E-Paper
Advertisement

Honor Magic 7 Pro: 50MP ఫ్రంట్ కెమెరా, 5800mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కొత్త ఫోన్..!

Honor Magic 7 Pro: 50MP ఫ్రంట్ కెమెరా, 5800mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కొత్త ఫోన్..!
Advertisement

Honor Magic 7 Series: రోజుకో కొత్త మోడల్ దేశీయ మార్కెట్‌లో లాంచ్ అవుతుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రముఖ టెక్ కంపెనీలు సైతం తమ ఫోన్లలో కొత్త కొత్త టెక్నాలజీతో ఫీచర్లను అందించి తమ ఫోన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. సేఫ్టీ విషయంలోనూ కంపెనీలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. అదే సమయంలో ఫోన్ ప్రియులు కూడా అద్భుతమైన సేఫ్టీ ఫీచర్లు గల ఫోన్లనే సెర్చ్ చేస్తున్నారు. మరి మీరు కూడా అలాంటి ఫోన్‌నే కొనుక్కోవాలని అనుకుంటున్నట్లయితే అలాంటి సమయం దగ్గరపడింది. ఎందుకంటే త్వరలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ హానర్ కొత్త ఫోన్లను లాంచ్ చేయడానికి సిద్ధమవుతుంది.

హానర్ మ్యాజిక్ 7 సిరీస్ లాంచ్ చేయడానికి ముందు వార్తల్లో నిలిచింది. ఈ సిరీస్‌లో కంపెనీ మ్యాజిక్ 7, మ్యాజిక్ 7 ప్రో, మ్యాజిక్ 7 అల్టిమేట్, మ్యాజిక్ 7 RSR పోర్స్చే డిజైన్ వంటి మోడళ్లను అందించే అవకాశం ఉంది. అయితే ఇందులో Honor Magic 7 Pro నవంబర్‌లో లాంచ్ కానుంది. ఈ హానర్ మ్యాజిక్ 7 ప్రో గురించిన తాజా లీక్ దాని స్పెసిఫికేషన్‌లను వెల్లడిస్తుంది. దాని ప్రకారం.. ఈ ఫోన్‌లో 5800mAh పెద్ద బ్యాటరీని అందించే అవకాశం ఉంది. ఇది 2K డిస్ప్లే కలిగి ఉంటుంది. అంతేకాకుండా అనేక ఆకర్షణీయమైన ఫీచర్లను ఇందులో చూడవచ్చు. హానర్ మ్యాజిక్ 7 ప్రో మునుపటి హానర్ మ్యాజిక్ 6 ప్రోకి సక్సెసర్‌గా రానుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వివరంగా తెలుసుకుందాం.

Advertisement

హానర్ మ్యాజిక్ 7 ప్రో స్పెసిఫికేషన్‌లు దాని లాంచ్‌కు ముందే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. హానర్ మ్యాజిక్ 7 ప్రో ఇటీవల విడుదల చేసిన హానర్ మ్యాజిక్ 6 ప్రోకి సక్సెసర్‌గా రానుంది. ఈ ఫోన్ అనేక స్పెసిఫికేషన్‌లతో చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో లీక్ అయినట్లు సమాచారం. దాని ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ 6.82 అంగుళాల 2K డ్యూయల్ లేయర్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లో Snapdragon 8 Gen 4 చిప్‌సెట్ ఉంటుందని తెలుస్తోంది. దీనితో UFS 4.0 స్టోరేజ్, LPDDR5X RAM అందించే అవకాశం ఉంది.

Also Read: ఆఫర్లే ఆఫర్లు.. మొన్ననే రిలీజ్.. అప్పుడే ఇంత భారీ డిస్కౌంటా.. వెంటనే కొనేయండి..!

Advertisement

ఈ ఫోన్ కెమెరాల విషయానికొస్తే.. ముందు భాగంలో 50-మెగాపిక్సెల్ కెమెరాతో అమర్చబడి ఉంటుంది. ఇందులో 3డి డెప్త్ సెన్సింగ్ సామర్ధ్యాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో అమర్చబడుతుంది. దీనితో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్, 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ అందించే అవకాశం ఉంది.

అలాగే Magic 7 Proలో 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,800mAh బ్యాటరీని అందించే ఛాన్స్ ఉంది. అలాగే ఇది 66W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను కలిగి ఉంటుందని చెప్పబడింది. ఇది కాకుండా ఇతర ఫీచర్లలో ఇది మూడవ తరం కింగ్‌హై లేక్ బ్యాటరీ టెక్నాలజీతో వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా IP68/69 రేటింగ్ ఇవ్వవచ్చు. దీనిద్వారా ఫోన్ స్క్రీన్ తడిసినా పెద్దగా ఏం కాకుండా ఉంటుంది.

ఫోన్‌లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉందని తెలుస్తోంది. ఇది 2డి ఫేస్ రికగ్నిషన్ సామర్ధ్యంతో రావచ్చని అంటున్నారు. శాటిలైట్ కమ్యూనికేషన్ ఫీచర్‌ను కూడా ఫోన్‌లో అందించే అవకాశం ఉంది. అయితే స్పెసిఫికేషన్లన్నీ లీక్ అయినవి మాత్రమే. దీనికి సంబంధించిన అఫీషియల్ స్పెసిఫికేషన్లు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×