E-Paper
Advertisement

క్రేజీ అప్‌డేట్,ఇన్‌స్టా ప్రొఫైల్‌ను మరింత స్టైలిష్‌గా మార్చే.. సింపుల్ ట్రిక్!

క్రేజీ అప్‌డేట్,ఇన్‌స్టా ప్రొఫైల్‌ను మరింత స్టైలిష్‌గా మార్చే.. సింపుల్ ట్రిక్!
Advertisement

Instagram Profile Grid Customization: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది వాడుతున్న పాపులర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) యూజర్ల కోసం ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ మోసుకొచ్చింది. ఇప్పటివరకు మనం ఇన్‌స్టాలో ఏ ఫోటో లేదా రీల్ పోస్ట్ చేసినా, అది ప్రొఫైల్ గ్రిడ్‌లో వరుస క్రమంలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు ఆ రూల్‌ను ఇన్‌స్టాగ్రామ్ బ్రేక్ చేసింది. యూజర్లు తమ ప్రొఫైల్ గ్రిడ్ లేఅవుట్‌ను తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునే సరికొత్త అప్‌డేట్‌ను రోల్ అవుట్ చేసింది. ఈ క్రేజీ ఫీచర్ ఏంటి, దీనిని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ గ్రిడ్ కస్టమైజేషన్:

Advertisement

నేటి జనరేషన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ అనేది ఒక విజిటింగ్ కార్డ్‌లా మారిపోయింది. మన ప్రొఫైల్ ఎంత అందంగా, ఆర్గనైజ్డ్‌గా ఉంటే మనకు అంత ఎక్కువ మంది ఫాలోవర్స్ పెరుగుతుంటారు. ముఖ్యంగా కంటెంట్ క్రియేటర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ ప్రొఫైల్ థీమ్ కోసం చాలా కష్టపడుతుంటారు. ఈ కష్టాన్ని తగ్గించడానికి , యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లడానికి ఇన్‌స్టాగ్రామ్ ఈ గ్రిడ్ కస్టమైజేషన్ అప్‌డేట్‌ను తీసుకొచ్చింది.

ఈ ఫీచర్ ప్రత్యేకత:
ఇప్పటివరకు ఉన్న సిస్టమ్ ప్రకారం.. మనం కొత్తగా ఏ పోస్ట్ పెట్టినా అది ప్రొఫైల్‌లో అందరికంటే పైన మొదటి ప్లేస్‌లోకి వచ్చేస్తుంది. దీని వల్ల పాత పోస్టులు కిందకు వెళ్ళిపోతాయి. ఒకవేళ మీ పాత ఫోటో లేదా రీల్ చాలా బాగుండి, అది మీ ప్రొఫైల్ ఓపెన్ చేయగానే అందరికీ కనిపించాలనుకుంటే.. దానికి ‘పిన్’ఆప్షన్ మాత్రమే ఉండేది. కానీ ఈ కొత్త లేఅవుట్ అప్‌డేట్ ద్వారా మీరు మీ ప్రొఫైల్‌లోని ఏ పోస్ట్‌నైనా, ఎక్కడికైనా జరుపుకోవచ్చు. అంటే, మీ గ్రిడ్‌లోని ఫోటోల క్రమాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ (Drag and Drop) పద్ధతిలో రీ-అరేంజ్ చేసుకోవచ్చన్నమాట.

Advertisement

ఈ గ్రిడ్ లేఅవుట్‌ను ఎలా మార్చాలి?
ఈ లేటెస్ట్ ఫీచర్‌ను ఉపయోగించడం చాలా ఈజీ. దీనికోసం కింద ఉన్న సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి.

స్టెప్ 1: మొదట మీ మొబైల్‌లో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను లేటెస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేయండి.

స్టెప్ 2: యాప్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ సెక్షన్‌లోకి వెళ్ళండి.

స్టెప్ 3: అక్కడ పైన కనిపించే ‘ఎడిట్ ప్రొఫైల్’ (Edit Profile) ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

స్టెప్ 4: ఇందులో మీకు కొత్తగా ‘రీ-అరేంజ్ గ్రిడ్’ (Rearrange Grid) లేదా ‘లేఅవుట్ కస్టమైజర్’ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది.

స్టెప్ 5: దానిపై క్లిక్ చేయగానే మీ ప్రొఫైల్ పోస్టులన్నీ కనిపిస్తాయి. ఇప్పుడు మీకు నచ్చిన ఫోటోను లాంగ్ ప్రెస్ చేసి, ఏ ప్లేస్‌లో పెట్టాలో అక్కడకు డ్రాగ్ చేయడమే.

స్టెప్ 6: అంతా సెట్ అయ్యాక పైన ఉన్న ‘సేవ్’ (Save) లేదా డన్ బటన్ నొక్కితే మీ కొత్త ప్రొఫైల్ లుక్ రెడీ అయిపోతుంది.

క్రియేటర్లకు బెస్ట్:
ఈ ఫీచర్ ముఖ్యంగా డిజిటల్ మార్కెటర్లకు, బ్రాండ్లకు , ఇన్ ఫ్లుయెన్సర్లకు బాగా హెల్ప్ అవుతుంది. తమ బెస్ట్ కంటెంట్‌ను ప్రొఫైల్‌లో హైలైట్ చేయడానికి, అలాగే ఒకే కలర్ థీమ్ మెయింటైన్ చేయడానికి ఈ కస్టమైజేషన్ టూల్ సూపర్ గా యూజ్ అవుతుంది.

ఇన్‌స్టా తీసుకొచ్చిన ఈ అప్‌డేట్‌తో యూజర్లకు తమ ప్రొఫైల్‌పై ఫుల్ కంట్రోల్ దొరికినట్లయింది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ ఇన్‌స్టా యాప్ అప్‌డేట్ చేసి, మీ ప్రొఫైల్ గ్రిడ్‌ను మీ స్టైల్‌కు తగ్గట్టుగా మార్చేసి ఫ్రెండ్స్‌ను సర్‌ప్రైజ్ చేయండి.

Related News

స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు భూకంప హెచ్చరికల సాధనంగా.. గూగుల్ బిగ్ అప్‌డేట్!

యూట్యూబ్ ఛానెల్ పెడుతున్నారా? ఈ కంటెంట్‌తో వీడియోలు చేస్తే మీరే కింగ్.. కనక వర్షం కురవాల్సిందే!

యాపిల్ ప్రియులకు ఊహించని షాక్.. ఆన్‌లైన్ స్టోర్ బంద్, కారణం ఏమిటంటే?

యూట్యూబ్‌లో ఏఐ పాటలకు ప్రత్యేక లేబుల్స్.. అసలు ఇవి ఎలా పనిచేస్తాయంటే?

మెమరీ చిప్‌ల కొరత.. 14 ఏళ్ల కనిష్టానికి పడిపోయిన గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్!

iPhone 16 తక్కువ ధరకే వస్తోందని కొంటున్నారా? ఈ విషయం తెలిస్తే ప్లాన్ మార్చుకుంటారు!

యాపిల్ వాచ్ సిరీస్ 11పై ఊహించని డిస్కౌంట్.. అమెజాన్ పండుగ సేల్‌లో టాప్-5 డీల్స్ ఇవే!

శీతాకాలం అలర్ట్.. ఏసీ అవుట్ డోర్ యూనిట్‌కు కవర్.. కేవలం రూ.200తో రూ.20 వేల నష్టానికి చెక్!

Big Stories

Advertisement
×