Allari Naresh: సాధారణంగా అందరూ అనుకునేది ఏమిటంటే.. ఒక ప్రాజెక్టు పట్టాలెక్కాలి అంటే దర్శకుడు, నిర్మాత ఓకే చేస్తే చాలు అనుకుంటారు. కానీ నిజానికి ఒక సినిమా తెరకెక్కాలి అంటే ముందుగా ఒక పెద్ద నిర్మాణ సంస్థల్లో.. కథను నిర్మాత, మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, క్రియేటివ్ బృందం.. ఇలా సంస్థకు సంబంధించిన ఎంతోమంది కీలక వ్యక్తులు.. ఆ కథను విని, దానిపై చర్చించిన తర్వాత ఓకే అయితేనే ఆ సినిమా పట్టాలెక్కుతుంది. ముఖ్యంగా ఒక దర్శకుడు సినిమా కథను ఒప్పించుకోవాలి అంటే.. ఇంతమంది మెచ్చితేనే ఆ సినిమా తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna studios) గురించి, స్టూడియోలో ఒక సినిమా పట్టాలెక్కాలంటే ఎంత మంది మెచ్చాలి అనే విషయంపై అల్లరి నరేష్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
విషయంలోకి వెళ్తే.. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణ భాగస్వామ్యంలో సెప్టెంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘రంభ ఊర్వశి మేనక’.. అల్లరి నరేష్ మళ్లీ తన పాత జోనర్ ను నమ్ముకుని.. కామెడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విడుదల తేదీకి కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో వరుస ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటున్న అల్లరి నరేష్ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో తన సినిమా కథ ఓకే అవ్వడానికి జరిగిన ప్రాసెస్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రమోషన్స్ లో భాగంగా అల్లరి నరేష్ మాట్లాడుతూ..” రంభ ఊర్వశి మేనక చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించడం ఒక సాధారణ విషయం కాదు. డైరెక్టర్ చంద్రమోహన్ రాసుకున్న కథను మొదట అన్నపూర్ణ స్టూడియోలో నిమ్మకాయల ప్రసాద్, నాగార్జున, నాగచైతన్య, సుప్రియకు వినిపించి, వారు ఒప్పుకున్న తర్వాతే ఈ సినిమా ఓకే అయింది . ముఖ్యంగా ఒక కొత్త దర్శకుడు తన కథను ఇంతమంది కీలక వ్యక్తులకు వివరించి , ప్రతి ఒక్కరిని ఒప్పించగలిగితేనే.. ఆ సినిమా సెట్ పైకి వెళ్తుంది. ఒక కొత్త దర్శకుడు ఇదంతా చేసి సినిమాను సెట్ పైకి తీసుకెళ్లడం అనేది ఒక చిన్న విషయం కాదు. ఈ విషయంలోనే మా సినిమా డైరెక్టర్ చంద్రమోహన్ సక్సెస్ అయ్యారు” అంటూ చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.
also read: రామాయణంలోకి అమీర్ ఖాన్ కూతురు.. ఆ 5 నిమిషాలే కీలకమట!
ఇకపోతే అల్లరి నరేష్ చెప్పిన మాటలను బట్టి చూస్తే అన్నపూర్ణ స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థల్లో సినిమా చేయాలనుకునే కొత్త దర్శకుల వద్ద కేవలం మంచి కథ ఉంటే సరిపోదు.. ఇలా సంస్థలోని కీలక వ్యక్తుల ఆమోదం చాలా ముఖ్యమైన విషయం అని స్పష్టం అవుతుంది. ఇకపోతే అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మరోవైపు పళ్ళ బురుసు సినిమా ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ..” కొత్త దర్శకులు.. కొత్త కథలతో ముందుకొస్తే తమ సంస్థ ద్వారా సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నామనే” మాటలు మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి. నాగార్జున అలా చెప్పడం.. ఇప్పుడు అల్లరి నరేష్ ఇలా చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.