కొనొచ్చు. ధర పరంగా చూస్తే ఇది నిజంగా పర్ఫెక్ట్ ‘పైసా వసూల్’ గ్యాడ్జెట్!