E-Paper
Advertisement

Honor Magic 8 Smartphone: హానర్ మ్యాజిక్ 8 ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ… 7000mAh బ్యాటరీతో ఫ్లాగ్‌షిప్ పోటీకి స్టార్ట్

Honor Magic 8 Smartphone: హానర్ మ్యాజిక్ 8 ఫోన్ మార్కెట్‌లోకి ఎంట్రీ… 7000mAh బ్యాటరీతో ఫ్లాగ్‌షిప్ పోటీకి స్టార్ట్
Advertisement

Honor Magic 8 Smartphone: 2025లో మొబైల్ మార్కెట్ గురించి మాట్లాడితే, ప్రతి కంపెనీ కొత్త కొత్త ఫీచర్లను తీసుకువస్తూ వినియోగదారుల మనసును గెలుచుకోవడానికి పోటీ పడుతున్నా, వాటన్నింటికీ పక్కన నిలబడి అందరినీ ఆశ్చర్యపరుస్తూ ముందుకొచ్చింది హానర్ మ్యాజిక్ 8. ఒకసారి ఫోన్‌ని చూస్తేనే ఇది సాధారణ ఫోన్ కాదని స్పష్టంగా తెలుస్తుంది. చేతిలో పట్టుకున్న క్షణం నుంచే దీని డిజైన్ ఇచ్చే ప్రీమియం ఫీలింగ్, బాడీ ఇచ్చే స్లిమ్ ఫీల్, వెనుక భాగంలో మెరిసే ఫినిష్ ఇవన్నీ హానర్ మ్యాజిక్ ప్రత్యేకత. పేరే వినడానికే వెరైటీగా ఉండే ఈ ఫోన్, ఫీచర్ల విషయానికి వస్తే మరింత షాక్ ఇవ్వడం ఖాయం. ముఖ్యంగా హానర్ అనేది చైనీస్ బ్రాండ్ కావడం వల్ల, ఈ మ్యాజిక్ 8 మోడల్ కూడా అదే కంపెనీ నుంచి వచ్చిన తాజా ప్రీమియం ఉత్పత్తి.

అమోలేడ్ స్క్రీన్‌తో డిస్‌ప్లే

Advertisement

డిస్‌ప్లే విషయానికి వస్తే, హానర్ మ్యాజిక్ 8లో ఉన్న 6.8 అంగుళాల విస్తరించిన అమోలేడ్ స్క్రీన్ చూసేవారినే కాదు, ఉపయోగించే వారినీ ఆకట్టుకునే స్థాయిలో ఉంటుంది. ఇందులో రంగులు ఎంతో అట్రాక్టివ్‌గా కనిపిస్తాయి, ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగానే కనిపిస్తుంది. స్క్రోల్ చేస్తే సాఫ్ట్‌గా కదిలే 120Hz ఫ్రేమ్ రేట్ కారణంగా నేటి తరానికి కావలసిన ఆ స్మూత్‌నెస్ స్పష్టంగా తెలుస్తుంది.

స్మూత్ పర్‌ఫార్మె్న్స్

Advertisement

పర్‌ఫార్మె్న్స్ విషయంలో వినియోగదారులు ఊహించే స్థాయికి మించి ఫ్లాగ్‌షిప్ శక్తిని హానర్ మ్యాజిక్ 8 ఇవ్వగలుగుతోంది. భారీ గేములు ఆడినా, వీడియోలు ఎడిట్ చేసినా, లేదా ఎక్కువ ఫైల్స్ ఒకేసారి ఓపెన్ చేసిన ఈ ఫోన్ ఎక్కడా స్లో అవ్వదు. లోపలి ప్రాసెసర్ శక్తివంతంగా ఉండడం వల్లే ఈ స్థాయిలో స్మూత్ పనితీరు వస్తుంది. హీట్ సమస్యలు లేకుండా, ల్యాగ్ లేకుండా ఫోన్ ఎప్పుడూ రెడీగా ఉంటూ పని చేస్తుంది.

క్వాలిటీ కెమెరా

కెమెరా విషయానికి వస్తే హానర్ మ్యాజిక్ 8 మరోసారి తన నమ్మకాన్ని నిలబెట్టుకుంది. పగటిపూట తీసిన ఫోటోలు రంగుల సహజత్వాన్ని కోల్పోకుండా క్లియర్‌గా కనిపిస్తే, రాత్రివేళ సాధారణంగా వచ్చే గ్రెయిన్, బ్లర్, డార్క్ ఇవన్నీ ఈ ఫోన్‌లో గణనీయంగా (Significantly) తగ్గుతాయి. పెద్ద సెన్సార్ వల్ల లైటింగ్ తక్కువగా వున్న ఫోటోలు మాత్రం పూర్తీ క్లారిటీతో వస్తాయి. వీడియోలు రికార్డ్ చేస్తే స్టెబిలైజషన్ స్టేడీగా పనిచేస్తూ క్వాలిటీని నిలబెట్టుతుంది. సెల్ఫీల్లో కూడా స్కిన్ టోన్‌ను మార్చకుండా సహజమైన క్లిరిటీ ఇస్తుంది.

Also Read: Vivo V31 Pro 6G: 6జి యుగానికి సిద్ధమైన వివో వి31 ప్రో .. డిజైన్, కెమెరా, పవర్ అన్నీ టాప్..

7000mAh భారీ బ్యాటరీ

ఇప్పుడు ఈ ఫోన్‌లోని ముఖ్యమైన అంశం 7000mAh భారీ బ్యాటరీ. ఈ స్థాయిలో బ్యాటరీ పెట్టడం ఏ కంపెనీకి సాధారణ విషయం కాదు. ఎందుకంటే పెద్ద బ్యాటరీ అంటే ఫోన్ బరువు ఎక్కువ అవుతుంది, ఆకారంలో మార్పులు రావచ్చు. కానీ హానర్ మ్యాజిక్ 8లో ఇది అలా అనిపించకుండా డిజైన్ చేశారు. ఒకసారి పూర్తిగా చార్జ్ చేస్తే రోజంతా వాడుకునే హామీ ఇస్తుంది. అది ఎక్కువగా గేమింగ్ చేసినా, గంటలకొద్దీ వీడియోలు చూసినా, జీపీఎస్ వాడినా మధ్యలో చార్జింగ్ అవసరం చాలా అరుదుగా వస్తుంది. దీన్ని నిజంగా పవర్ యూజర్లకు ప్రత్యేకంగా తయారుచేశారు అన్నట్టు ఉంటుంది.

90W ఫాస్ట్ చార్జింగ్

ఇక చార్జింగ్ విషయానికి వస్తే 90W ఫాస్ట్ చార్జింగ్ ఈ ఫోన్‌కి ఉన్న మరో ప్రధాన ఆకర్షణ. పెద్ద బ్యాటరీ ఉన్నా కూడా ఫుల్ చార్జ్ అవ్వడానికి ఎక్కువ సమయం పడదు. చాలా సార్లు బయటకు వెళ్లడానికి కొన్ని నిమిషాలే సమయం ఉంటే కూడా ఈ చార్జింగ్ స్పీడ్‌తో ఫోన్ గంటల తరబడి ఉపయోగించుకునేంత పవర్ అందిస్తుంది.

సాఫ్ట్‌వేర్ పరంగా సూపర్ 

ఫోన్ సాఫ్ట్‌వేర్ కూడా సింపుల్‌గా, వేగంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పనిచేసే విధంగా రూపొందించారు. అవసరం లేని యాప్‌లు దూరంగా ఉంచడం వల్ల ఫోన్ క్లారిటీగా పని చేస్తుంది. భద్రత విషయంలో కూడా హానర్ తాజా సాంకేతికతలను వాడుతూ వినియోగదారుల సమాచారం సురక్షితంగా ఉండేలా జాగ్రత్తగా వ్యవహరించింది.

ఇండియాలో ధర ఎంతంటే?

భారతదేశంలో హానర్ మ్యాజిక్ 8 ధర సుమారు రూ.49,999 నుండి రూ.54,999 మధ్యలో ఉండొచ్చని టెక్ వర్గాల్లో టాక్. ఈ ధరలో ఇంత పెద్ద బ్యాటరీ, ఇంత మంచి పనితీరు, ఇంత ప్రీమియం డిజైన్ ఇవ్వడం నిజంగా వినియోగదారులకే లాభం. ఒక పూర్తి ఫ్లాగ్‌షిప్ అనుభవాన్ని కోరుకునే ఎవరికైనా హానర్ మ్యాజిక్ 8 ఒక అద్భుతమైన ఎంపిక అని చెప్పొచ్చు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×