E-Paper
Advertisement

జుట్టు పీచులా మారిపోయిందా? శనగపిండి హెయిర్ మాస్క్‌తో మెరిసిపోవడం గ్యారెంటీ!

జుట్టు పీచులా మారిపోయిందా? శనగపిండి హెయిర్ మాస్క్‌తో మెరిసిపోవడం గ్యారెంటీ!
Advertisement

Besan hair mask for silky hair: ఈ రోజుల్లో పొల్యూషన్, స్ట్రెస్, కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల జుట్టు పీచులా మారిపోయి జీవం కోల్పోవడం చాలా మంది ఫేస్ చేసే కామన్ ప్రాబ్లం. దీనికోసం పార్లర్ల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు ఖర్చు పెట్టి కెరాటిన్ ట్రీట్‌మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. అయితే అంత ఖర్చు లేకుండా.. ఎలాంటి కెమికల్స్ లేని సహజమైన మెరుపు మీ జుట్టుకు రావాలంటే మన కిచెన్ లో ఉండే శనగపిండితో ఒక క్రేజీ హెయిర్ మాస్క్ రెడీ చేసుకోవచ్చు. ఆ మ్యాజికల్ హోమ్‌మేడ్ కెరాటిన్ మాస్క్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

శనగపిండితో బెనిఫిట్స్:

Advertisement

శనగపిండిని మనం సాధారణంగా బజ్జీలు వేసుకోవడానికో, లేదా ఫేస్ ప్యాక్ లా చర్మాన్ని మెరిపించడానికో వాడుతుంటాం. కానీ జుట్టు ఆరోగ్యానికి కూడా ఇది ఒక వరం లాంటిది. శనగపిండిలో ప్రొటీన్లు విపరీతంగా ఉంటాయి. మన జుట్టు కూడా కెరాటిన్ అనే ప్రొటీన్‌తోనే తయారవుతుంది. కాబట్టి, శనగపిండిని జుట్టుకు అప్లై చేసినప్పుడు అది హెయిర్ రూట్స్‌ని బలోపేతం చేసి, స్కాల్ప్‌ను క్లీన్ చేస్తుంది. ఇది జుట్టుకు నాచురల్ కండిషనర్‌గా పనిచేసి, పార్లర్ లో చేసే ప్రొటీన్ ట్రీట్‌మెంట్ లాంటి లుక్‌ని ఇస్తుంది.

హోమ్‌మేడ్ కెరాటిన్ మాస్క్ తయారీ విధానం:
ఈ మ్యాజికల్ హెయిర్ మాస్క్ తయారు చేసుకోవడానికి మీ కిచెన్ లో ఉండే 4 సింపుల్ పదార్థాలు చాలు.

Advertisement

కావలసిన పదార్థాలు:
శనగపిండి- 3 నుంచి 4 చెంచాలు

గడ్డ పెరుగు-2 చెంచాలు

కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్-1 చెంచా

తేనె-1 చెంచా

తయారు చేసే విధానం:
ఒక క్లీన్ బౌల్ తీసుకుని అందులో శనగపిండి, పెరుగు, కొబ్బరి నూనె, తేనె వేసి బాగా కలపాలి. ఎక్కడా గడ్డలు లేకుండా అచ్చం మనం పార్లర్‌లో వాడే హెయిర్ క్రీమ్ లా స్మూత్ పేస్ట్‌లా అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా రోజ్ వాటర్ లేదా నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేయాలి?
మొదట మీ జుట్టును చిక్కులు లేకుండా బాగా దువ్వుకోండి. జుట్టు కాస్త తడిగా ఉంటే మాస్క్ బాగా పడుతుంది. ఇప్పుడు ఈ శనగపిండి పేస్ట్‌ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పాయలు పాయలుగా విడదీస్తూ నీట్‌గా అప్లై చేయాలి. మాస్క్ మొత్తం పెట్టేసాక.. తల పైభాగంలో ముడి వేసుకుని ఒక 30 నుంచి 40 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. మాస్క్ జుట్టుకు బాగా పట్టి ఆరిపోయే వరకు ఉంచాలి. ఆ తర్వాత మైల్డ్ లేదా సల్ఫేట్ లేని కెమికల్ రహిత షాంపూతో గోరు వెచ్చని నీళ్లతో తలస్నానం చేయాలి.

ఈ మాస్క్ వల్ల కలిగే క్రేజీ బెనిఫిట్స్:
ఫ్రిజ్ కంట్రోల్: జుట్టు ఎగిరిపోకుండా.. పీచులా లేకుండా అల్ట్రా స్మూత్‌గా మారుతుంది.

స్కాల్ప్ క్లీనింగ్:తలలో ఉండే ఎక్సెస్ ఆయిల్, మురికి , డాండ్రఫ్ శనగపిండి ఈజీగా క్లీన్ చేస్తుంది.

హెయిర్ గ్రోత్: ఇందులో ఉండే ప్రొటీన్లు జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు పెరిగేలా ప్రమోట్ చేస్తాయి.

జనాలు ఇప్పుడు కెమికల్ హెయిర్ స్ట్రెయిటెనింగ్స్, స్పా ట్రీట్‌మెంట్స్ కంటే ‘క్లీన్ బ్యూటీ’వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అయితే శనగపిండి మాస్క్ వాడేటప్పుడు ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే.. తలస్నానం చేసేటప్పుడు నీళ్లతో జుట్టును బాగా కడగాలి. లేదంటే శనగపిండి పొడి జుట్టుకు అంటుకుపోయే ఛాన్స్ ఉంది. వారానికి ఒక్కసారి ఈ మాస్క్ వేసుకుంటే చాలు, మీ జుట్టు టెక్స్చర్ పూర్తిగా మారిపోతుంది.

కెరాటిన్ ట్రీట్‌మెంట్స్ కోసం వేల రూపాయల బడ్జెట్ పెట్టి, కెమికల్స్‌తో జుట్టును పాడుచేసుకోవడం కంటే.. మన అమ్మమ్మల కాలం నాటి ఈ శనగపిండి చిట్కా ఎంతో సేఫ్, ఎఫెక్టివ్. ఈ వీకెండ్ మీ బిజీ షెడ్యూల్ నుంచి కాస్త టైమ్ తీసి ఈ హోమ్‌మేడ్ హెయిర్ మాస్క్ ట్రై చేయండి.. మీ సిల్కీ అండ్ షైనీ హెయిర్‌తో అందరినీ సర్ప్‌రైజ్ చేయండి.

Related News

మతిమరుపు సమస్యతో బాధపడుతున్నారా? ఈ ఫుడ్స్ తింటే సూపర్ ఫాస్ట్ జ్ఞాపకశక్తి

ఈ నాలుగు సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, మీ జీవితంలో మంచి రోజులు మొదలైనట్లే!

చురుకైన మెదడు, మెరిసిపోయే చర్మం.. పురుషులు ఉదయాన్నే ఖాళీ కడుపున ఇవి తింటే ఎన్ని లాభాలో

మీ ఇంటి గార్డెన్‌లో అందమైన గులాబీ వనం.. వర్షాకాలంలో ఈ 5 రకాల గులాబీ మొక్కలు పెంచండి

కామెర్లు, హెపటైటిస్ ప్రాణాంతకం కావొచ్చు.. ఈ సంకేతాలు అసలు నిర్లక్ష్యం చేయకూడదు

ఆన్‌లైన్ లవర్‌ని తొలిసారి ప్రత్యక్షంగా కలుసుకోబోతున్నారా? ఈ 8 జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

ఇంట్లో వాడే.. నూనె మీ గుండెను దెబ్బతీస్తోందా?

జీరో కేలరీస్ అని ‘షుగర్ ఫ్రీ డ్రింక్స్’ తాగుతున్నారా ? జాగ్రత్త

Big Stories

Advertisement
×