E-Paper
Advertisement

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?

గోరువెచ్చని నీటిలో.. తేనె కలిపి తాగితే నిజంగా బరువు తగ్గుతారా?
Advertisement

Warm water with honey : బరువు తగ్గాలనే ఆలోచన రాగానే మనకు మొదటగా గుర్తొచ్చే చిట్కా ఉదయాన్నే “గోరువెచ్చని నీటిలో తేనె” కలుపుకుని తాగడం. బరువు తగ్గాలనుకునే వారు చాలామంది తమ రోజును ఈ హెల్తీ డ్రింక్‌తోనే ప్రారంభిస్తారు. అయితే.. నిజంగా ఈ నీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా లేక ఇదొక అపోహ మాత్రమేనా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. గోరువెచ్చని నీరు, తేనె కాంబో శరీరంలో ఎలా పనిచేస్తుంది? ఇది కొవ్వును కరిగించడంలో ఎలా సహాయపడుతుందో ఇప్పుడు క్లియర్‌గా చూద్దాం!

1. జీర్ణక్రియ పెరుగుతుంది:
ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మన శరీరంలోని జీర్ణ వ్యవస్థ యాక్టివ్‌గా మారుతుంది. గోరువెచ్చని నీరు మెటబాలిక్ రేట్‌ను పెంచుతుంది. మెటబాలిజం వేగవంతం అయినప్పుడు శరీరం క్యాలరీలను చాలా త్వరగా కరిగిస్తుంది. దీని వల్ల బరువు తగ్గ ప్రక్రియ సులువవుతుంది.

Advertisement

2. నాచురల్ డీటాక్స్ :
రాత్రంతా మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, టాక్సిన్లను బయటకు పంపడంలో గోరు వెచ్చని నీరు , తేనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. తేనెలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు యాంటీబాక్టీరియల్ గుణాలు కాలేయం సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి. శరీరం డీటాక్స్ అవ్వడం వల్ల పొట్ట తగ్గడం ప్రారంభమవుతుంది.

3. తీపి తినాలనే కోరిక తగ్గుతుంది :
బరువు తగ్గే ప్రయాణంలో అతిపెద్ద శత్రువు జంక్ ఫుడ్ , తీపి పదార్థాలు తినాలనే కోరిక . తేనెలో సహజమైన ప్రాసెస్ చేయని చక్రెర ఉంటుంది. ఉదయాన్నే తేనె నీటిని తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఎనర్జీ లభించడమే కాకుండా.. రోజుమొత్తంలో అనవసరమైన స్వీట్లు లేదా జంక్ ఫుడ్ తినాలనే ధ్యాసను తగ్గించి క్యాలరీలను నియంత్రిస్తుంది.

Advertisement

4. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
తేనెలో ఎన్జైమ్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి పొట్టలోని మంచి బాక్టీరియా పెరుగుదలకు దోహదపడతాయి. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి గోరువెచ్చని తేనె నీరు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. పొట్ట శుభ్రంగా ఉంటే బరువు చాలా వేగంగా తగ్గుతారు.

5. ఎలా వాడాలి?
సరైన పద్ధతి: ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ స్వచ్ఛమైన తేనె కలుపుకోవాలి. కావాలనుకుంటే ఇందులో కొన్ని చుక్కల నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

ముఖ్య గమనిక: నీళ్లు ఎప్పుడూ గోరు వెచ్చగా మాత్రమే ఉండాలి. బాగా మరుగుతున్న వేడి నీటిలో తేనె కలిపితే దానిలోని పోషకాలు నశిస్తాయి.

అసలు నిజం ఏంటి?
కేవలం తేనె నీళ్లు తాగినంత మాత్రాన క్షణాల్లో బరువు తగ్గిపోరు. కానీ, మీ రోజువారీ ఆహారంలో సరైన సమతుల్య ఆహారంతీసుకుంటూ, రోజూ కాసేపు వ్యాయామం చేస్తూ ఈ డ్రింక్‌ను ఉదయాన్నే తాగుతుంటే.. మీ బరువు తగ్గే ప్రయాణం చాలా వేగవంతం అవుతుంది.

గోరువెచ్చని నీరు, తేనె కాంబో మీ శరీరాన్ని రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా బరువు తగ్గడానికి ఒక ఫాస్ట్ బూస్టర్‌లా పని చేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ నాచురల్ హ్యాక్‌ను మీ డైలీ రొటీన్‌లో చేర్చుకుని ఫిట్‌గా మారండి.

Related News

మనం ఎంతో ఇష్టంగా తినే ఈ ఆహార పదార్థాలు.. ఆ దేశాల్లో కంప్లీట్ బ్యాన్, ఎందుకో తెలుసా?

హెల్తీ ఫుడ్ తింటున్నా గ్యాస్, ఎసిడిటీ వస్తోందా? మీ అలవాట్లను ఇలా మార్చుకోండి!

వర్షంలో తడుస్తున్నారా? జాగ్రత్త!

95 శాతం తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తారు.. పిల్లలు మాట వినకపోవడానికి అవే కారణం

క్షణాల్లో టెన్షన్ తగ్గించేస్తారు.. ఈ తేదీల్లో పుట్టినవారు అందరినీ నవ్విస్తూ ఉంటారు?

వడలకు మధ్యలో రంధ్రం ఎందుకు? సీక్రెట్ తెలిస్తే షాక్ కావాల్సిందే

60 ఏళ్లు రాకముందే వృద్ధాప్య ఛాయలు? మీ శరీరాన్ని బలహీనం చేసే 3 అలవాట్లు ఇవే

Big Stories

Advertisement
×