E-Paper
Advertisement

క్రోమా ఫ్లాష్ సేల్ ధమాకా.. గూగుల్ పిక్సెల్ 10 మెుబైల్‌పై.. ఏకంగా రూ.14,091 తగ్గింపు!

క్రోమా ఫ్లాష్ సేల్ ధమాకా.. గూగుల్ పిక్సెల్ 10 మెుబైల్‌పై.. ఏకంగా రూ.14,091 తగ్గింపు!
Advertisement

Google Pixel 10: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ రిటైల్ దిగ్గజం క్రోమా (Croma) తమ ఫ్లాష్ సేల్‌లో కళ్లుచెదిరే ఆఫర్ ప్రకటించింది. గూగుల్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 10 5జీ (Google Pixel  10 5G)పై భారీ డిస్కౌంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ. 79,999 లాంచ్ ధర కలిగిన ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ ను.. బ్యాంక్ ఆఫర్లు, ఇన్‌స్టంట్ డిస్కౌంట్లతో కలిపి ఇప్పుడు ఏకంగా రూ. 65,908లకే సొంతం చేసుకునే గోల్డెన్ ఛాన్స్ ను క్రోమా కల్పిస్తోంది. ఆఫర్ వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

వివరాల్లోకి వెళ్తే..

క్రోమా ఫ్లాష్ సేల్ లో భాగంగా పలు రకాల ఆఫర్లను ప్రకటించింది. గూగుల్ పిక్సెల్ 10 5G (12GB ర్యామ్ + 256GB స్టోరేజ్) వేరియంట్ అసలు ధర రూ.79,999 కాగా దీనిపై తక్షణ రూ.5000 డిస్కౌంట్ ను క్రోమా ప్రకటించింది. దీంతో రూ.74,999కే ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇది కాకుండా.. మిడ్ నైట్ డీల్స్ డిస్కౌంట్ కింద 4.5 శాతం (రూ.3,375), రిటైలర్ ఆఫర్ కింద 1 శాతం తగ్గింపు, HDFC క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేస్తే మరో రూ.5000 డిస్కౌంట్ ను క్రోమా అందిస్తోంది. ఇవన్నీ గరిష్టంగా వర్తిస్తే ఫోన్ పై ఏకంగా రూ.14,091 రాయితీని యూజర్ పొందొచ్చని క్రోమా వర్గాలు తెలిపాయి. అంటే రూ. 65,908కే ఫోన్ ను తగ్గించుకోవచ్చని పేర్కొన్నాయి.

ఫీచర్ల సంగతేంటి?

Advertisement

గూగుల్ పిక్సెల్ 10 5G ప్రత్యేకతలకు వస్తే.. ఇది గూగుల్ డిజైన్ చేసిన టెన్సర్ జీ5 (Tensor G5) చిప్‌సెట్‌తో రన్ అవుతుంది. ప్రీవియస్ మోడల్ కంటే 60% ఫాస్ట్ గా ఇది పనిచేయనుంది. మరోవైపు ఈ గూగుల్ ఫోన్ కు 6.3 అంగుళాల అద్భుతమైన Actua డిస్ ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ ను ఇది కలిగి ఉంది. ఫలితంగా ఎండలోనూ మెుబైల్ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుందని గూగుల్ వర్గాలు తెలిపాయి.

నాణ్యమైన కెమెరా సెటప్

నాణ్యమైన కెమెరాలకు కేరాఫ్ గా గూగుల్ ఫోన్లు నిలుస్తుంటాయి. ఈ ఫోన్ ను సైతం క్వాలిటీ కెమెరా ఫీచర్లతో గూగుల్ తీసుకొచ్చింది. 48 MP మెయిన్ సెన్సార్‌తో కూడిన అడ్వాన్స్‌డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 20x సూపర్ రెస్ జూమ్ ఫీచర్ ను దీనికి అందించారు. రాత్రి వేళల్లో కూడా అద్భుతమైన ఫోటోలను ఇది క్యాప్చర్ చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

Advertisement

Also Read: ఎయిర్‌టెల్ ఫన్ ప్లాన్.. నెట్ ఫ్లిక్స్, యాపిల్ టీవీ, హాట్‌స్టార్ ఫ్రీ.. 3.3TB డేటాతో మీ ఇష్టం!

బ్యాటరీ పరంగా చూస్తే..

గూగుల్ పిక్సెల్ 10 5G మెుబైల్ ను 4970mAh బ్యాటరీతో తీసుకొచ్చారు. దీనికి పిక్సెల్‌స్నాప్ మాగ్నెటిక్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ను అందించారు. అలాగే ఫోన్ సేఫ్టీ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్, IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్లను అందించారు. ఇవి కాకుండా 4K వీడియో రికార్డింగ్ తో పాటు వై-ఫై 6E, బ్లూటూత్ 6.0 కనెక్టివిటీని సైతం అందించారు. ఇది కాకుండా ఈ ఫోన్ పై ఏడేళ్ల పాటు సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ అప్‌డేట్స్ ను గూగుల్ ఆఫర్ చేస్తోంది.

Also Read: జియో సూపర్ హిట్ ప్లాన్.. అపరిమిత 5G, ఉచిత ఓటీటీ, ఫ్రీ కాల్స్.. ఇంకా ఎన్నో బెనిఫిట్స్!

Related News

యాపిల్ నుంచి మొదటి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo.. ధర రూ.3 లక్షలా? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే!

లాగ్ ప్రాబ్లం ఉండదు.. సూపర్‌ఫాస్ట్ రెస్పాన్స్ ఇచ్చే బెస్ట్ వైర్‌లెస్ కీబోర్డ్ కాంబోస్ ఇవే!

ఫోన్ మార్చాలనుకుంటున్నారా? ఫ్లిప్‌కార్ట్‌లో భారీగా ధర తగ్గిన Vivo V40e 5Gపై ఓ లుక్కేయండి!

బడ్జెట్ ధరలో సోనీ కొత్త హెడ్‌ఫోన్స్ లాంచ్.. బ్లూటూత్ 6.0, ఏఐ కాల్స్ ప్రత్యేకత!

నుదుటిపై ఈ డివైజ్‌ను పెట్టుకుంటే చాలు.. బ్రెయిన్ సీక్రెట్స్ అన్నీ బయటపడతాయట?!

ఏటీఎం కీప్యాడ్ ప్లాస్టిక్‌లో కాకుండా.. మెటల్‌‌ లోనే ఎందుకు? దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి?

రూ. 349 vs రూ. 379.. Airtel చౌకైన ప్లాన్ల మధ్య పోటీ.. బెనిఫిట్స్ పరంగా విజేత ఎవరంటే?

జియో బంపరాఫర్.. ఈ ప్లాన్లతో అమెజాన్ ప్రైమ్ ఉచితం.. ఇంకా మరెన్నో బెనిఫిట్స్!

Big Stories

Advertisement
×