E-Paper
Advertisement

Gmail Frauds : జీమెయిల్ వాడుతున్నారా.. త్వరలోనే సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ రావొచ్చు.. జాగ్రత్త!

Gmail Frauds : జీమెయిల్ వాడుతున్నారా.. త్వరలోనే సైబర్ నేరగాళ్ల నుంచి కాల్ రావొచ్చు.. జాగ్రత్త!
Advertisement

Gmail Frauds : ఏ చిన్న అవకాశం దొరికినా ఫైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఎన్నో స్కామ్స్ చేసి కోట్లు కొల్లగొట్టిన ఈ నేరగాళ్లు… గిఫ్ట్స్, ప్రైజ్ మనీ పేర్లతో ఎన్నో స్కామ్స్ కు పాల్పడ్డారు. టెలికాం సంస్థలతో పాటు స్మార్ట్ ఫోన్ లను ఉపయోగించుకొని నేరాలకు పాల్పడిన సైబర్ నేరగాళ్లు.. తాజాగా మరో కొత్త ఎత్తు గడకు తెర తీశారు. జీ మెయిల్ వాడే యూజర్సే లక్ష్యంగా ఫేక్ అకౌంట్ రికవరీ లింక్స్ పంపించి ఫోన్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నాలు జరిపారు. ఈ విషయాన్ని తాజాగా ఐటీ కస్సల్టెంట్, టెక్ బ్లాగర్ సామ్ మిట్రో విక్ తన బ్లాగ్ లో వెల్లడించారు.

జీ మెయిల్ వాడే కస్టమర్లే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయే ప్రయత్నం చేశారు. ఫేక్ అకౌంట్ రికవరీ పేరు తో నేరాలకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నారు. ఫేక్ ఎకౌంట్ రికవరీ పేరుతో లింక్స్ పంపించి వాటిని కస్టమర్లు చేత అప్రూవల్ చేయించి ఫోన్ తో పాటు జీమెయిల్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయాన్ని ఐటి కన్సల్టెంట్ సామ్ మిట్రో విక్ తన బ్లాగులో వివరించారు. ఈ అనుభవం స్వయంగా తనకే ఎదురైందని.. ప్రతీ ఒక్కరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలని చెబుతూ బ్లాగ్ లో రాసుకొచ్చారు.

Advertisement

ALSO READ : ఆపిల్ దూకుడు..త్వరలోనే కెమెరాతో రాబోతున్న స్మార్ట్ గ్లాసెస్

జీ మెయిల్ ను స్కామ్ చేసే ఆలోచనలో సైబర్ నేరగాళ్లు వేసే ప్లాన్స్ సైతం కళ్లకు కట్టినట్లు తెలిపారు. సైబర్ నెరగాళ్లు ఫోన్ కు ఒక లింకును పంపిస్తారని.. ఈ లింకు వేరే దేశం నుంచి వచ్చి ఉంటుందని తెలిపారు. తనకు ఆ లింక్ అమెరికా నుంచి వచ్చిందని చెప్పిన సామ్ మిట్రో.. ఒకవేళ ఆ లింకును కస్టమర్ రిజక్ట్ చేస్తే మరో ప్లాన్ తో ముందుకు వస్తారని తెలిపారు.

Advertisement

లింక్ ను రిజెక్ట్ చేసిన వెంటనే ఒక ఫోన్ కాల్ వస్తుందని… అవతలి వ్యక్తి ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ జీ మెయిల్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్మామని చెబుతారని తెలిపారు. ఇక మీ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసేందుకు వేరే దేశం నుంచి ప్రయత్నించారని.. ఒక వేళ ఆ లింకును మీరు యాక్సెప్ట్ చేసి ఉంటే ప్రమాదంలో పడే వారిని హెచ్చరిస్తారని తెలిపారు. అనంతరం వేరొక లింకును పంపించి ఈ లింకును మాత్రమే యాక్టివేట్ చేస్తే మీకు ఎలాంటి ప్రమాదం ఉండదని.. ఇక మీ జీ మెయిల్ పూర్తిగా సురక్షితంగా ఉంటుందని వారు మనల్ని నమ్మించి ఆ లింకును ఓపెన్ చేయించి ఫోన్ హ్యాక్ చేస్తారని హెచ్చరించారు. అందుకే ఇలాంటి విషయంలో ప్రతీ ఒక్కరికీ పూర్తి అప్రమత్తత ఉండాలని తెలిపారు.

ఎలా తప్పించుకోవాలంటే..

ఫేక్ నెంబర్స్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకూడదు

జీ మెయిల్ కంపెనీ స్వయంగా ఎవరికీ కాల్ చేయదనే విషయాన్ని గుర్తించాలి

అకౌంట్ ను మీరు రికావరీ చేయకుండానే మెసేజ్ వస్తే అనుమానించాల్సిందే

కొత్తగా వచ్చిన లింక్స్ ను ఓపెన్ చేయటానికి ముందే చెక్ చేసుకోవటం మంచిది

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×