E-Paper
Advertisement

Godrej 1 Ton 5 Star Inverter AC Review సమ్మర్ హీట్‌కి చెక్ పెట్టండి! కేవలం ₹1000 EMIతో మీ ఇంటికి 5-స్టార్ ఏసీ..

Godrej 1 Ton 5 Star Inverter AC Review సమ్మర్ హీట్‌కి చెక్ పెట్టండి! కేవలం ₹1000 EMIతో మీ ఇంటికి 5-స్టార్ ఏసీ..
Advertisement

Godrej 1 Ton 5 Star Inverter AC Review: ఇప్పుడు ఇళ్లల్లో ఏసీ ఉండటం అనేది లగ్జరీ కాదు, అదొక బేసిక్ నీడ్ (Need) అయిపోయింది. కానీ, ఒకేసారి ₹30 వేలు లేదా ₹40 వేలు ఖర్చు చేయాలంటే ఎవరికైనా ‘గుండె గుభేల్’ అంటుంది. అందుకే, స్మార్ట్‌గా ఆలోచించే వారి కోసం అమెజాన్ ఒక క్రేజీ ఆఫర్ తెచ్చింది. గోద్రెజ్ (Godrej) 1 టన్ 5-స్టార్ ఇన్వర్టర్ ఏసీ ఇప్పుడు కేవలం నెలకు ₹1,000 EMIతో మీ సొంతం చేసుకోవచ్చు. దీని ఫీచర్స్ వింటే మీరు ఫిదా అవ్వడం గ్యారెంటీ!

 AI పవర్డ్ కూలింగ్.. మీ కంఫర్ట్ లెవల్ వేరే లెవల్!

ఈ ఏసీలో ఉన్న అతిపెద్ద హైలైట్ ఏంటంటే.. 5-ఇన్-1 కన్వర్టబుల్ కూలింగ్ మరియు ఇన్వర్టర్ టెక్నాలజీ. గదిలో ఎంత మంది ఉన్నారు, వేడి ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఇది ఆటోమేటిక్‌గా కూలింగ్ పవర్‌ను అడ్జెస్ట్ చేస్తుంది. దీనికి తోడు, ఇందులో AI పవర్డ్ ‘ఐసెన్స్’ (iSense) టెక్నాలజీ ఉంది. అంటే మీ చుట్టుపక్కల టెంపరేచర్‌ను సెన్సార్లు గుర్తించి, మీరు పదే పదే రిమోట్ నొక్కాల్సిన అవసరం లేకుండానే కూలింగ్‌ను సెట్ చేస్తాయి. ఇది కదా అసలైన ‘స్మార్ట్’ లివింగ్!

Advertisement

also read: Washing Machine: వాషింగ్ మెషీన్‌లో భారీ దుప్పట్లు ఉతుకుతున్నారా? ఈ తప్పులు చేస్తే మీ మెషీన్ ‘డెడ్’ అవ్వడం ఖాయం!

 5-స్టార్ రేటింగ్.. కరెంటు బిల్లుకు ‘నో’ టెన్షన్!

ఏసీ వేస్తే కరెంటు బిల్లు మోత మోగుతుందని చాలామంది భయపడతారు. అయితే, ఈ గోద్రెజ్ ఏసీకి 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉంది. ఏడాదికి కేవలం 516.37 kWh విద్యుత్ మాత్రమే వాడుతుందని అంచనా. అంతేకాకుండా, ఇందులో 100% కాపర్ కండెన్సర్ మరియు బ్లూ ఫిన్ యాంటీ కొరిజన్ కోటింగ్ ఉండటం వల్ల తుప్పు పట్టే ఛాన్స్ లేదు. మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే.. ఇందులో ‘సెల్ఫ్ క్లీనింగ్’ ఆప్షన్ ఉంది. ఇది గాలిలోని సూక్ష్మజీవులను నిరోధించి మీకు ఎప్పుడూ స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది.

 52°C ఎండలో కూడా ‘కాశ్మీర్’ కూలింగ్!

Advertisement

బయట ఎండలు 50 డిగ్రీలు దాటినా ఈ ఏసీ అస్సలు తగ్గదు. ఇది 52°C టెంపరేచర్‌ను కూడా ఈజీగా హ్యాండిల్ చేస్తుంది. దీనివల్ల, మండు వేసవిలో కూడా మీ బెడ్‌రూమ్ కాశ్మీర్‌లా మారిపోతుంది. పైగా, కంపెనీ దీనిపై 5 ఏళ్ల కాంప్రహెన్సీవ్ వారెంటీ మరియు కంప్రెషర్‌కు ఏకంగా 10 ఏళ్ల వారెంటీ ఇస్తోంది. అంటే ఒకసారి కొంటే దశాబ్దం వరకు మీకు టెన్షన్ ఉండదన్న మాట.

 ఆఫర్ ధర ఎంతంటే?

ఈ ఏసీ అసలు ధర ₹48,900 కాగా, అమెజాన్ డిస్కౌంట్‌తో కేవలం ₹30,490 కే లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్స్ వాడితే ఈ ధర ఇంకా తగ్గుతుంది. ముఖ్యంగా, బడ్జెట్ ఇబ్బంది ఉన్నవారికి ₹1,072 నుండి EMI ఆప్షన్స్ మొదలవుతున్నాయి. నో-కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. ఇక  ప్యాకేజీలో ఇండోర్, ఔట్‌డోర్ యూనిట్లతో పాటు కాపర్ పైపులు, కేబుల్స్ అన్నీ వాళ్లే ఇస్తారండోయ్ .కస్టమర్ రివ్యూస్ ప్రకారం దీని కూలింగ్ అదిరిపోతుందని సమాచారం. నాయిస్ లెవల్స్ విషయంలో మిక్స్‌డ్ రివ్యూస్ ఉన్నప్పటికీ, ₹1000 బడ్జెట్‌లో ఒక 5-స్టార్ బ్రాండెడ్ ఏసీ రావడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ సమ్మర్‌లో మీరు కూల్‌గా ఉండాలంటే.. సో ..ఇప్పుడే ఈ డీల్‌ని గ్రాబ్ చేసుకోండి!

also read:Kent Emerald: గ్యాస్ స్టవ్‌కు గుడ్‌బై? ఈ ఇండక్షన్ స్టవ్ కొత్త ట్రెండ్!

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×