BigTV English

Family Dispute: భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య.. ఆ తర్వాత భయంతో ఏం చేసిందంటే?

Family Dispute: భర్త మర్మాంగాన్ని కోసేసిన భార్య.. ఆ తర్వాత భయంతో ఏం చేసిందంటే?

Wife Attack: భార్య, భర్తల మధ్య గొడవలు రావడం కామన్. ఇద్దరిలో ఎవరో ఒకరు అడ్జస్ట్ అవుతారు. గొడవ సర్దుకుపోతుంది. కానీ, కొన్ని గొడవలు ఘర్షణల వరకు వెళ్లుతాయి. ఘర్షణ వరకే కాదు.. ఏకంగా కత్తి తీసి భర్త మర్మాంగాన్ని కోసేసే దాకా వెళ్లింది ఈ సీతాకుమారి. ఈ ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే?


బిహార్‌కు చెందిన విజయ్ యాదవ్ ఉపాధి నిమిత్తం ఏపీకి వచ్చాడు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం తొర్రగుడిపాడులోని ఓ పశువుల డైరీలో పనికి కుదిరాడు. డైరీలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. విజయ్ యాదవ్‌కు పెళ్లైంది. భార్య బిహార్‌లోనే ఉంటుంది. ఇక విజయ్ యాదవ్ ఇక్కడ డైరీలో పని చేస్తున్న క్రమంలో అదే బిహార్ రాష్ట్రానికి చెందిన సీతా కుమారి కూడా డైరీలో పని చేయడానికి వచ్చింది. వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఒకే రాష్ట్రం కావడంతో కొంత క్లోజ్ అయ్యారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. తర్వాత సీతాకుమారిని పెళ్లి చేసుకున్నాడు.

సీతాకుమారి గర్భం దాల్చింది. సీతాకుమారి గర్భిణి అయ్యాక విజయ్ యాదవ్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. తరచూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. పూటుగా మద్యం తాగి టార్చర్ పెట్టాడు. తరుచూ వారి మధ్య గొడవలు జరిగేవి. శనివారం రాత్రి కూడా వీరి మధ్య గొడవలు జరిగాయి. ఈ గొడవతో సీతాకుమారి తీవ్ర ఆగ్రహానికి గురైంది. కత్తి తీసి భర్త మర్మాంగాన్ని కోసేసింది. అంతా రక్తమయమైంది.


Also Read: CPI Narayana: ఆయనేం సత్యహరిశ్చంద్రుడు కాదు.. కూల్చివేతలను కంటిన్యూ చేయాలి: నారాయణ

రక్తం చూసి ఆమె భయపడింది. ఏం చేయాలా? అని ఆలోచించి డైరీ ఫామ్ యజమానికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పింది. వెంటనే అక్కడి నుంచి పరారైపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడిని హాస్పిటల్ తరలించారు. ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సీతాకుమారి కోసం గాలిస్తున్నారు.

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×