E-Paper
Advertisement

మెుబైల్ డేటా ఊరికే అయిపోతోందా? టెన్షన్ వద్దు మామ.. ఈ స్టెప్స్ ఫాలో అయిపో!

మెుబైల్ డేటా ఊరికే అయిపోతోందా? టెన్షన్ వద్దు మామ.. ఈ స్టెప్స్ ఫాలో అయిపో!
Advertisement

Data Saving Tips: స్మార్ట్ ఫోన్ యూజర్లను ప్రధానంగా వేధించే సమస్యల్లో మెుబైల్ డేటా త్వరగా అయిపోవడం ఒకటి. రోజుకు 2GB, 3GB డేటా వచ్చే ప్లాన్స్ రీఛార్జ్ చేసుకుంటున్నప్పటికీ.. డేటా చాలడం లేదన్న అభిప్రాయాలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. తాము పెద్దగా వాడింది లేకపోయినా.. డేటా మాత్రం ఐస్ లా కరిగిపోతోందని పలువురు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని సులభమైన చిట్కాల ద్వారాను డేటాను ఏ విధంగా ఆదా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

డేటా సేవర్ మోడ్‌

ప్రతీ ఆండ్రాయిడ్, ఐఫోన్ లో ఈ డేటా సేవర్ (Data Saver) ఆప్షన్ కచ్చితంగా ఉంటుంది. కొన్నింట్లో లో డేటా మోడ్ (Low Data Mode) అనే ఆప్షన్ లో కనిపిస్తుంది. ఈ ఫీచర్ ను ఆన్ చేయడం ద్వారా బ్యాక్ గ్రౌండ్ లో యాప్స్ డేటాను ఉపయోగించకుండా అరికట్టవచ్చు.

యాప్ ఆటో అప్‌డేట్స్

Advertisement

కొన్ని యాప్స్ నిరంతరం అప్డేట్ అవుతూ.. డేటాను అత్యధికంగా తినేస్తుంటాయి. దీనికి చెక్ పెట్టేందుకు మెుబైల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ సెట్టింగ్స్ లోకి వెళ్లి.. యాప్స్ ఆటోమేటిక్ గా అప్డేట్ కాకుండా ఓవర్ వై-ఫై ఓన్లీ (Over Wi-Fi only) అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి. ఇక ఆ తర్వాతి నుంచి మీ అనుమతి లేకుండా మొబైల్ డేటాతో యాప్స్ అస్సలు అప్డేట్ కావు.

ఆటో ప్లే ఆఫ్ చేయడం

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్స్‌లో వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంటాయి. వీటి వల్ల కూడా మీ మెుబైల్ డేటా.. వేగంగా కరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. యాప్ సెట్టింగ్స్ లోకి వెళ్లి ‘నెవర్ ఆటో ప్లే వీడియోస్’ (Never Auto play Videos)ను ఎనేబుల్ చేయండి.

బ్యాక్‌గ్రౌండ్ డేటా పరిమితం

Advertisement

సాధారణంగా మనం వాడకపోయినా కొన్ని యాప్స్.. మెుబైల్ డేటాను వాడుతూనే ఉంటాయి. దీనికి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం ముందుగా మెుబైల్ లోని సెట్టింగ్స్ లోకి వెళ్లండి. అక్కడ యాప్స్ లోకి వెళ్లి.. అవసరంలేని యాప్స్ కు ‘బ్యాక్ గ్రౌండ్ డేటా’ (Background Data)ను డిసేబుల్ చేయండి.

క్వాలిటీ తగ్గించి చూడటం

యూట్యూబ్ లేదా ఇతర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో వీడియోలు చూసేటప్పుడు హై డెఫినిషన్ (HD) బదులు.. 480p అంతకంటే తక్కువ క్వాలిటీలో చూడటం అలవాటు చేసుకోండి. దీనివల్ల భారీగా మీ మెుబైల్ డేటాను సేవ్ చేసుకోవచ్చు.

Also Read: Redmi Phones: షావోమీ బడ్జెట్ ఫోన్లు.. నిజంగా బాగున్నాయ్ మాష్టారు.. హై రేంజ్ ఫీచర్లు చాలా తక్కువ ధరలో!

ఆఫ్‌లైన్ మ్యాప్స్, మ్యూజిక్

గూగుల్ మ్యాప్స్‌లో తరచూ వెళ్లే ప్రాంతాలను ముందే డౌన్ లోడ్ చేసుకుంటే ప్రయాణంలో డేటా అవసరం ఉండదు. అలాగే మ్యూజిక్ యాప్స్‌లో పాటలను డౌన్‌లోడ్ చేసుకుని ఆఫ్‌లైన్‌లో వినడం ద్వారా కూడా డేటా ఖర్చును తగ్గించుకోవచ్చు.

Also Read: మార్కెట్ లోకి BMW క్రేజీ అడ్వెంచర్ బైక్, ఏ వేరియంట్ తీసుకుంటే మంచిదంటే?

Related News

ట్రాయ్ దెబ్బకు దిగొచ్చిన Airtel.. కేవలం కాల్స్, ఎస్‌ఎంఎస్‌ల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్లు!

పిక్సెల్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. దీపావళి సేల్‌లో భారీ తగ్గింపులు, నవంబర్ 8 వరకే ఛాన్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో iPhone 17పై ఊహించని భారీ తగ్గింపు.. ఇంత తక్కువ ధరకు ఎప్పుడూ చూడలేదు!

వెదర్ రిపోర్ట్స్ ఇకపై వంద శాతం పక్కా.. మైక్రోసాఫ్ట్ సంచలన ప్రయోగం!

ఆకాశంలో ఓ అరుదైన నక్షత్రాన్ని కనిపెట్టిన సైంటిస్టులు.. ఇది ఎరంగులో ఉందంటే..?

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

Big Stories

Advertisement
×