E-Paper
Advertisement

స్టైలిష్ సిల్వర్ స్ట్రాప్‌తో అద్భుతమైన గాడ్జెట్.. ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్ వాచ్ రివ్యూ!

స్టైలిష్ సిల్వర్ స్ట్రాప్‌తో అద్భుతమైన గాడ్జెట్.. ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్ వాచ్ రివ్యూ!
Advertisement

Fire-Boltt Talk smartwatch: ప్రస్తుత ట్రెండ్‌లో స్మార్ట్ వాచ్ లేని యూత్ లేరంటే అతిశయోక్తి కాదు! చేతికి ప్రీమియం లగ్జరీ లుక్ ఇస్తూనే, ప్రతి నిమిషం హెల్త్ డీటెయిల్స్‌ని పర్ఫెక్ట్‌గా ట్రాక్ చేసే.. స్మార్ట్ గ్యాడ్జెట్‌లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో.. రాయల్ మెటాలిక్ డిజైన్ , బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ కోరుకునే వారికి ‘ఫైర్-బోల్ట్’ బ్రాండ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కేవలం రూ. 1,099 ధరకే ట్రెండ్ సృష్టిస్తున్న ‘Fire-Boltt Talk’ స్మార్ట్ వాచ్ అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగి ఉండే ఈ మోడల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ గా నిలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

1. మెటాలిక్ బాడీ,లగ్జరీ డిజైన్:

ఈ స్మార్ట్ వాచ్ మెయిన్ హైలైట్ దీని ప్రీమియం మెటల్ బాడీ , సిల్వర్ కలర్ స్ట్రాప్. సాధారణ ప్లాస్టిక్ వాచ్‌లతో పోలిస్తే.. ఇది చేతికి ఎంతో క్లాసీగా, రిచ్ లుక్‌ను ఇస్తుంది. అఫీషియల్ మీటింగ్స్ అయినా.. క్యాజువల్ పార్టీలైనా ఈ సిల్వర్ స్ట్రాప్ డిజైన్ అన్ని రకాల బట్టలకు పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. 35.3 మిమీ (1.39ఇంచుల) డిస్‌ప్లే ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

2. బ్లూటూత్ కాలింగ్, స్మార్ట్ నోటిఫికేషన్స్:

Advertisement

ఈ ప్రైస్ రేంజ్‌లో.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఉండటం నిజంగా బెస్ట్ అని చెప్పొచ్చు. వాచ్‌లోనే బిల్ట్-ఇన్ మైక్ , స్పీకర్ ఉండటం వల్ల ఫోన్ తీయకుండానే నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు. అంతే కాకుండా రిసీవ్ చేసుకోవచ్చు. క్విక్ డయల్ ప్యాడ్, రీసెంట్ కాల్స్ , కాంటాక్ట్స్ సింక్ చేసుకునే అవకాశం కూడా ఇందులో ఉంటుంది. అంతేకాకుండా.. వాట్సాప్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ మెసేజ్‌లు, సోషల్ మీడియా అలర్ట్స్ అన్నీ రిస్ట్ పైనే ఈజీగా చెక్ చేసుకోవచ్చు.

3. హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్:

హెల్త్ గురించి ఎక్కువగా ఆలోచించే వారికి ఈ వాచ్ ఒక అద్భుతమైన కంపానియన్. ఇందులో.. రియల్-టైమ్ హార్ట్ రేట్ మానిటర్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ వంటి వివిధ రకాల స్పోర్ట్స్ మోడ్స్‌ను ఇది కచ్చితంగా ట్రాక్ చేస్తుంది. మన శరీరం ఫిట్‌నెస్ లెవెల్స్‌ను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయడానికి ఈ సెన్సార్లు ఎంతగానో సహాయ పడతాయి.

4. వాటర్ రెసిస్టెన్స్, బ్యాటరీ బ్యాకప్:

Advertisement

వాడేటప్పుడు చెమట పట్టినా లేదా చిన్నపాటి వర్షంలో.. తడిచినా ఈ వాచ్‌ పాడవదు . ఎందుకంటే ఇది వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌తో వస్తుంది. అలాగే పవర్ ఫుల్ బ్యాటరీ బ్యాకప్ కారణంగా ఒక సారి ఛార్జ్ చేస్తే.. కొన్ని రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుంది. మాగ్నెటిక్ ఛార్జింగ్ అవకాశం కూడా దీనిలో ఉండటం వల్ల త్వరగా ఛార్జ్ అవుతుంది.

Also Read: ఇన్-బిల్ట్ హీటర్ వాషింగ్ మెషీన్స్..ఎలాంటి మరకలైనా మాయం!

5. అద్భుతమైన ధర:

మార్కెట్లో అనేక ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ.. ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్ వాచ్ అమెజాన్ , ఇతర ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో.. కేవలం రూ.1,099 ధరకే లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్, స్టైలిష్ లుక్ ఉన్న స్మార్ట్ వాచ్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

గమనిక:
అతి తక్కువ ధరలో ప్రీమియం మెటల్ లుక్, బ్లూటూత్ కాలింగ్ , హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు కోరుకునే.. వారికి ఫైర్-బోల్ట్ టాక్ స్మార్ట్ వాచ్ ఒక పర్ఫెక్ట్ ఆప్షన్. కొనే ముందు ఆన్‌లైన్ స్టోర్స్‌లో లభించే.. బ్యాంక్ డిస్కౌంట్లు లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను గమనించడం మంచిది. ఈ-కామర్స్ సేల్స్‌ను బట్టి ధరలలో మార్పులు ఉండే అవకాశం ఉంది.

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×