Honor 500 Pro: హానర్ అనే పేరు ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఒక నమ్మకానికి సంకేతంగా మారింది. వినియోగదారులు కోరుకునే మోడరన్ స్టైల్, స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ, రోజువారీ అవసరాలను సాఫీగా నెరవేర్చే వేగం అన్నీ కలిపి అందించే బ్రాండ్‌గా హానర్ గుర్తింపు పొందింది. కొత్త ఆలోచనలు, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రతి విడుదలలో న్యూ స్టాండర్డ్స్ సృష్టిస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యంగా యువత నుంచి ప్రొఫెషనల్స్ వరకు విభిన్న వర్గాలను దృష్టిలో ఉంచుకుని, అందరికీ చేరువలో ఉండేలా డిజైన్, ఎక్స్పీరియన్స్, రెలియాల్ స్టెబిలిటీ అన్నీ సమగ్రంగా అందించటమే హానర్ లక్ష్యం. అందుకే ప్రతి కొత్త హానర్ ఫోన్ విడుదలయ్యే సమయంలో వినియోగదారుల్లో ప్రత్యేక ఆకర్షణ కనిపిస్తుంది.
ప్రీమియం ఫీల్ డిజైన్
ఈ ఫోన్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం మొదట చూస్తే డిజైన్. చేతిలో పట్టుకున్న వెంటనే ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అక్వామెరైన్, స్టార్‌లైట్ పౌడర్, ఆబ్సిడియన్ బ్లాక్, మూన్‌లైట్ సిల్వర్ లాంటి నాలుగు రంగుల్లో అందుబాటులో ఉండటం వలన క్లాసీ లుక్ కోరుకునే వారికి ఇది పర్‌ఫెక్ట్ ఆన్సర్. వెనుక భాగం కర్వ్ ఫినిషింగ్‌తో స్మూత్‌గా ఉండటం, ఫ్రంట్‌లో బెజెల్స్ చాలా సన్నగా ఉండటం వలన స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ మరింత పెద్దదిగా అనిపిస్తుంది.
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్
ఇప్పుడు పర్‌ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఇందులో పెట్టిన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్ స్పీడ్‌కి మరో పేరు. డైలీ యూజ్, హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ అన్ని పరిస్థితుల్లో కూడా ఫోన్ స్టక్ అవకుండా సాఫీగా నడుస్తుంది. 16జిబి వరకు ర్యామ్, 1టిబి వరకు స్టోరేజ్ ఇవ్వడం వలన అప్లికేషన్స్, గేమ్స్, వీడియోస్, ఫైల్ స్టోరేజ్ అన్నీ టెన్షన్ లేకుండా పెట్టుకోవచ్చు. ఇందులో పనిచేసే మ్యాజిక్ ఓఎస్ 10, ఆండ్రాయిడ్ 16 ఆధారంగా ఉండటం వలన అనుభవం మరింత ఫాస్ట్‌గా అనిపిస్తుంది. దీన్ని ఐపి68, ఐపి69, ఐపి69కె ప్రొటెక్షన్‌తో నిర్మించడం వలన నీరు, ధూళి వంటి పరిస్థితుల్లో కూడా బలంగా నిలబడుతుంది.
Also Read: Motorola Edge 70 Pro: 200MP కెమెరా నిజమైన బీస్ట్… మోటరోలా ఎడ్జ్ 70 ప్రో సూపర్ ఫీచర్స్ లీక్
వెనుక భాగంలో మూడు కెమెరాలు
హానర్ 500 ప్రోలో కెమెరా సెటప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. వెనుక భాగంలో మొత్తం మూడు కెమెరాలు ఉన్నాయి. 200ఎంపి మెయిన్ వైడ్ లెన్స్, 50ఎంపి టెలిఫోటో 3ఎక్స్ ఆప్టికల్ జూమ్, 12ఎంపి అల్ట్రావైడ్ మ్యాక్రో. ఫోటోలు తీసినప్పుడు షార్ప్‌నెస్, కలర్ డీటైల్స్ చాలా క్లీన్‌గా కనిపిస్తాయి. దూరంలో ఉన్న వస్తువులను జూమ్ చేసినా క్వాలిటీ స్థిరంగా కొనసాగుతుంది. ముందు భాగంలో ఉన్న 50ఎంపి 3డి డెప్త్ సెన్సింగ్ కెమెరా వలన సెల్ఫీలు, పోర్ట్రెయిట్‌లు ప్రొఫెషనల్ కెమెరాతో తీసినట్టే కనిపిస్తాయి.
8000mAh బ్యాటరీ
బ్యాటరీ సామర్థ్యం పరంగా చూస్తే, ఇందులో పెట్టిన 8000mAh బ్యాటరీ ఒక మాటలో చెప్పాలంటే బీస్ట్. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే గంటలు గంటలు ఛార్జ్ గురించి ఆలోచించకుండా ఉపయోగించవచ్చు. 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండటం వలన తక్కువ టైమ్‌లోనే పూర్తి పవర్ పొందవచ్చు. 50W వైర్లెస్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ కూడా ఉండటం వలన ఇతర డివైసెస్‌కు ఛార్జ్ ఇవ్వడానికీ ఉపయోగపడుతుంది.
చైనా మార్కెట్ ధరతో పోలిస్తే ఇండియాలో ఎంత?
ధరల విషయానికి వస్తే, వివిధ వేరియంట్స్ అందుబాటులో ఉన్నాయి. 12జిబి ప్లస్ 256జిబి వేరియంట్ ధర 3,599 యువాన్ కాగా, ఇండియన్ రూపాయితో పోల్చితే సుమారుగా రూ.45వేలు. 12జిబి ప్లస్ 512జిబి వేరియంట్ 3,899 యువాన్, అంటే భారత ధరతో పోలిస్తే దాదాపు రూ.49వేలు ఉంటుంది. 16జిబి ప్లస్ 512జిబి ధర 4,199 యువాన్, ఇది భారత రూపాయిల్లో సుమారుగా రూ.53వేలు ఉంటుంది. ఇక 16జిబి ప్లస్ 1టిబి హై-ఎండ్ వేరియంట్ 4,799 యువాన్, అంటే భారత మార్కెట్లో సుమారుగా రూ.60,000 వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. స్టాండర్డ్ హానర్ 500 ప్రారంభ ధర 2,699 యువాన్ కాగా, ఇండియా ధరతో దాదాపు రూ.34,000 పరిధిలో ఉంటుంది.
ఫీచర్స్‌తో పోలిస్తే.. హైప్ క్రియేట్
ఈ ధరలు చైనా మార్కెట్ ఆధారంగా ఉన్నప్పటికీ, భారత మార్కెట్లో జిఎస్‌టి, ఇంపోర్ట్ ట్యాక్స్, డిస్ట్రిబ్యూషన్ మార్జిన్ వంటి అంశాలు జోడిస్తే అసలు లాంచ్ సమయంలో ధర కొంత పెరిగే అవకాశం ఉంది. అందుకే భారత విడుదల అయ్యే సమయానికీ వాస్తవ ధర ప్రస్తుత లెక్కల కంటే కొంత పై స్థాయిలో ఉండవచ్చని అంచనా. ధరలు కొంచెం ఎక్కువగా కనిపించినా, అందించే ఫీచర్స్‌తో పోలిస్తే పూర్తి న్యాయం చేసే ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇది మార్కెట్‌లో వచ్చే రోజుల్లో ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి కానీ ప్రారంభ స్పందన చూస్తే, ఇది హైప్ క్రియేట్ చేయడానికి సరిపోయే స్థాయిలో ఉంది.