E-Paper
Advertisement

సెన్హైజర్ నుంచి ఇంత తక్కువ ధరకే హెడ్‌ఫోన్సా? క్వాలిటీ చూస్తే ఇప్పుడే బుక్ చేసుకుంటావ్ మావా!

సెన్హైజర్ నుంచి ఇంత తక్కువ ధరకే హెడ్‌ఫోన్సా? క్వాలిటీ చూస్తే ఇప్పుడే బుక్ చేసుకుంటావ్ మావా!
Advertisement

Best Headphones: సంగీత ప్రియులకు సెన్హైజర్ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ కంపెనీ భారత్‌లో రెండు సరికొత్త వైర్డ్ హెడ్‌ఫోన్లను లాంచ్ చేసింది. అవే CX 80U, HD 400U. ఈ రోజుల్లో చాలా ఫోన్లకు హెడ్‌ఫోన్ జాక్ ఉండటం లేదు కదా.. అందుకే ఈ రెండింటినీ లేటెస్ట్ యూఎస్‌బీ టైప్-సి కనెక్టివిటీతో తీసుకొచ్చారు. దీనివల్ల బ్లూటూత్ హెడ్‌ఫోన్ల మాదిరిగానే ఛార్జింగ్ అయిపోతుందనే భయం ఉండదు.. అలా ప్లగ్ చేసి ఇలా పాటలు వినేయొచ్చు.

ధర ఎంతంటే?

బడ్జెట్‌లో చూసుకునే వారి కోసం సీఎక్స్ 80యూ మోడల్‌ను రూ.1,990కే అందిస్తున్నారు. ఇది బ్లాక్, వైట్ రంగులతో పాటు చూడటానికి చాలా కొత్తగా ఉండే లేత గులాబీ కలర్‌లోనూ దొరుకుతుంది. ఇక కొంచెం హై క్వాలిటీ మ్యూజిక్ కావాలనుకునే వారి కోసం హెచ్‌డీ 400యూని రూ.5,990 ధరకు తీసుకొచ్చారు. ఇవి ఇప్పటికే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సైట్లతో పాటు క్రోమా, రిలయన్స్ డిజిటల్ వంటి షాపుల్లోనూ అమ్మకానికి ఉన్నాయి.

సౌండ్ క్వాలిటీ అదుర్స్..

Advertisement

ఈ హెడ్‌ఫోన్లలో సెన్హైజర్ సంస్థ హై రెజల్యూషన్ ఆడియోను అందించింది. దీంతో మనం వినే పాటలోని చిన్న చిన్న శబ్దాలు కూడా చాలా స్పష్టంగా వినిపిస్తాయి. ముఖ్యంగా మూవీ లవర్స్, గేమర్స్ కోసం ఇందులో లేటెన్సీ సమస్య లేకుండా చూశారు. తద్వారా మనం చూసే వీడియోకు, వినే సౌండ్‌కు అస్సలు గ్యాప్ ఉండదు. తక్కువ ధరలో వచ్చే సీఎక్స్ 80యూలో కూడా 9.7 మిమీ డైనమిక్ డ్రైవర్లను వాడటం విశేషం.

Also Read: ఏసీ వాడకపోయినా కరెంటు బిల్లు అమాంతం పెరుగుతోందా? అసలు కారణం ఈ 6 వస్తువులే!

కాల్స్ మాట్లాడటం మరింత ఈజీ..

Advertisement

ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదంటే ఆఫీస్ మీటింగ్స్‌లో ఉన్నప్పుడు కాల్స్ మాట్లాడటానికి ఇందులో మంచి మైక్రోఫోన్లను అమర్చారు. వైర్ మీద ఉండే బటన్లతోనే పాటలు మార్చుకోవచ్చు, ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయొచ్చు. ఈ టైప్-సి హెడ్‌ఫోన్స్ మన ఫోన్లకే కాకుండా ట్యాబ్‌లకు, ల్యాప్‌టాప్‌లకు కూడా ఈజీగా సెట్ అయిపోతాయి.

ఏది కొనడం బెటర్?

సీఎక్స్ 80యూ హెడ్‌ఫోన్స్ చాలా చిన్నగా, తేలికగా ఉంటుంది. చెవుల్లో పెడితే అస్సలు బరువు అనిపించదు. పైగా బయటి సౌండ్ కూడా వినపడకుండా చేస్తుంది. ఇక హెచ్‌డీ 400యూ విషయానికొస్తే.. ఇది పెద్ద హెడ్‌ఫోన్. దీనిని మడతపెట్టుకోవచ్చు కాబట్టి బ్యాగుల్లో పెట్టుకుని ప్రయాణాల్లో తీసుకెళ్లడం చాలా సులభం. దీనికి ఉండే కేబుల్‌ను కావాలనుకుంటే తీసేసి వేరేది కూడా వాడుకోవచ్చు. వైర్‌లెస్ తలనొప్పులు వద్దు అనుకునే వారికి ఈ రెండు హెడ్‌ఫోన్స్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

Also Read: మిడ్‌రేంజ్ ధరలో ప్రీమియం ఫీచర్లు.. గేమర్స్ కోసం OnePlus Nord CE 6 వచ్చేస్తోంది!

Related News

గెలాక్సీ రింగ్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఫోన్‌తోనే ఛార్జింగ్, కేస్ అవసరమే లేదు!

నాయిస్ నుంచి సరికొత్త స్క్రీన్‌లెస్ ఫిట్‌నెస్ బ్యాండ్.. ఆ కార్డు మీద కొలుగోలు చేస్తే భారీ ఆఫర్!

మ్యూజిక్ లవర్స్‌కు వీఐ బంపరాఫర్.. ఫ్రీగా ‘Spotify ప్రీమియం’.. కొత్త ప్లాన్స్ ఇవే!

రూ.599కే వన్‌ప్లస్ హెడ్‌ఫోన్స్.. ఫోన్లపై ఊహించని డిస్కౌంట్లు, Independence Day Sale ఆఫర్లు ఇవే!

డిజైన్ పిచ్చెక్కిస్తోంది బాబోయ్.. ఐకూ లవర్స్‌కి ఇది కదా కావాల్సింది!

యాపిల్ నుంచి మరో సంచలనం.. ఈసారి ఎయిర్‌పాడ్స్‌లోనే కెమెరాలు!

రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే ల్యాప్‌టాప్ స్పీడ్‌ని డబుల్ చేయండిలా!

8,000mAh బ్యాటరీనా.. అమోలెడ్ స్క్రీనా? ఈ 3 కొత్త 5G ఫోన్లలో ఏది కొనుగోలు చేయడం ఉత్తమం?

Big Stories

Advertisement
×