E-Paper
Advertisement

రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!

రహస్యంగా ఫొటోలు తీయడం కుదరదు.. Apple Smart Glassesలో ఊహించని ట్విస్ట్!
Advertisement

Apple Smart Glasses: ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తమ మొదటి స్మార్ట్ గ్లాసెస్ ఆవిష్కరణను 2027 జూన్‌లో జరగబోయే డబ్ల్యూడబ్ల్యూడీసీ (WWDC) ఈవెంట్‌కు వాయిదా వేసింది. నిజానికి ఈ డివైజ్ కాస్త త్వరగానే మార్కెట్లోకి రావాల్సి ఉంది. కానీ, దాన్ని ఉపయోగించే కస్టమర్ల ప్రైవసీని మరింత బలోపేతం చేయడంతో పాటు డెవలపర్లకు యాప్స్ డిజైన్ చేయడానికి తగిన సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రైవసీకి పెద్దపీట..

ఈ మధ్యకాలంలో కెమెరాతో వచ్చే ధరించే డివైజెస్ (వేరబుల్స్) వల్ల ఇతరుల ప్రైవసీకి భంగం కలుగుతోందనే ఆందోళనలు బాగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా రెస్టారెంట్లు, ఆఫీసులు, పబ్లిక్ ప్రదేశాల్లో ఇతరులకు తెలియకుండా రికార్డ్ చేయడంపై చాలామంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అందుకే యాపిల్ తమ యూజర్ల భద్రతకు, ఇతరుల ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ సరికొత్త హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్ ఫీచర్లను సిద్ధం చేస్తోంది.

Advertisement

Also Read: 7000mAh బ్యాటరీ, 200MP కెమెరా.. వివో V70 FE 5G పై ఊహించని ప్రైస్ డ్రాప్!

కెమెరా డిజైన్లపై ప్రయోగాలు..

ఈ స్మార్ట్ గ్లాసెస్ రూపకల్పనలో యాపిల్ రకరకాల కెమెరా మోడళ్లను పరిశీలిస్తోంది. అసలు కెమెరానే లేని డివైజ్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా చేసింది. మరొక ఆలోచన ఏంటంటే.. కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కోసం పరిసరాలను అర్థం చేసుకోవడానికి మాత్రమే కెమెరా పనిచేస్తుంది, కానీ ఫొటోలు, వీడియోలు తీయడానికి కుదరదు. అయితే, యూజర్లకు ఫొటోలు తీసే సౌకర్యం ఉండాలనే ఉద్దేశంతో సాధారణ కెమెరాలతోనే, మరిన్ని కఠినమైన ప్రైవసీ నిబంధనలతో వీటిని తెచ్చేందుకు ఎక్కువ మొగ్గు చూపుతోంది.

మెటాతో పోటీ..

Advertisement

మార్కెట్లో ఇప్పటికే ఉన్న మెటా స్మార్ట్ గ్లాసెస్‌కు గట్టిపోటీ ఇవ్వాలని యాపిల్ భావిస్తోంది. అయితే మెటా డివైజెస్ విషయంలో ఉన్న ప్రైవసీ భయాలు తమ ఉత్పత్తులకు రాకుండా జాగ్రత్త పడుతోంది. అందుకే యూజర్ల డేటాను ఏఐ ట్రైనింగ్ కోసం వాడకపోవడం, ఫేషియల్ రికగ్నిషన్ లేకుండా చూసుకోవడం లాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అలాగే ఫోన్ల సహాయం లేకుండానే నేరుగా పాటలు వినడానికి, మాట్లాడటానికి, Siri వాడటానికి వీలుగా ఇందులో స్పీకర్లు, మైక్రోఫోన్లు కూడా ఇస్తున్నారు.

2027లోనే ఎందుకు?

యాపిల్ కంపెనీ 2027 వ సంవత్సరాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఐఫోన్ వచ్చి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక ఐఫోన్ మోడల్స్, మడతపెట్టే ఐఫోన్, కొత్త ఎయిర్‌పాడ్స్, స్మార్ట్ హోమ్ డివైజెస్‌లతో పాటు ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను కూడా అదే ఏడాది చివర్లో మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

Also Read: ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో Vivo X300e.. పిచ్చెక్కించే లీక్డ్ ఫీచర్లు ఇవే!

Related News

Vi ధమాకా ఆఫర్లు.. రూ.599, రూ. 899 కొత్త ప్లాన్లు వచ్చేశాయ్.. రోజుకి రూ.10తో అపరిమిత బెనిఫిట్స్!

రూ.630కే పోర్టబుల్ జ్యూసర్! క్షణాల్లోనే ఫ్రెష్ జ్యూస్ రెడీ

రూ.699కే అదిరిపోయే బేస్,లాంగ్ బ్యాటరీ బ్యాకప్‌తో హెడ్‌ఫోన్స్

రూ.9,990కే..మైక్రోవేవ్ ఓవెన్!బేకింగ్,గ్రిల్లింగ్,ఎయిర్ ఫ్రైయింగ్ అన్నీ ఒకే చోట

తక్కువ నెట్‌తో హై-క్లారిటీ వీడియోస్.. యూట్యూబ్ తీసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఇదే!

రూ. 2,000లకే ఎయిర్ ప్యూరిఫైయర్.. ఐఐటీ బాంబే రీసెర్చర్ అద్భుత ఆవిష్కరణ!

ఒప్పో నుంచి మరో మాస్టర్‌పీస్.. Find X10 సిరీస్ ఫీచర్లు, ధర వివరాలపై ఓ లుక్కేయండి!

అదుర్స్ అనిపించే సౌండ్..డాల్బీ ఆడియోతో అరిపించే మోడల్

Big Stories

Advertisement
×