E-Paper
Advertisement

Nick Jonas: వారణాసి సినిమాపై నిక్ జోనాస్ కామెంట్స్.. ఇది కదా రాజమౌళి క్రేజ్!

Nick Jonas: వారణాసి సినిమాపై నిక్ జోనాస్ కామెంట్స్.. ఇది కదా రాజమౌళి క్రేజ్!
Advertisement

Nick Jonas: రాజమౌళి డైరెక్షన్ లో సినిమా వస్తుంది అంటే ఆ సినిమాకు గ్లోబల్ రేంజ్ లో మంచి ఆదరణ లభిస్తుంది. ఇదివరకే రాజమౌళి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో ప్రస్తుతం చేయబోయే వారణాసి సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

రాజమౌళి సినిమాపై నిక్ జోనాస్ కామెంట్స్..

ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులలో చిత్ర బృందం ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు జోడిగా ప్రియాంక చోప్రా(Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈమె షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ ఒక ఇంటర్వ్యూ సందర్భంగా వారణాసి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఒక ఇంటర్వ్యూలో నిక్ జోనాస్ మాట్లాడుతూ వారణాసి సినిమా అద్భుతంగా ఉండబోతుందని ప్రశంసలు కురిపించారు.

వారణాసి ఓ అద్భుతం..

Advertisement

రాజమౌళి డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా తర్వాత వారణాసి రాబోతుందని, ఈ సినిమా అద్భుతంగా ఉండబోతున్నట్టు ప్రశంసించారు ఆధ్యాత్మిక వైభవం సంస్కృతికి ఫిదా అయిన నిక్ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గ్లోబల్ స్టార్ గా కొనసాగుతున్న నిక్ జోనాస్ రాజమౌళి గురించి ఆయన సినిమా గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే రాజమౌళి క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణను హైదరాబాదులో షూట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ షూటింగ్లో భాగంగా ప్రియాంక చోప్రా పై కూడా కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

గ్లోబల్ రేంజ్ లో రిలీజ్..

Advertisement

ఇక ప్రియాంక చోప్రా హాలీవుడ్ నటుడు పాప్ సింగర్ అయిన నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా పెళ్లి తర్వాత ప్రియాంక చోప్రా కూడా హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. చాలా సంవత్సరాల తర్వాత ఈమె ఇండియన్ సినిమాకు అది రాజమౌళి సినిమాకు కమిట్ కావడంతో ప్రియాంక చోప్రా పేరు ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మారుమోగుతుంది. ఇక ప్రియాంక చోప్రా వారణాసి సినిమాలో భాగం కావడంతో ఈమె భర్త నిక్ జోనాస్ సైతం వారనాసి సినిమా గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడో తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఏకంగా గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Also Read: Peddi Movie:భారీగా పెద్ది థియేట్రికల్ బిజినెస్…వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలు ఇవే! 

Related News

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

రైలులో శ్రేయా ఘోషల్‌కు పీరియడ్స్.. నాన్న చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×