Honor 600 and 600 Pro: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ హానర్ తమ లేటెస్ట్ సిరీస్‌తో గ్లోబల్ మార్కెట్‌లో సందడి మొదలుపెట్టింది. హానర్ 600 ప్రో, హానర్ 600 పేరుతో రెండు అదిరిపోయే ఫోన్లను లాంచ్ చేసింది. ఈ ఫోన్లలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వీటి బ్యాటరీ సామర్థ్యం గురించి. ఏకంగా 7,000mAh బ్యాటరీతో పాటు, 200 మెగాపిక్సెల్ కెమెరాను ఇందులో జోడించారు. ప్రస్తుతం ఇవి సౌదీ అరేబియా, మలేషియా వంటి దేశాల్లో అందుబాటులోకి వచ్చాయి. చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉన్న ఈ ఫోన్లు బ్లాక్, గోల్డెన్ వైట్, ఆరెంజ్ రంగుల్లో మనల్ని ఆకట్టుకుంటున్నాయి.
హానర్ 600 ప్రో మోడల్ (12GB + 512GB) ధర రూ.75,000 వరకు ఉండొచ్చు. ఇక బడ్జెట్‌లో ఫోన్ కావాలనుకునే వారి కోసం హానర్ 600 మోడల్‌ను తీసుకొచ్చారు. దీని బేస్ వేరియంట్ (8GB + 256GB) దాదాపు రూ.45,000 నుంచే మొదలవుతుంది. ఈ రెండు ఫోన్లు కూడా లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 వెర్షన్‌తో పనిచేయడం విశేషం.
ఈ ఫోన్లలో డిస్‌ప్లే క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడలేదు. 6.57 అంగుళాల అమోలెడ్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఇది కళ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా స్మూత్‌గా పనిచేస్తుంది. ఇక పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ప్రో మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ అనే పవర్‌ఫుల్ చిప్‌ను వాడారు. సాధారణ మోడల్‌లో కూడా స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్ ఉంది. అంతేకాదు.. ఫోన్ పొరపాటున నీళ్లలో పడినా ఏమీ కాకుండా దీనికి ఐపీ68 వంటి రక్షణ రేటింగ్స్ కూడా ఇచ్చారు.
Also Read: సెన్హైజర్ నుంచి ఇంత తక్కువ ధరకే హెడ్‌ఫోన్సా? క్వాలిటీ చూస్తే ఇప్పుడే బుక్ చేసుకుంటావ్ మావా!
ఇక ఫొటోలు తీసుకోవడం ఇష్టపడే వారికి ఈ ఫోన్లు తెగ నచ్చేస్తాయి. ఈ రెండింటిలోనూ 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. అయితే ప్రో మోడల్‌లో అదనంగా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ను కూడా అమర్చారు. దీంతో 120 రెట్లు జూమ్ చేసి ఫొటోలు తీసుకోవచ్చు. ఇకపోతే సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ కెమెరా ఉండటంతో వీడియో కాల్స్, ఫొటోలు చాలా క్లియర్‌గా వస్తాయి.
ఈ ఫోన్ల అసలు సిసలైన హైలైట్ 7,000mAh బ్యాటరీ. ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు హ్యాపీగా వాడుకోవచ్చు. మళ్లీ ఛార్జింగ్ పెట్టాలంటే 80W ఫాస్ట్ ఛార్జర్ ఉంది కాబట్టి నిమిషాల్లోనే ఫుల్ అయిపోతుంది. ప్రో వెర్షన్‌లో అయితే వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం కూడా ఉంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ బరువు మాత్రం భారంగా అనిపించదు. 5G నెట్‌వర్క్, లేటెస్ట్ బ్లూటూత్ వంటి ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్లు త్వరలోనే ఇండియాలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
Also Read: ఏసీ వాడకపోయినా కరెంటు బిల్లు అమాంతం పెరుగుతోందా? అసలు కారణం ఈ 6 వస్తువులే!