E-Paper
Advertisement

ఏసీని వరుసగా ఎన్ని గంటలు వాడొవచ్చు? ఎక్కువ సేపు ఆన్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

ఏసీని వరుసగా ఎన్ని గంటలు వాడొవచ్చు? ఎక్కువ సేపు ఆన్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
Advertisement

AC safety tips: వేసవి కాలంలో ఎండల తీవ్రత దృష్ట్యా చాలా ఇళ్లలో ఏసీలు రోజంతా నడుస్తూనే ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట పడుకున్నప్పటి నుంచి ఉదయం వరకు ఏసీ ఆపడం లేదు. అయితే.. ఏ యంత్రానికైనా కొంత విశ్రాంతి అవసరం. ఏసీని నిరంతరాయంగా వాడటం వల్ల అది ఎంతవరకు తట్టుకోగలదు? మోటార్‌పై పడే భారం ఎంత? ఏసీ పేలుళ్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అన్న విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వరుసగా ఎన్ని గంటలు వాడొచ్చు?

Advertisement

సాధారణంగా ఏసీని వరుసగా 24 గంటల పాటు వాడవచ్చు. అయితే.. ఇది రూమ్ ఉష్ణోగ్రత , బయటి వాతావరణంపై కూడా ఇది ఆధారపడి ఉంటుంది. ఇన్వర్టర్ ఏసీలు అయితే.. గది ఉష్ణోగ్రత సెట్ చేసిన స్థాయికి రాగానే కంప్రెసర్ వేగాన్ని తగ్గించుకుంటాయి. దీని వల్ల ఏసీపై భారం తగ్గి, అది ఎక్కువ కాలం పనిచేస్తుంది. కానీ.. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రతి 8 నుంచి 10 గంటల వాడకం తర్వాత కనీసం ఒక గంట బ్రేక్ ఇవ్వడం వల్ల ఏసీ ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుంది.

ఏసీని నిరంతరాయంగా వాడితే వచ్చే సమస్యలు:

Advertisement

కంప్రెసర్ వేడెక్కడం: ఏసీలో అత్యంత ముఖ్యమైన భాగం కంప్రెసర్. ఇది గంటల తరబడి పనిచేయడం వల్ల విపరీతంగా వేడెక్కుతుంది. సరైన వెంటిలేషన్ లేకపోతే ఇది కాలిపోయే ప్రమాదం ఉంది.

కరెంట్ ఖర్చు : ఏసీ ఎక్కువ సేపు నడిస్తే కరెంట్ బిల్లు భారీగా పెరుగుతుంది. గదికి సరైన ఇన్సులేషన్ లేకపోతే.. చల్లదనం బయటకు పోయి కంప్రెసర్ నిరంతరం హై స్పీడ్‌లో నడుస్తుంది. దీని వల్ల కరెంట్ ఖర్చు రెట్టింపు అవుతుంది.

తేమ తగ్గడం: ఏసీ గాలి గదిలోని తేమను పీల్చుకుంటుంది. ఎక్కువ సేపు ఏసీలోనే ఉండటం వల్ల చర్మం పొడిబారడం, కళ్లు మంట పుట్టడం వంటి సమస్యలు రావచ్చు.

ఆసక్తికరమైన నిజాలు :
ఆటో-కట్ ఫీచర్: ఏసీని 16 డిగ్రీల్లో పెట్టి గంటల తరబడి వాడటం కంటే.. 24-26 డిగ్రీల వద్ద ఉంచడం బెస్ట్. ఈ ఉష్ణోగ్రత వద్ద ఏసీ కంప్రెసర్ అప్పుడప్పుడు ఆగుతుంది. దీనివల్ల ఏసీకి బ్రేక్ లభిస్తుంది.

పేలుళ్లకు కారణం: ఏసీ పేలిపోవడానికి నిరంతర వాడకం కంటే.. సరిగ్గా సర్వీసింగ్ చేయకపోవడం, నాసిరకం వైరింగ్ వాడటం ప్రధాన కారణాలు. గ్యాస్ లీకేజీ ఉన్నప్పుడు కంప్రెసర్ వేడెక్కితే ప్రమాదం జరుగుతుంది.

Also Read: పాత కూలర్ కొంటున్నారా? ఈ 5 విషయాలు చెక్ చేయకపోతే మోసపోవడం ఖాయం

సర్వీసింగ్ ప్రాముఖ్యత: ఏడాదికి కనీసం రెండు సార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి. ఫిల్టర్లలో ధూళి పేరుకుపోతే గాలి సరిగ్గా రాక కంప్రెసర్ మీద ఒత్తిడి పెరుగుతుంది.

మరికొన్ని చిట్కాలు:
1.ఏసీతో పాటు గదిలో సీలింగ్ ఫ్యాన్‌ను తక్కువ స్పీడ్‌లో నడపండి. దీని వల్ల చల్లటి గాలి గది అంతా త్వరగా వ్యాపిస్తుంది.

2.గది కిటికీలు, తలుపులకు మందపాటి కర్టెన్లు వేయండి. ఎండ నేరుగా గదిలోకి రాకుండా ఉంటే ఏసీపై భారం తగ్గుతుంది.

3.స్టెబిలైజర్ తప్పనిసరిగా వాడండి. వోల్టేజ్ హెచ్చుతగ్గుల వల్ల ఏసీ సర్క్యూట్లు దెబ్బతినకుండా ఉంటాయి.

ఏసీని నిరంతరాయంగా వాడటం వల్ల తక్షణమే ప్రమాదం జరగకపోయినా.. అది ఏసీ పనితీరును తగ్గిస్తుంది. ఆరోగ్య రీత్యా , ఆర్థిక రీత్యా ఏసీని అవసరమైన మేరకే వాడుతూ.. మధ్యమధ్యలో బ్రేక్ ఇవ్వడం మంచిది.

Related News

అదే జరిగితే.. ఈ నగరాలన్నీ కనుమరుగు? వరద ఎన్ని ‘అంతస్తుల ఎత్తు’లో దూసుకెళ్తుందంటే?

స్టైలిష్ లుక్..అల్టిమేట్ సౌండ్,యూత్‌ను ఫిదా చేస్తున్న సౌండ్ బార్

పాకెట్ సైజ్ బడ్జెట్ పవర్ బ్యాంక్..రూ.898కే బెస్ట్ మోడల్

నీళ్లు, చెత్తను ఒకేసారి శుభ్రం చేసే..అద్భుతమైన టూల్!

రూ.10వేలకే.. శామ్‌సంగ్ వాషింగ్ మెషీన్,ఆఫర్ కొన్ని రోజులే!

రూ.5,290 ధరకే 30W బేస్ స్మార్ట్ టీవీ..ఇక ఇల్లు దద్దరిల్లిపోవాల్సిందే !

రూ.7,490 కే 7.5 కేజీల కెపాసిటీనా? ఇంతమంచి వాషింగ్ మెషీన్ అస్సలు మిస్సవ్వొద్దు

చార్జింగ్ టెన్షన్ లేదు, లుక్ అద్దిరిపోతుంది.. ఈ ట్రెండింగ్ స్మార్ట్‌వాచ్ మీకోసమే!

Big Stories

Advertisement
×