E-Paper
Advertisement

Haier M80F vs LG G5: తక్కువ ధరలో థియేటర్ అనుభవం కావాలా? ఈ ఏడాది మార్కెట్‌ను షేక్ చేస్తున్న బెస్ట్ టీవీలివే!

Haier M80F vs LG G5: తక్కువ ధరలో థియేటర్ అనుభవం కావాలా? ఈ ఏడాది మార్కెట్‌ను షేక్ చేస్తున్న బెస్ట్ టీవీలివే!
Advertisement

Haier M80F vs LG G5: అసలు ఇప్పుడు టీవీ మార్కెట్‌ చూస్తుంటే మైండ్ పోతోంది. టెక్నాలజీ పరంగా చూసుకుంటే.. ఒకదానితో ఒకటి పోటీపడి మరీ కొత్త ఫీచర్లు తెస్తున్నాయి. ముఖ్యంగా పిక్చర్ క్వాలిటీ విషయంలో అయితే కంపెనీల మధ్య మామూలు యుద్ధం జరగట్లేదు. ఈ నేపథ్యంలో తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే ఫీచర్లు కావాలనుకునే వాళ్లకు హైయర్ M80F మినీ LED బెస్ట్ ఆప్షన్‌లా కనిపిస్తోంది. బడ్జెట్‌తో పనిలేదు.. క్వాలిటీలో తగ్గేదేలే అనుకునే వాళ్లకైతే LG G5 టెన్డం OLED నెక్ట్స్ లెవల్‌ అనే చెప్పాలి.

నిజానికి ఈ రెండు టీవీల్లో ఏది బెస్ట్ అంటే.. అది పూర్తిగా మన అవసరాలను బట్టి ఉంటుంది. ఒకటేమో జేబుకి చిల్లు పడకుండా మినీ LED మ్యాజిక్ చూపిస్తుంటే, ఇంకోటి క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కానంటోంది. ఈ రెండింటి మధ్య ఉన్న అసలు తేడాలేంటో ఒకసారి క్లియర్‌గా తెలుసుకుందాం.

తక్కువ ధరలో మినీ LED మ్యాజిక్..

Advertisement

హైయర్ కంపెనీ ఈ M80F సిరీస్‌తో మినీ LED టెక్నాలజీని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చేసింది. దీనిలో ఉండే మంచి విషయం ఏమిటంటే.. సోలార్ రిమోట్. బ్యాటరీ అయిపోతుందనే టెన్షన్ అసలు ఉండదు. టైప్-C ఛార్జింగ్ వాడుకోవచ్చు లేదా కాసేపు ఎండలో పెడితే చాలు ఛార్జ్ అయిపోతుంది. 55 నుండి 85 అంగుళాల వరకు ఉండే ఈ టీవీ, 800 నిట్స్ బ్రైట్‌నెస్‌తో లభిస్తోంది. అంటే పగలు వెలుతురులో కూడా బొమ్మ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పైగా గూగుల్ టీవీ సాఫ్ట్‌వేర్, డాల్బీ విజన్, 50 వాట్ల స్పీకర్లు.. ఇవన్నీ దీనికి పెద్ద ప్లస్ పాయింట్స్.

Also Read: రూ.20 వేలకే 1200 ANSI బ్రైట్‌నెస్.. గూగుల్ టీవీ సపోర్ట్‌తో బెస్ట్ హోమ్ థియేటర్ ప్రొజెక్టర్ లాంచ్!

విజువల్స్ అదిరిపోవాలంటే ఇదే బెస్ట్..

Advertisement

ఇక LG G5 విషయానికి వస్తే.. దీనిలో ఫోర్ లేయర్ టెన్డం OLED ప్యానెల్‌ వాడారు. ఇది నిజంగా ఒక రికార్డు అని చెప్పాలి. దీనికి 4000 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది. అంటే.. చీకటిగా ఉండే సీన్స్‌లో కూడా విజువల్స్ పీక్స్‌లో కనిపిస్తాయి. సినిమా లవర్స్‌కు అయితే దీనిలోని కలర్స్, మూమెంట్స్ పిచ్చపిచ్చగా నచ్చేస్తాయి. అలాగే గేమర్స్ కోసం నాలుగు HDMI 2.1 పోర్ట్స్ ఇచ్చారు. అయితే, దీనిలో WebOS వాడటం కొంచెం కన్ఫ్యూజింగ్‌గా అనిపించవచ్చు. ఇంకో చిన్న మైనస్ ఏంటంటే.. పిక్చర్ క్వాలిటీ ఉన్న రేంజ్‌లో స్పీకర్లు లేవు. కాబట్టి దీనికి ఒక మంచి సౌండ్‌బార్ తగిలిస్తే చాలు.. ఇంట్లోనే థియేటర్ సెట్ అయిపోతుంది.

ఇతర బ్రాండ్లు సైతం..

కేవలం ఈ రెండే కాదు.. మార్కెట్‌లో సోనీ బ్రావియా 8 II కూడా టాప్‌లో ఉంది. దీని రేటు కొంచెం ఎక్కువే అయినా, మనం సెట్టింగ్స్ మార్చాల్సిన అవసరం లేకుండానే నేచురల్ కలర్స్‌ని చూపిస్తుంది. అటు శాంసంగ్ నియో QLED QN90F కూడా తన బ్రైట్‌నెస్‌తో గట్టి పోటీ ఇస్తోంది. తక్కువ బడ్జెట్‌లో పెద్ద స్క్రీన్, మినీ LED కావాలంటే కళ్లు మూసుకుని హైయర్ M80F తీసుకోవచ్చు. లేదు, మాకు బెస్ట్ డిస్‌ప్లే, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం LG G5ని మించింది లేదు.

Also Read: స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ తేడాలు తెలియకపోతే మీ డబ్బు వృథానే!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×