E-Paper
Advertisement

Kokapet Land Record: కోకాపేట భూముల వేలంలో కొత్త రికార్డు.. ఎకరం అక్షరాల రూ. 151 కోట్లు

Kokapet Land Record: కోకాపేట భూముల వేలంలో కొత్త రికార్డు.. ఎకరం అక్షరాల రూ. 151 కోట్లు
Advertisement

Kokapet Land Record: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని కోకాపేట భూముల వేలం ప్రక్రియ చరిత్ర సృష్టించింది. ఈ వేలంలో భూముల ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఎకరం భూమి ధర ఏకంగా రూ. 150 కోట్లు దాటడం విశేషం.

వేలంలో ఉంచిన ప్లాట్ నంబర్ 15 అత్యంత అధిక ధర పలికింది. ఈ ప్లాట్‌లో ఉన్న ఎకరం భూమి రూ. 151.25 కోట్లకు కొనుగోలు జరిగింది. మొత్తం 4.03 ఎకరాలు ఉన్న ఈ ప్లాట్ అమ్మకం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 609.5 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ప్లాట్‌ను జీహెచ్ఆర్ బ్లాక్స్, లక్ష్మీ ఇన్ ఫ్రా సంస్థలు దక్కించుకున్నాయి.

Advertisement

అదేవిధంగా, ప్లాట్ నంబర్ 16 కూడా భారీ ధర పలికింది. ఇక్కడ ఎకరం ధర రూ. 147.75 కోట్లుగా నిర్ణయమైంది. 5.03 ఎకరాలు ఉన్న ఈ ప్లాట్ వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 743 కోట్లు లభించాయి. ఈ ప్లాట్‌ను గోద్రెజ్ ప్రాపర్టీస్ సంస్థ దక్కించుకుంది.

ఈ రెండు ప్లాట్ల వేలం ద్వారా ప్రభుత్వ రంగ సంస్థ హెచ్ఎండీఏకు మొత్తం రూ. 1352 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయం నగరం అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కోకాపేట భూములకు ఉన్న డిమాండ్, ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ విలువను మరోసారి చాటి చెప్పింది. భూముల వేలంలో కొత్త రికార్డు నమోదు కావడం రియల్టీ మార్కెట్‌కు శుభసూచకంగా భావించవచ్చు.

Advertisement

ALSO READ: PM Modi – Lord Rama Statue: ప్రపంచంలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం, ఆవిష్కరించిన ప్రధాని మోడీ!

Related News

కేటీఆర్ వచ్చే వేళ మిర్యాలగూడలో పొలిటికల్ హీట్.. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య వార్!

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

Big Stories

Advertisement
×