Pixel 11 Price Hike: పిక్సెల్ లవర్స్‌కు గూగుల్ ఊహించని షాక్ ఇచ్చేలా కనిపిస్తోంది. వచ్చే నెలలో జరగబోయే Made by Google ఈవెంట్‌లో రాబోతున్న Pixel 11 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా పెరిగే అవకాశముంది. మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న RAM విడిభాగాల కొరతే దీనికి ప్రధాన కారణమని సమాచారం. ఈ సిరీస్‌లో Pixel 11, Pixel 11 Pro, Pixe 11 Pro XL, Pixel 11 Pro Fold మోడళ్లు విడుదల కానున్నాయి.
ఈ ధరల పెంపు కేవలం గూగుల్‌కే పరిమితం కాదని, మార్కెట్‌లోని మిగతా టెక్ కంపెనీలపై కూడా దీని ప్రభావం పడుతోందని గూగుల్ డివైజెస్ అండ్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ షకీల్ బర్కత్ తెలిపారు. విడిభాగాల సరఫరాలో వస్తున్న సమస్యల వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని, త్వరలో జరగబోయే Pixel 11 సిరీస్ లాంచ్‌లపై ఇది స్పష్టంగా కనిపిస్తుందని ఆయన ఒక ప్రముఖ టెక్ పత్రికతో మాట్లాడుతూ వెల్లడించారు.
Also Read: రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!
మార్కెట్ రీసెర్చ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ గణాంకాల ప్రకారం.. ర్యామ్ ధరలు ఆకాశాన్నంటాయి. గతంలో ఒక GB RAM తయారీకి 2.8 రూ.270 ఖర్చయితే.. ప్రస్తుతం అది ఏకంగా రూ.1,155 చేరింది. అంటే దాదాపు ఆరు రెట్లు పెరిగింది. ప్రొడక్షన్ కాస్ట్ ఇంతలా పెరగడంతో మొబైల్ కంపెనీలు వినియోగదారులపై ఆ భారాన్ని వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.
విపరీతంగా పెరిగిన ఈ ఖర్చులను తట్టుకోవడానికి గూగుల్ తమ మొత్తం పిక్సెల్ ఉత్పత్తుల ధరల విధానాన్ని మార్చే ఆలోచనలో ఉంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రాబోయే Pixel 11 మోడళ్లతో పాటు, ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న Pixel 10 సిరీస్, ఇతర మోడళ్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని సమాచారం. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఇది కాస్త చేదు వార్తనే చెప్పాలి.
Also Read: 7000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. వివో V70 FE 5G పై ఊహించని ప్రైస్ డ్రాప్!