E-Paper
Advertisement

మీ ఫోన్ ఏళ్ల తరబడి పాడవకూడదా? అయితే ఈ 5 సీక్రెట్ టిప్స్ పాటించాల్సిందే!

మీ ఫోన్ ఏళ్ల తరబడి పాడవకూడదా? అయితే ఈ 5 సీక్రెట్ టిప్స్ పాటించాల్సిందే!
Advertisement

How to increase smartphone lifespan: ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. యాపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్ లాంటి బ్రాండ్స్ నుంచి ఒక మంచి ఫోన్ కొనాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అంత డబ్బు పెట్టి కొన్న ఫోన్.. ఏడాది తిరక్కుండానే స్లో అయిపోతే లేదా బ్యాటరీ పాడైపోతే చాలా బాధేస్తుంది కదా! అయిత.. కొన్ని సింపుల్ కేరింగ్ టిప్స్ పాటిస్తే మీ ఫోన్ ఏళ్ల తరబడి అస్సలు హ్యాంగ్ అవ్వకుండా.. కొత్త దానిలా మెరిసిపోతుంది. మీ మొబైల్ లైఫ్‌ని డబుల్ చేసే ఆ టాప్ 5 క్రేజీ టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.

1. 20-80% ఛార్జింగ్ రూల్:
చాలా మంది చేసే అతిపెద్ద తప్పు ఏంటంటే.. ఫోన్ ఛార్జింగ్ 0% కి వచ్చే వరకు వాడటం, ఆపై 100% అయ్యే వరకు అలాగే ఉంచడం. మరికొందరైతే రాత్రంతా ఛార్జింగ్ పెట్టేసి పడుకుంటారు. దీని వల్ల లిథియం-అయాన్ బ్యాటరీలపై విపరీతమైన ఒత్తిడి పడి, ఏడాదిలోనే బ్యాటరీ హెల్త్ పడిపోతుంది.

Advertisement

స్మార్ట్ టిప్: మీ ఫోన్ బ్యాటరీ ఎప్పుడూ 20% కంటే తగ్గకుండా, 80% దాటకుండా చూసుకోండి. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే.. మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ ఏళ్ల తరబడి నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అలాగే ఒరిజినల్ ఛార్జర్లను మాత్రమే వాడండి.

2. స్టోరేజ్ క్లీనింగ్:
ఫోన్ మెమరీ ఫుల్ అయిపోతే ప్రాసెసర్‌పై లోడ్ పడి ఫోన్ ల్యాగ్ అవ్వడం, హీట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. వాట్సాప్ గుడ్ మార్నింగ్ మెసేజ్‌లు, అవసరం లేని డూప్లికేట్ ఫోటోలు, వాడని యాప్స్‌ని వెంటనే డిలీట్ చేయండి.

Advertisement

మ్యాజిక్ ట్రిక్: వారానికి కనీసం ఒక్కసారైనా మీ ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే అనవసరమైన క్యాచీ మెమరీ క్లియర్ అయి, రామ్ రిఫ్రెష్ అవుతుంది. ఫోన్ ఎప్పుడూ సూపర్ స్మూత్‌గా రన్ అవుతుంది.

3. ఎండలో ఫోన్ వాడొద్దు:
స్మార్ట్‌ఫోన్‌లకి అతిపెద్ద శత్రువు ‘వేడి’. గేమింగ్ ఆడుతున్నప్పుడు లేదా ఫోన్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు హెవీగా హీట్ అవుతుంటే కాసేపు వాడటం ఆపేయండి. ముఖ్యంగా కారు డ్యాష్‌బోర్డ్‌పై, బైక్ రైడింగ్ చేసేటప్పుడు డైరెక్ట్ ఎండ తగిలేలా మొబైల్ హోల్డర్స్‌లో ఫోన్ పెట్టకండి. విపరీతమైన వేడి వల్ల స్క్రీన్ డిస్‌ప్లే లైన్ ప్రాబ్లమ్స్ రావడం.. లోపల మదర్‌బోర్డ్ కాలిపోయే ప్రమాదం ఉంది.

4. నిర్లక్ష్యం వద్దు:
ఫోన్‌లో సాఫ్ట్‌వేర్ లేదా సెక్యూరిటీ అప్‌డేట్ రాగానే చాలా మంది “డేటా అయిపోతుంది” అనో, లేదా బద్ధకం వల్లో పోస్ట్‌పోన్ చేస్తారు. కానీ కంపెనీలు ఇచ్చే అప్‌డేట్స్‌లో ఫోన్ బగ్స్ ని ఫిక్స్ చేసే కోడింగ్ ఉంటుంది. అప్‌డేట్స్ సరిగ్గా చేసుకోకపోతే ఫోన్ హ్యాకర్ల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి వైఫై కనెక్ట్ చేసుకుని ఎప్పటికప్పుడు ఫోన్‌ను అప్‌డేట్ గా ఉంచండి.

5. కాసేపు కవర్ తీసేయండి:
మనం ఫోన్ కి వాడే హెవీ డిజైనర్ పౌచ్‌లు లేదా థిక్ రబ్బర్ కేసులు ఫోన్‌ని కింద పడినా కాపాడుతాయి కానీ.. ఫోన్ లోపల జనరేట్ అయ్యే వేడిని బయటకి పోనివ్వవు.

ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్ పెడుతున్నప్పుడు లేదా హెవీ గ్రాఫిక్స్ గేమ్స్ ఆడుతున్నప్పుడు మీ ఫోన్ బ్యాక్ కవర్ తీసేయడం చాలా మంచిది. దీనివల్ల ఫోన్ త్వరగా కూల్ అవుతుంది. అలాగే డిస్‌ప్లే పగలకుండా ఒక మంచి టెంపర్డ్ గ్లాస్ వాడటం అస్సలు మర్చిపోకండి.

మనం కారు లేదా బైక్‌ని ఎంత జాగ్రత్తగా సర్వీసింగ్ చేయిస్తామో.. మన చేతిలో ఉండే స్మార్ట్‌ఫోన్‌కి కూడా అంతే కేర్ అవసరం. 20-80% ఛార్జింగ్ మెయింటైన్ చేస్తూ.. అనవసరమైన యాప్స్ డిలీట్ చేసి, ఎండకు దూరంగా ఉంచితే చాలు.. మీరు 3 నుంచి 4 ఏళ్ల పాటు అస్సలు పాడవ్వకుండా కొత్త దానిలా పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది.

Related News

రూ. 10 వేలలోపు బెస్ట్ స్మార్ట్ టీవీ.. సగం ధరకే అదిరిపోయే ఫీచర్లు!

రూ.10వేలలోపు హోమ్ థియేటర్ ఎక్స్‌పీరియన్స్..బెస్ట్ స్మార్ట్ ప్రొజెక్టర్లు ఇవే!

రూ. 14,999 కే హైయర్ 32 ఇంచుల స్మార్ట్ టీవీ.. మతిపోయే ఫీచర్లతో రచ్చ

రూ. 899 కే 50 గంటల బ్యాటరీ..ట్రెండ్ సెట్ చేస్తున్న ఇయర్‌బడ్స్!

బిగ్ టీవీలో 3D లోకం.. వీక్షకులకు సరికొత్త విజువల్ వండర్.. అసలేంటీ ఇమ్మర్సివ్ టెక్నాలజీ?

స్టైలిష్ లుక్, అదిరిపోయే బేస్..రూ. 999 కే కేక పుట్టించే ఫీచర్స్

పెద్ద కుటుంబాలకు పర్ఫెక్ట్.. ఈ 10 కేజీల లేటెస్ట్ వాషింగ్ మెషీన్లపై ఓ లుక్కేయండి

కన్వర్టిబుల్ ఫ్రిజ్ కొంటున్నారా? మీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉండేందుకు బెస్ట్ టిప్స్

Big Stories

Advertisement
×